Jump to content

చర్చ:నిసార్ అహ్మద్ సయ్యద్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

request for CSD

[మార్చు]

en:WP:AUTOBIO ప్రకారం, ఎవరైనా, వాళ్ళ గురించి వాళ్ళు వ్యాసాలు వ్రాయకూడదు. అందువల్ల నిసార్ అహ్మద్ సయ్యద్ ని తెవికీ నుండి వెంటనే తుడిపేయాలన్నది నా అభిప్రాయం. సాయీ(చర్చ) 10:37, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


సాయీ గారూ నమస్కారం, నా పేరు నిసార్ అహ్మద్, మదనపల్లెకు చెందినవాడిని, ప్రస్తుతం పుణె మహారాష్ట్రలో నివాసం. నేను నా సభ్యత్వాన్ని నమోదు చేసుకొని మరీ వ్రాస్తున్నాను. నా ప్రధాన వ్యాసాలు ఉర్దూ మరియు ఇస్లాం, ఇతరవిషయాలపై కూడా వ్రాస్తున్నాను, తెలుగుభాషను ఎవరూ మరవకూడదని వ్రాసున్నాను. వేరే పేర్లతో సభ్యత్వాలు లేవు. నా పేజీని నేను స్వంతంగా సృష్టించుకోలేదు. కొన్ని మెరుగులు మాత్రం చేశాను (ఫోటో అప్లోడు, మరియు కొన్నివివరాలు). మీరు నన్ను సూటిగా అడిగారు, ఆ విధము చాలా నచ్చింది. మీరు అనుమానించడము నొప్పించింది. మీరు కొత్త సభ్యులనుకొంటాను, సయ్యద్ నిసార్ అహ్మద్ పేరుగల పేజీ తీసివేయడంలో నాకెలాంటి అభ్యంతరమూ ఉండకూడదు, ధన్యవాదాలు. మిత్రుడు nisar 11:15, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


పైనున్న చర్చల అనంతరం ఈ వ్యాసం చరిత్రను పరిశీలించడం జరిగింది. ప్రస్తుత చరితం ఇలా ఉన్నది.
(ప్రస్తు) (గత)  07:46, 1 మార్చి 2008 Svrangarao (చర్చ | రచనలు | నిరోధించు) (4,123 బైట్లు) (Sai2020 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 273980 ను రద్దు చేసారు) (రద్దుచేయి | దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  06:01, 1 మార్చి 2008 Sai2020 (చర్చ | రచనలు | నిరోధించు) (4,134 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  19:12, 20 జనవరి 2008 Ahmadnisar (చర్చ | రచనలు | నిరోధించు) (4,123 బైట్లు) (→ఉర్దూ భాషా మరియు సాహితీ సేవ) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  18:55, 20 జనవరి 2008 Ahmadnisar (చర్చ | రచనలు | నిరోధించు) (4,117 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  20:12, 18 జనవరి 2008 Ahmadnisar (చర్చ | రచనలు | నిరోధించు) (3,952 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  19:09, 18 జనవరి 2008 Ahmadnisar (చర్చ | రచనలు | నిరోధించు) (3,583 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  13:14, 13 డిసెంబర్ 2007 విశ్వనాధ్.బి.కె. (చర్చ | రచనలు | నిరోధించు) చి (3,075 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  16:09, 10 డిసెంబర్ 2007 Dev (చర్చ | రచనలు | నిరోధించు) చి (3,002 బైట్లు) (→ఉపాధ్యాయ వృత్తి: అచ్చుతప్పు సవరణ) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  19:44, 23 నవంబర్ 2007 221.134.250.23 (చర్చ | నిరోధించు) (3,005 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  18:35, 23 నవంబర్ 2007 Mpradeep (చర్చ | రచనలు | నిరోధించు) (3,001 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  16:53, 23 నవంబర్ 2007 Ahmadnisar (చర్చ | రచనలు | నిరోధించు) (2,895 బైట్లు) (→ఉర్దూ భాషా మరియు సాహితీ సేవ) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  11:26, 21 నవంబర్ 2007 221.134.249.175 (చర్చ | నిరోధించు) (2,553 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  07:32, 19 నవంబర్ 2007 కాసుబాబు (చర్చ | రచనలు | నిరోధించు) చి (2,554 బైట్లు) (శైలిలో చిన్న మార్పులు - (ఏక వచన ప్రయోగం)) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  18:48, 18 నవంబర్ 2007 221.134.250.218 (చర్చ | నిరోధించు) (3,038 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  22:06, 17 నవంబర్ 2007 Ahmadnisar (చర్చ | రచనలు | నిరోధించు) (725 బైట్లు) (221.134.250.177 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 208460 ను రద్దు చేసారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  19:40, 17 నవంబర్ 2007 221.134.250.177 (చర్చ | నిరోధించు) (755 బైట్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) 
(ప్రస్తు) (గత)  19:35, 17 నవంబర్ 2007 221.134.250.177 (చర్చ | నిరోధించు) (606 బైట్లు) (కొత్త పేజీ: మదనపల్లె కు చెందిన ప్రముఖ ఉర్దూ కవి, విద్యావేత్త, మదనపల్లె జిల...) 


