Jump to content

చర్చ:కాశీవిశ్వనాధం పట్రాయుడు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

నేను బాల సాహిత్య రచయితని, నా వివరాలు తొలగించుటకు గల కారణాలు తెలుపగలరు ..కాశీవిశ్వనాధం పట్రాయుడు

కాశీవిశ్వనాధం గారూ, ముందుగా వికీలో రాయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. వికీపీడియా అనేది విజ్ఞాన సర్వస్వం అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇందులో వ్యక్తుల గురించి వ్యాసాలు రాయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. సదరు వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తులై ఉండాలి. అంటే వారి గురించి పరిశోధన పత్రాలలోనో, పుస్తకాల్లోనో, పత్రికల్లోనో, లేదంటే ఏదైనా పేరొందిన వెబ్ సైట్లలోనో వ్యాసాలు ప్రచురితమై ఉండాలి. ఎవరి గురించి వారు వ్యాసాలు రాసుకోలేరు. అంటే స్వీయ రచనలు వికీ అనుమతించదు. అందుకనే మీ వ్యాసం తొలగించబడింది. తొలగించబడిన వ్యాసాలు ఎక్కడికీ పోవు. మీరు సరైన మూలాలు చూపిస్తే మరెవరైనా ఈ వ్యాసాన్ని పునరుద్ధరిస్తారు. అంతవరకు మీ గురించి ప్రచురితమైన వ్యాసాలు ఉన్నాయా? ఉంటే మాకు ఇక్కడ సమర్పించండి. మీరు వికీకి కొత్త అయితే ముందుగా వికీపీడియా:ఐదు మూలస్తంభాలు చూడండి. వికీలో ఎలాంటి రచనలు చేస్తారో. కొంచెం అవగాహన వచ్చిన తర్వాత వ్యాసాలు ప్రారంభించవచ్చు. ఏదైనా సందేహాలుంటే ఇక్కడ అడగండి. - రవిచంద్ర (చర్చ) 15:46, 28 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]