చర్చ:తెలంగాణ ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శైలి సమస్యలు[మార్చు]

కణకణలాడే నిప్పును ముద్దాడి తన శ్వాస ఆశ ఆశయం తెలంగాణ రాష్ట్రం అంటూ ఉద్యమ సాక్షిగా మంటల్లో మాడి మసి అయిన విద్యార్థి శ్రీకాంతాచారి, 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన అమరుడు శ్రీకాంతాచారి. ఇందులో కవిత్వం ఎక్కువైంది. ఇది వికీ శైలి కాదు. ప్రత్యేక రాష్ట్రం ఆశయంగా శ్రీకాంతాచారి అనే విద్యార్థి 2009 డిసెంబరు 3 న ఆత్మాహుతి చేసుకున్నాడు అంటే సరిపోతుంది.రవిచంద్ర (చర్చ) 17:28, 6 డిసెంబరు 2018 (UTC)

అవును రవిచంద్ర గారు. నాక్కుడా అదే అనిపించింది. 2015, డిసెంబరు 4న ప్రభాకర్ గౌడ్ నోముల గారు అది రాశారు. ఎప్పటినుండో దాన్ని మారుద్దాం అనుకుంటున్నా. కాకపోతే,దాన్ని మారిస్తే ఉద్దేశ్యపూర్వకంగా మార్చారు అన్న మాట వస్తుందని ఆగిపోయా.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:35, 6 డిసెంబరు 2018 (UTC)
Pranayraj Vangari వికీ బయట మనకు ఎన్ని అభిప్రాయాలున్నా ఇక్కడ పని చేస్తున్నప్పుడు మనం నియమాలకనుగుణంగా పనిచేసే స్వచ్చంద సేవకులు మాత్రమే. కాబట్టి ఎవరూ ఏమీ అనుకోరు. ధైర్యంగా మార్పులు చేయడం అన్నది వికీ స్ఫూర్తి. రవిచంద్ర (చర్చ) 17:53, 6 డిసెంబరు 2018 (UTC)
తప్పకుండా రవిచంద్ర గారు. అలానూ చేస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:58, 6 డిసెంబరు 2018 (UTC)