ఈ వివరాలను బట్టీ, అహమ్మద్ నిసార్ ఇచ్చిన సమాచారాన్ని బట్టీ చూస్తే అహమ్మద్ నిసార్ ఈ వ్యాసంలో చిన్న చిన్న దిద్దుబాట్లే చేసినట్లు గ్రహించవచ్చును. కనుక వికీపీడియా విధానాలకు భంగం కలుగలేదు. వ్యాసాన్ని తొలగించవలసిన అవసరం లేదు అని నా అభిప్రాయం. చర్చను లేవనెత్తిన సాయికీ, సంయమనంతో సమాధానం ఇచ్చిన అహమ్మద్ నిసార్‌కూ ధన్యవాదాలు. --కాసుబాబు 06:16, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సైట్ని బట్టి వ్యాసం మెదలుపెట్టిన 221.134.250.177 పూనేలో ఉంది. నిసార్ గారు తాను ప్రస్తుతం ఉంటున్నది పూనే అని చెప్పారు. కాబట్టి ఈ వ్యాసాన్ని తుడిపేయాలని విగ్నప్తి చేస్తున్నాను సాయీ(చర్చ) 13:18, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఇప్పుడే సాయిగారు చెప్పిన ఆటోబయో రూల్స్ గురించి చదివాను. నిజానికి నిసార్‌గారు చేసిన మార్పులు, చేర్పుల గురించి పట్టించుకోవలసిన అవసరం లేకున్నా, సాయిగారు రూల్స్ ప్రకారం అభ్యంతరం తెలుపుతున్నారు కాబట్టి ఈ వ్యాసాన్ని పూర్తిగా తొలగించడమే అందుకు పరిష్కారంగా కనిపిస్తున్నది.ఒక చిన్న విషయం: ఈ వ్యాసం ఒకవేళ delete చేయబడితే, ఈ వ్యాసంలో ఉన్న విషయం అంతా నా దగ్గర ఉన్నది కాబట్టి అదే పేరుతో నేను మళ్ళీ మరో వ్యాసాన్ని సృష్టిస్తాను. ఒక కవి గురించిన వ్యాసం కాబట్టి ఒక వికీ సభ్యుడిగా నేను నాకు తోచిన మార్పులు చేయగల స్వేచ్చ ఉంది కాబట్టి ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు అనుకుంటున్నాను. దయచేసి మీ అభిప్రాయాలు తెలియజేయండి.

