చర్చ:నాగిళ్ళ
స్వరూపం
ఇటీవల తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాల వల్ల గ్రామావ్యాసాలలో చాలా సమాచారం మార్చవలసి ఉంది. ఇది చాలా ఓపికతో, పరిశీలనతో చేయవలసిన కార్యము. ఇక్కడ కాపిపేస్టులు, తొందరపాటు పనికిరాదు. ఎందుకంటే చాలా మండలాలు ముక్కలయ్యాయి. పూర్వపు ఒకే మండలంలోని గ్రామాలు ఇప్పుడు వేర్వేరు జిల్లాలలో చేరినవి చాలా ఉన్నాయి. అలాగే పూర్వపు మండలాలలో ప్రక్కమండలపు గ్రామాలు చేరాయి. ఒక మండలము కొత్తజిల్లాలో చేరితే ఆ మండలపు అన్ని గ్రామాలు కొత్తజిల్లాలో చేరలేవు. ఇది గమనించదగ్గ విషయము. అంతేకాకుండా ఒక మండలం ముక్కలై ఒక భాగం కొత్తజిల్లాలో చేరగా మిగితా భాగం పాతజిల్లాలోనే ఉంది. ముందుగా వర్గాలు కాని, మూసలుకాని తయారుచేస్తే AWB ద్వారా సమాచారంలో మార్పుచేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:25, 1 ఫిబ్రవరి 2017 (UTC)