చర్చ:గంగదేవిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దిన పత్రికలో వచ్చిన వ్యాసాన్ని యధాతథంగా ఎలాంటి అనుమతులు లేకుండా వికీలో చేర్చడం బాగుండదు. ఏవో కొన్ని వాక్యాలు తీసుకొను వాటికి రెఫరెన్స్ ఇవ్వడం భావ్యమే కాని మొత్తం వ్యాసమే కాపీ చేయడం కాపీ ఉల్లంఘన కిందికే వస్తుంది. ఇప్పటికే నేను ఇలాంటి వ్యాసాల గురించి చర్చాపేజీల్లో తెలీయజేశాను. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవసరమైతే ప్రయత్నించి మనమే కొంత సమాచారం రాబట్టవచ్చు. కాబట్టి ఈ వ్యాసం మొత్తం తొలిగించాలి. లేనిచో మునుముందు ఇలాంటి ఉల్లంఘనలు చాలా జరిగే అవకాశముంటుంది. అంతేకాకుండా ఇందులో చాలా వాక్యాలు వికీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు జిల్లాకు వచ్చే ఐఏఎస్ శిక్షణార్థులంతా ఈ గ్రామం గురించి చదవాల్సిందే వాక్యం. -- C.Chandra Kanth Rao(చర్చ) 12:34, 5 అక్టోబర్ 2008 (UTC)

అవును. ఆ ఈనాడు వ్యాసం నా దగ్గఱ ఉంది. సమయం చూసుకొని వ్యాసాన్ని తిరగ రాస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:40, 5 అక్టోబర్ 2008 (UTC)
గ్రామం పేరు గంగదేవి పల్లి అనుకుంటా. వార్తాపత్రికలలో పల్లి అనే ఇస్తున్నారు. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:11, 9 అక్టోబర్ 2008 (UTC)
అవును. ఈనాడు వ్యాసం బొమ్మలో మైలురాయి మీద "గంగదేవిపల్లి" అని ఉంది. దారి మారుస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:17, 9 అక్టోబర్ 2008 (UTC)