-- --Svrangarao 16:10, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చ త్వరలోనే ముగుస్తుందనుకొనే కొద్దీ మరీ పెద్దదౌతోంది. తప్పని పరిస్థితుల్లో నేను కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. సభ్యులు చాలా తొందరపడుతున్నారు. వ్యాసం తొలిగించడానికి నిస్సార్ గారు కూడా సుముఖంగా ఉన్నప్పుడు పట్టుపట్టి మరీ ఇంతలాగడం బాగుండదు. అధికారులు, సీనియర్ నిర్వాహకులు వృత్తిపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్టున్నారు. వారు వచ్చే వరకు కొద్దిగా ఓపిక పడితే బాగుంటుంది. ఇది వెంటనే తొలిగించాలనుకొనేంత వివాదాస్పద వ్యాసం కూడా కాదు కదా! సభ్యులకు ఇంకో సూచన - ఒక చర్చను ఏదో ఒక చోట కొనసాగిస్తే చాలనుకుంటా, నిస్సార్ గారి చర్చా పేజీ, నిస్సార్ వ్యాసపు చర్చాపేజీ, సాయిగారి చర్చా పేజీ, రంగారావు గారి చర్చా పేజీ, కాసుబాబుగారి చర్చా పేజీ, దేవాగారి చర్చా పేజీ... ఇలా అనేక చోట్ల ఒకే విషయపు చర్చ కొనసాగించడం సమంజసం కాదు. మొదట ప్రారంభించిన చోటే చర్చ కొనసాగిస్తే బాగుంటుంది. ఇంతటితో చర్చను తాత్కాలికంగా నిలుపుదల చేసి తెవికి రచనలపై దృష్టిపెట్టాలని సభ్యులను కోరుతున్నాను. తెవికిలో చురుకైన సభ్యుల కొరత ఉంది. ఉన్న కొద్దిసభ్యులు కూడా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ, స్నేహపూర్వకంగా ఉంటేనే మనలక్ష్యం పూర్తవుతుంది.---- C.Chandra Kanth Rao(చర్చ) 16:56, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదని నా ఉద్దేశ్యం. దీన్ని ఒక మినహాయింపుగా పరిగణిద్దాం. ఆంగ్లవికీలో ఆ నియమం ఉన్నప్పటికీ తెలుగు వికీలో అలాంటి నియమమేమీ రాయబడలేదు (నేనే ఒకసారి ఒక చిట్కాలో ఆ విషయం మొదటిసారిగా పేర్కొన్నట్టు నాకు తెలిసిన సమాచారం). సాయీ ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దాం, ఇకముందు ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుందాం. తొలగించి అదే విషయాన్ని వ్రాయడం సమంజసం కాదు. తెలుగు వికీలో నియమాల్ని నిర్దేశించాల్సిన అవసరం చాలా ఉంది. సాయీ తన కృషితో ఆ నియమావళిని అభివృద్ది చేస్తాడని ఆశిస్తున్నాను. సాయీ ఇంకా నీకు ఈ వ్యాసాన్ని తొలగించాలని అనిపిస్తే ఈ క్రింద ఓటింగ్ ప్రారంభించు. ఒక వారం తరవాత ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుందాం. δευ దేవా 17:35, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావు గారు మళ్ళి వ్యాసాన్ని సృష్టిస్తానంటున్నారు. కాబట్టి తుడిపేసి ఉపయోగం లేదు. ఇక మీద ఇలాంటి పేజీలు మెదలుపెట్టినప్పుడే తుడిపేస్తే బావుంటుంది. ఇక వోటింగ్ అవసరం లేదనుకుంట. నేను ఒకే ఒక్కటి చెప్పదలుచుకున్నాను. నేను ఎవరిని నొప్పించాలని ఈ పని చేయలేదు. సాయీ(చర్చ) 11:05, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపు గురించి వోటింగ్

[మార్చు]

ఈ వ్యాసం కంటే చర్చాపేజీ నిడివి ఎక్కువయ్యింది. సభ్యులు సుస్పష్టంగా తమ అభిప్రాయాలు తెలిపినందుకు నా ప్రశంసలు. ఇప్పటివరకు తెలిపిన అభిమతాల ఆధారంగా వోటింగ్ తప్పని సరి అనిపిస్తున్నది. వోటింగ్ ప్రతిపాదించే ముందు కాస్త సుదీర్ఘమైన ఉపోద్ఘాతం ఇవ్వవలసి వస్తున్నది. కాస్త ఓపికగా చదువమని కోరుతున్నాను.

  1. ఇది వ్యక్తిగతం కాదు. సాయి అభిప్రాయాలు వికీ విధానాల పట్ల వారి అవగాహనకు అనుగుణంగా ఉన్నాయి. నిసార్ అహమ్మద్ పట్ల అగౌరవ సూచకం కాదు.
  2. నిసార్ అహమ్మద్ ఈ వ్యాసాన్ని తొలగించడమే మంచిదనీ, ఆ విధంగా అనవుసర వివాదాన్ని ముగించవచ్చుననీ అభిప్రాయం తెలిపారు. కాని ఆ విధంగా తొలగిస్తే ఈ వ్యాసాన్ని సృష్టించి, దిద్దిన ఇతర సభ్యుల (వారు రిజిస్టర్ చేసుకోకపోయినా సరే)హక్కులకు అకారణంగా భంగం కలిగించినట్లవుతుంది. కనుక తొలగింపు విషయంలో నిసార్ అహమ్మద్ అభిప్రాయానికి ప్రత్యేకమైన విలువ లేదు.
  3. తొలగించే నిర్ణయం తీసుకోవడానికి నిర్వాహకులకు ప్రత్యేక ఆధికారం లేదు. సభ్యుల ఆమోదం ప్రకారం మాత్రమే అది జరగాలి.
  4. ఐ.పి. అడ్రసులను బట్టి సాయి చెప్పిన విషయం ఇప్పటికి అతని అభిప్రాయంగానే పరిగణింపబడుతున్నది. ఋజువు అనుకోవడానికి సరిపడా ఆధారాలు లేవు.
  5. పాలసీ విషయానికొస్తే (1) Neutral Point of View (2) No Original Reserach (3) Verifiable Sources అన్నవి మూడూ వికీపీడియా వారి మౌలిక సూత్రాలు. అంటే ఈ మూడింటినీ సభ్యుల ఆమోదంతో కూడా మార్చడం కుదరదు. మిగిలినవి అనుబంధ విధానాలు లేదా మార్గదర్శకాలు.
  6. వ్యాసంలో ఏవైనా తప్పులుంటే ఎవరైనా ఎత్తిచూపవచ్చును, దిద్దవచ్చును. తొలగింపుకూ, దానికీ సంబంధం లేదు.

