Jump to content

చర్చ:తెలుగు సాహితీకారుల జాబితాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసం అమరిక

[మార్చు]

This is move kind of page, after dividing telugu saahityaM page,

We need to write this in a better way,

We need a better classification of both prakriyalu, and Times of sahitI kaarulu.

I think more appropriate way of classification is based upon time, instead of these three classifications.

Also we can put another page where we clasify according to prakirya eg.. novala, short story etc..

Very good idea Kiran, go ahead dude. All the support for you. This was the one page which badly needed a reorganization --వైఙాసత్య 00:44, 20 August 2005 (UTC)

ఈ విషయాన్ని ఇలా వర్గీకరిస్తే బాగుంటుంది అనుకొంటున్నాను

తెలుగు సాహిత్య చరిత్ర - యుగములు
భాషాభివృద్ధికి జరిగిన, జరుగుతున్న పనులు
తెలుగు సాహిత్య ప్రక్రియలు - పురాణములు, జానపదములు, స్త్రీలపాటలు, కావ్యములు, శతకములు, గద్యము, నాటకములు, విమర్శలు, సినిమా పాటలు, కీర్తనలు, విప్లవ సాహితి, పత్రికలు, కథలు, అనువాదములు, ప్రయోగములు ....... వగయిరా
ప్రముఖ సాహితీకారులు -పురాణ యుగము, ప్రబంధ యుగము, (1800-1900) యుగము, (1900 తరువాత) ఆధునిక యుగము
ప్రముఖ సాహితీకారులు - పురాణములు, కావ్యములు, శతకములు, గద్యము, నాటకములు, విమర్శలు, సినిమా పాటలు, కీర్తనలు, విప్లవ సాహితి, పత్రికలు,కథలు, అనువాదములు, ప్రయోగములు ....... వగయిరా
ప్రముఖ సాహిత్యము (పుస్తకములు) - ఇది పుస్తకాల సమీక్షకు మంచి వేదిక కాగలదు. ముఖ్యముగా వర్ధమాన రచయితలు దీనిని ఉపయోగించుకొనే అవకాశం ఉన్నది.

నా అభిప్రాయములో వర్గీకరణ చేసి ఉంచడం మంచిది. క్రమంగా సభ్యులు వ్యాసాలు చేర్చే అవకాశం ఉంటుంది.


  • సభ్యుల అభిప్రాయము కోరుతున్నాను.
  • నాకు వర్గీకరణ చేసే విధానము బాగా తెలియదు. వేరెవరైనా సహరించ గోరుతున్నాను.


కాసుబాబు 16:43, 17 ఆగష్టు 2006 (UTC)

వర్గాలు

[మార్చు]

"సుప్రసిద్ధ ఆంధ్రులు" లో "సాహితీ కారులు" అనే ఉపవర్గము ఉన్నది.

అలాగే "తెలుగు సాహితీకారులు" అని మరొక వర్గము ఉన్నది.

వీటిని కలిపివేయగోరుతున్నాను

కాసుబాబు 15:17, 19 ఆగష్టు 2006 (UTC)

అన్నీ తెలుగు సాహితీకారులు వర్గానికి మారుస్తాను --వైఙాసత్య 15:50, 19 ఆగష్టు 2006 (UTC)

వ్యాసంలో కొంత భాగం తొలగింపు

[మార్చు]

తెలుగు సాహితీకారులు వ్యాసంలో క్రింది భాగాన్ని తొలగించి ఈ వ్యాసం చర్చా పేజీలో ఉంచడమైనది. అవుసరమున్నచోట వాడుకొన వచ్చును.

కారణం: ఈ భాగం దాదాపు తెలుగు సాహిత్యము అనే వ్యాసంలో పునరావృతమైంది.


ఆదికవి నన్నయ (నన్నయ భట్టారకుడు) కు ముందు తెలుగులో ప్రామాణిక గ్రంధాలు లేవు. మహా భారతము అనువాదానికి పూనుకొన్నపుడు రచనకు అవసరమైన కథాంశాన్ని సంస్కృత మూలం నుండి స్వీకరించినా, రచనకు అవసరమైన భాష, శైలి, వ్యాకరణం మొదలైన వాటిని తానే సృజించుకున్నాడు. అందుకే ఆయన ఆదికవి అయ్యాడు, వాగనుశాసనుడైనాడు. నన్నయ తరువాత కవిబ్రహ్మ తిక్కన (తిక్కన సోమయాజి) మహాభారత రచనను కొనసాగించాడు. ఎర్రన (ఎర్రాప్రగడ) పూర్తి చేసాడు. ప్రబంధ పరమేశ్వరుడు అని ఆయనకు పేరు. ఈ ముగ్గురినీ కవిత్రయం అంటారు.


తరువాతి కాలాల్లో తెలుగు భాష ఎన్నో మార్పులకు లోనైంది. తెలుగు సాహిత్యం లో ఎన్నో మార్పులు వచ్చాయి. పురాణాలు, భక్తి రస రచనలు దాటి, శ్రింగార రస ప్రధానమైన రచనల కాలం వచ్చింది. అదే ప్రబంధ యుగం. శ్రీనాథుడు ఈ యుగంలో ప్రముఖ రచయిత. ఈ కాలంలో శ్రీకృష్ణదేవ రాయల కాలం తెలుగు భాషకు ఒక స్వర్ణ యుగం గా పరిగణించవచ్చు. స్వయంగా కవీ, కవి పోషకుడూ నైన రాయలు తన ఆస్థానంలో అష్ట దిగ్గజాలనే ఎనిమిది మంది కవులను పోషించాడు.


తదుపరి కాలం వేమనది. వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. ప్రజలకు చక్కగా అర్ధమయ్యేలా, తేట తెలుగు లో వేమన చెప్పిన పద్యాలు ఈ నాటికీ ప్రజలను అలరిస్తున్నాయి.


తరువాతి కాలం ఆధునిక యుగం. భాషలోను, సాహిత్య రీతులలోను గణనీయమైన మార్పులు వచ్చిన కాలం ఇది. సామాన్య ప్రజలకు అర్ధం కాని గ్రాంధిక భాషను పక్కన పెట్టి, వాడుక భాషలో రచనలు చెయ్యడం మొదలైంది. గిడుగు రామమూర్తి వాడుక భాషా ఉద్యమానికి పితామహుడు. గురజాడ దీనికి మరింత ఊతమిస్తూ వాడుక భాషలోనే రచనలు చేసాడు.


భావ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబరులు, పైగంబరులు, వచన కవిత, కథ, అవధానం, నవల, నవలిక, పేరడీ, ఘజల్‌, రుబాయీలు, హై-కు, కాల్పనికవాదం, వాస్తవికత, అధివాస్తవికత, దళిత వాదం, స్త్రీ వాదం ఇలా ఎన్నో సాహిత్య రూపాలు, ఎన్నో వాదాలు, ఇజాలు ఈ కాలం లో వచ్చాయి, వస్తున్నాయి.

--కాసుబాబు 16:04, 5 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సాహితీ కారులు

[మార్చు]

ఈ వ్యాసాన్ని తెలుగు సాహితీ కారులు నుండి తెలుగుసాహితీకారుల జాబితా అనే పేరున తరలిస్తే బావుండనుకొంటున్నాను. అలా చేస్తే సుప్రసిద్ద ఆంద్రులు వర్గంలోని ఈ వ్యాసంలో అవర్గంలో లేని పేర్లను వెతుక్కుంటారు,లేదా చేరుస్తారు,లేదా మారుస్తారు...విశ్వనాధ్. 11:21, 19 నవంబర్ 2007 (UTC)