చర్చ:తెలంగాణ రాష్ట్ర సమితి
స్వరూపం
Election box metadata
[మార్చు]This article contains some sub-pages that hold metadata about this subject. This metadata is used by the Election box templates to display the color of the party and its name in Election candidate and results tables.
These links provide easy access to this meta data:
- తెలంగాణ రాష్ట్ర సమితి color Content:
- తెలంగాణ రాష్ట్ర సమితి shortname Content: తె.రా.స
తెలంగాణ రాష్ట్ర సమితి వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]తెలంగాణ రాష్ట్ర సమితి వ్యాసాన్ని తొలగించాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. కాబట్టి ఒక పార్టీకి సంబంధించి రెండు వ్యాసాలు ఉండటంవల్ల ఇబ్బందులు వస్తాయి. అన్ని భాషల వికీపీడియా వ్యాసాలలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా మార్చారు. 2409:4070:6E93:9903:0:0:4F4A:3911 09:29, 11 జూన్ 2023 (UTC)
- గతంలో కొన్ని వ్యాసాల విలీనం, దారిమార్పు, తొలగింపుల వల్ల ఆయా వ్యాసాల పాత చరిత్రను వికీపీడియా కోల్పోయింది. ఉదాహరణకు: పాత నియోజకవర్గాల వ్యాసాల విలీనం, దారిమార్పు, తొలగింపుల వల్ల ప్రస్తుతం వాటి వివరాలు చరిత్ర మొదలైనవి వికీలో లేకుండా పోయాయి. నియోజకవర్గ పునర్విభజన తరువాత విలీనం, దారిమార్పు, తొలగింపులకు గురైన ఆయా నియోజకవర్గ వ్యాసాలు మళ్ళీ సృష్టించాలన్న చర్చ కూడా వచ్చింది.
- ఇదికూడా అలాంటిదే... 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి, 2022లో భారత్ రాష్ట్ర సమితిగా మార్చబడింది. అయితే, భారత్ రాష్ట్ర సమితిగా మార్చబడడానికి ముందు ఏవైనా వివరాలు, అప్పటి నాయకుల గురించిన వ్యాసాలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గురించే ఖచ్చితంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పేజీ అవసరం ఉంటుంది. కాబట్టి, రెండు పేజీలు ఉండాలన్నది నా అభిప్రాయం.
- తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చబడింది అని రెండు వ్యాసాలలో రాయబడింది. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత్ రాష్ట్ర సమితి ల చరిత్ర, వివరాలు అన్నీ దేనికవే ప్రత్యేకమైనవి. అలాంటప్పుడు చరిత్రను తుడిపేయడం ఎందుకు అనేది నా భావన. కావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి వ్యాసంలో పైన 'ఇది భారత్ రాష్ట్ర సమితి' పార్టీగా పేరు మార్చబడింది అని కూడా వచ్చేలా పెట్టవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:57, 11 జూన్ 2023 (UTC)