చర్చ:డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
Jump to navigation
Jump to search
ఈ పేజీలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా నిజమైనవి. మరియు కప్పగంతు రామకృష్ణ అను నా స్వంత విషయాలే ఇవన్నీ అని ఇందుమూలంగా ధృవీకరణ చేస్తున్నాను. నాకు సంబంధించి ఇంతకుముందు తయారుచేసిన విషయాన్నే ఈ పేజీలో వినియోగించాను. అంతకుముందు విషయాన్ని మరే ఇతరవిధంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించలేదు
- వాడుకరి:Dr Kappagantu Rama Krishna గారూ, మీరు రాసిన వ్యాసానికి తొలగింపు ప్రతిపాదన చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి.
1. వికీపీడియాలో ఖాతా ఉన్న వాడుకరి తన పేరుతో వ్యాసం సృష్టించుకోవడం వికీపీడియా నియమాలకు విరుద్ధం.
-మీ గురించి మీరు మీ వాడుకరి పేజీలో రాసుకోవచ్చు.
2. వికీపీడియాలో వ్యాసాలకు మూలాలు ఉండాలి.
-వికీపీడియాలో రచనకు సంబంధించి ఈ క్రింది నిబంధనలు, సూచనలు ఉన్నాయి, గమనించగలరు:
- ఇతర సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట).
- అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. స్థూలంగా కింది నియమాలు చూడండి..
- వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు.
- ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.
- మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు. వివిధ ప్రామాణిక ప్రచురణల్లో (గ్రంథాలు, పత్రికలు, వెబ్‌సైట్లు వగైరా) ఉన్న సమాచారాన్ని సేకరించి వికీపీడియా అనే చోట పెడుతున్నాం అనే సంగతిని గ్రహించండి.
- మూలం లేందే మనం రాసే సమాచారానికి వికీలో విలువ ఏమీ ఉండదు. సమాచారం ఇంకా వేరే చోట్ల కూడా ఉందా లేక ఈ వ్యక్తి స్వయంగా కల్పించి రాసినదా అనేది చదివేవాళ్ళు కూడా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకునే అవకాశం రాసేవాళ్ళు ఇవ్వాలి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 17:38, 31 జూలై 2020 (UTC)
- డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారుఈ ఖాతా పేజీలో ఉన్న అంశాలు చదవండి ప్రభాకర్ గౌడ్ నోముల 17:49, 31 జూలై 2020 (UTC)