Jump to content

చర్చ:కంప్యూటరు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(చర్చ:గణనయంత్రం నుండి దారిమార్పు చెందింది)

సాంకేతిక పదాలకు తెలుగు అనువాదాలు

[మార్చు]

కంట్రోలు యూనిట్ ను నియంత్రించు విభాగము అనేకంటే నియంత్రణా విభాగము అంటే సబబుగా ఉంటుందని నా అభిప్రాయము. అలాగే మిగిలిన పదాలకు నిర్దిష్టమైన అనువాదాలు ఉపయోగిస్తే బాగుంటుంది. తెలుగు భాషా సంఘము ఈ విషయాలమీద యేదైనా ప్రచురించిందా? --వైఙాసత్య 19:26, 13 డిసెంబర్ 2005 (UTC)

అలాగే మనము వాటిని ఇంగ్లీషులో కనీసము ఒక్కసారి అయినా బ్రాకెట్లో వ్రాయడము సబబుగా ఉంటుందనుకుంట Chavakiran 06:05, 14 డిసెంబర్ 2005 (UTC)
మంచి ఆలోచన, వ్యాసములో ఆంగ్ల పదములు కొంచెము మితముగా ఉపయోగించడము మంచిది. --వైఙాసత్య 19:51, 14 డిసెంబర్ 2005 (UTC)
నాకు తెలుగు అనువాదములు ఇంటర్ నెట్ లో దొరుకుట కష్టముగా ఉన్నది. నేను www.sahiti.org/dict/index.jsp ని వాడుచున్నాను. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 11:18, 15 డిసెంబర్ 2005 (UTC)

కొన్ని సమాంతర పదాలు

[మార్చు]
  • Manual = స్వహస్త ఉదా: Manual Testing స్వహస్త పరీక్ష
  • Automatic = యాంత్రిక ఉదా: Automatic Testing యాంత్రిక పరీక్ష

పైవిధంగా ఉపయోగిస్తే బాగుంటుందని వ్యాసంలోనూ మార్పులు చేస్తున్నాను, ఎవరైనా వ్యతిరేకిస్తే తెలుపగలరు

TeluguPadam 18:03, 28 అక్టోబర్ 2009 (UTC)

ఈ వ్యాసాన్ని కొంతవరకు ప్రక్షాళన చేయదలిచాను

[మార్చు]

ఈ వ్యాసాన్ని కొంతవరకు ప్రక్షాళన చేయదలిచాను

  1. రోజువారీ కంప్యూటర్ పరిభాష అర్థం కావడానికి ఇచిన ఆంగ్ల పదాలను తెలుగు లిపిలోనికి మార్చడం. (లిపి మాత్రమే, భాష కాదు)
  2. కొన్ని పదాలకు మరింత మంచి తర్జుమా ఇవ్వడం (ట్రాఫిక్ లైట్స్ != సంచార దీపాలు :))

మొదలగునవి

--Criticpanther (చర్చ) 22:17, 28 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కంప్యూటర్ అన్న పేరుమార్పుకు ప్రతిపాదన

[మార్చు]

తెలుగు వికీపీడియా అన్నది ఒక తృతీయ స్థాయి మూలం. ప్రజలకు ఇప్పటికే ఉన్న సమాచారం, విజ్ఞానం క్రోడీకరించి అందించే వనరు. దీనిలో వాడుక భాషే ఉపయోగించాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అలాంటి అంశాలపై వ్రాస్తున్నవారు ప్రధానంగా ఎలాంటి పదాలను వినియోగిస్తున్నారో అలాంటి పదాలనే ఉపయోగించాలి. కంప్యూటర్ ని తెలుగు అనువాదంలో గణన యంత్రం అంటారని తెలుసు. ఐతే దానికి వాడుక వ్యాప్తి తక్కువ. గూగుల్లో వెతికి చూస్తే గణన యంత్రం అన్నదానికి ఈ నిమిషం వెతికి చూస్తే 4,450, గణనయంత్రం అన్నది వెతికితే 136 పేజీలు వచ్చాయి. వీటిలో అత్యధిక శాతం తెలుగు వికీపీడియా, ఈనాడు పత్రికల పేజీలే. మిగిలిన వాటిలో ఎక్కువ భాగం గణనయంత్రం అన్నదాన్ని కాలిక్యులేటర్ అన్న అర్థంతో వాడుతున్నారు. కంప్యూటర్ అని వెతికితే 2,52,00,00,000, కంప్యూటరు అని వెతికినప్పుడు 21,800 పేజీలు వచ్చాయి. విశేషం ఏమిటంటే వీటిలోనూ తెలుగు వికీపీడియా పేజీలు కొన్ని (కంప్యూటర్ చరిత్ర, కంప్యూటరు శాస్త్రం) వగైరా), ఈనాడు ప్రతిభ వాళ్ళ పేజీలు మరికొన్నీ వస్తున్నాయి. అసంఖ్యాకమైన పేజీల్లో కంప్యూటర్ అనే వాడుతున్నారు. వ్యక్తిగతంగా భాషాభిమానం కొద్దీ కొందరు ప్రతీ ఆంగ్ల పదానికి తెలుగు సమానార్థక పదం పుట్టించాలని చేసే ప్రయత్నాలు ఇష్టపడితే ఇష్టడపడవచ్చు, వేరే వేదికలపై వాటి కోసం పనిచేసినా చేయొచ్చు. ఐతే మార్పు అనేది వాడుకలో వచ్చాకానే తెలుగు వికీపీడియాలో రావాలని, అంతవరకూ వాడుక భాషలో ఉన్న కంప్యూటర్, కంప్యూటరు వంటి పదాలనే ఉపయోగించాలని (కావాలంటే దీన్ని తెలుగులో గణన యంత్రం అని కూడా అంటారని రాసుకోవచ్చు, మూలాలు ఇచ్చి) ప్రతిపాదిస్తున్నాను. అందుకు అనుగుణంగా పేజీని కంప్యూటర్ అన్న దారిమార్పు పేజీకి తరలించి, గణనయంత్రం అన్నదాన్ని (కొన్ని వేల పేజీల వాడుకలో ఉంది కనుక) దానికి దారిమార్పుగా ఉంచాలని ప్రతిపాదన. --పవన్ సంతోష్ (చర్చ) 06:11, 30 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]