చర్చ:చంద్రుడు
Jump to navigation
Jump to search
- చంద్రుడి గురించి వ్రాసేటపుడు, చంద్రుడి విశేషాలు వర్ణించేందుకు కొన్ని పదజాలాలు అవసరమయ్యాయి, అవి తెలుగు పుస్తకాలలో నేను గమనించలేదు. వాటి కొరకు కొన్ని తెలుగు పదాలు సృష్టించాను, సభ్యులకు అవి సబబుగా అనిపిస్తే ఉపయోగించండి, లేదా దయవుంచి ప్రత్యామ్నాయాలను సూచించి తోడ్పడండి.
- చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి "చంద్ర భ్రమణం" (ఇది క్రొత్త పదం, సృష్టించబడినది)
- చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి "చంద్ర భూ పరిభ్రమణం" (ఇది క్రొత్త పదం, సృష్టించబడినది)
- చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి (చంద్రభ్రమణం) మరియు భూమి చుట్టూ తిరగడానికి (చంద్ర భూ పరిభ్రమణం) ఒకే సమయం (చంద్రమాసము) పడుతుంది.
- చంద్రుడు భూమితో కలసి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి "చంద్ర భూ సూర్య పరిభ్రమణం" (ఇది క్రొత్త పదం, సృష్టించబడినది) భూపరిభ్రమణానికి పట్టే కాలంతో సమానం. సభ్యుడు నిసార్ అహ్మద్ 12:47, 16 మే 2008 (UTC)