చర్చ:తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2006
స్వరూపం
Untitled
[మార్చు]సమైక్యవాదులు సైతం జై తెలంగాణ అంటున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్పని సరిగా మారుతున్నది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను విడదీయాలని కొందరు, తలలేని మొండెం మాకొద్దని కొందరు వాదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింల మనుగడకు ఏముప్పు ఏర్పడదు. ఇక్కడ ఉర్దూ, తెలుగు ప్రజలు కలిసే ఉన్నారు.ఎందరో తెలంగాణా ముస్లిం రైతులు కూడా ఆత్మహత్య ల పాలయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తుర్రెబాజ్‌ఖాన్ వంటి వీరులు లేరా? తెలంగాణ రైతాంగ పోరాటం లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొనలేదా?. బందగీ , షోయెబుల్లాఖాన్ , మఖ్దూం మొహియుద్దీన్ గులాం యాసిన్ వంటి వారు తెలంగాణా బిడ్డలే. తెలంగాణ ప్రజలు తెలుగుతోపాటు ఉర్దూని కూడా తమ భాష గానే భావిస్తారు. అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణా లోని అందరు ముస్లిం లకు ప్రతినిధికాదు .
- 'పరక చాపలకు గాలాలేసే తురక ల పోరలు యాడికోయిరి, లారీలల్ల క్లీనర్లయ్యిర? పెట్రోలు మురికిల మురికయ్యిన్రా? తల్లీ- దూదు సేమియకు దూరమయ్యినారో సాయిబు ల పోరలు, ఆ బేకరి కేఫుల ఆకలి తీరిందో ఆ పట్టణాలలో!' - అని గోరటి ఎంకన్నపాడిన పాట అక్షర సత్యం.--Nrahamthulla 13:34, 21 అక్టోబర్ 2008 (UTC)