చర్చ:నర్గీస్ తుఫాను
Jump to navigation
Jump to search
"మనుషులపేర్లు తుఫానులకు పెట్టడం వల్ల ఆయా వ్యక్తులకు కూడా చెడ్డ పేరు వస్తున్నది.వాస్థవానికి తుఫానుకు కత్రినాకు, నర్గీసుకు ఏ మాత్రం సంభందం లేదు.జార్జి బుష్ తుఫాను,నెహ్రూ తుఫాను,మరో మహనీయుడి పేరుతో వచ్చిన తుఫానో అనే పిలవాలా? " ఇది మరీ వ్యక్తిగత అభిప్రాయంలా ఉన్నది, తొలగించాలనుకుంటాను. Chavakiran 11:02, 20 మే 2008 (UTC)
- అవి పత్రికల ద్వార సృష్టించబడిన పేర్లు. అలానే రికార్డులకు కూడా చేర్చుతున్నారుగా. మనం కూడా అలానే వాడటం వలన చదివే వారికి కన్ప్యూషన్ ఉండదుగా.--విశ్వనాధ్. 11:10, 20 మే 2008 (UTC)
- ఉత్తర అమెరికాలో 'హరికేన్ కట్రీనా', 'ట్రాపికల్ కట్రీనా', ప్రకృతివైపరీత్యాలైన తుఫానులకు పేర్లు, అలాగే 'కట్రీనా' లేదా 'కత్రీనా' ఒక (given name) నామవాచకం కూడాను. అంతేగాక అమెరికాలో ఒక సరస్సు పేరు 'కట్రీనా'. అదేవిధంగా బర్మా లో యేర్పడే తుఫానుకు బర్మాలో 'నర్గిస్' అని పేరు పెట్టారు (అక్కడి లోకల్ భాషలో 'నర్గిస్' అంటే యేమిటో తెలియదు). కాని భారత ఉపఖండంలో ఉర్దూ భాషలో 'నర్గిస్' ఓ గుల్మము పేరు. సాధారణంగా ముస్లింలలో ఆడపిల్లలకు ఈ పేరు పెట్టేవారు. మనిషే ప్రకృతిలోని పలు విషయాల పేర్లను తాను పెట్టుకుంటున్నాడు (సాహిత్య పరంగా). ప్రకృతిలో ఘనమైన విషయాలకు 'మహా మనుషుల' పేర్లు గౌరవ సూచకంగా వాడడం చూశాము గాని, ప్రకృతి వైపరీత్యాలకు పేరొందిన వారి పేర్లను వాడడం చూడలేదు. ఈ వైపరీత్యాలకు, భారత్ లో పేరొందిన వారికీ ఎలాంటి లంకె లేదు. బహుశా ఈ తుఫానుల పేర్లు తరతరాలుగా వస్తున్నవే, 'త్సునామీ' లేదా 'సునామీ' లాగా. నిసార్ అహ్మద్ 11:36, 20 మే 2008 (UTC)