ఈ వ్యాసం తొలగింపు కొరకు వోటింగ్ పెడుతున్నాను. సభ్యులు తమ వోట్లను నమోదు చేయమని కోరిక. (మరియు కావాలంటే తమ వ్యాఖ్యలను, కారణాలను కూడా వ్రాయవచ్చును.)

--కాసుబాబు 05:39, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వోటింగ్

[మార్చు]
  • వోటింగ్ ప్రారంభమైన తేదీ: 3 మార్చి 2008
  • ఈ వోటింగ్ ప్రక్రియను 10 మార్చి 2008 నాటికి ముగించాలని ప్రతిపాదన


నిసార్ అహ్మద్ సయ్యద్ వ్యాసాన్ని తొలగించాలని భావించేవారు

[మార్చు]
  1. సాయీ(చర్చ) 10:51, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ అహ్మద్ సయ్యద్ వ్యాసాన్ని ఉంచాలని భావించేవారు

[మార్చు]
  1. --Svrangarao 12:15, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --కాసుబాబు


తటస్థమైన అభిప్రాయం కలవారు

[మార్చు]
  1. ఈ వ్యాసాన్ని పూర్తిగా తొలగించే బదులుగా, ఇందులో మూలాలు లేకుండా ఉన్న వ్యాక్యాలను తొలగించడమో, లేదా తగిన మూలాలను చేర్చడమో చేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. ఆంగ్ల వికీలో ఉన్న en:WP:AUTOBIO ఒక మార్గనిర్దేశమే కానీ, తప్పనిసరిగా పాటించాలని లేదు. సందర్భాన్ని బట్టి మన విచక్షణను కూడా ఉపయోగించాలి. అలాగే జీవించి ఉన్న వ్యక్తి వ్యాసంలో మూలాలు లేకుండా ఇన్ని వాక్యాలు ఉండటం మాత్రం బాగోలేదు. "ఉన్న నిభంధనలను పాటించకపోవడం" అనేది వికీపీడియా నియమాలలో మొదటి నియమం అనే సంగతి తెలుసా. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:55, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఇది చాలా సున్నితమైన విషయంగా నేను భావిస్తున్నాను. నిసార్ అహ్మద్ గారు తెవికీకి ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన్ను గురించిన వ్యాసం వేరొకరు మొదలుపెట్టి ఉంటే దాన్ని తొలగించవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. కాకపోతే మొదలెట్టిన సభ్యులు వారు వ్యాసంలో వ్రాసిన విషయాలకు సరైన అధారాలు, మూలాలు సమర్పించాలి. నిసార్ అహ్మద్ గారు స్వయంగా మార్పులు చేయకపోవడం ఉత్తమం. ఇకపోతే రేపు ఎవరైనా వైజాసత్యగారి గురించో, మాకెనేని ప్రదీప్ గారి గురించో ఒక వ్యాసం మొదలెట్టొచ్చు. కాబట్టి ప్రముఖులైన తెవికీ సభ్యుల గురించి వ్యాసాలు వ్రాయవచ్చా లేదా అనే విషయంపై ప్రత్యేక చర్చ అవసరం అని నా భావన. ఆ చర్చ ఫలితాలను బట్టి ఈ వ్యాసాన్ని ఉంచాలో, తొలగించాలో నిర్ణయించవచ్చు. Namboori 17:03, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  3. మూలాలు చేరిస్తే ఇది సరి అయిన వ్యాసంగా ఉంచవచ్చు. అయితే వ్యక్తిగత పేజీలు ఎవరివి వారే సృష్టించకుండా/మార్చకుండా ఉండటమే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయము. తొలిరోజుల్లో వేమూరి గారు అనుకుంటాను ఏదో వ్రాస్తే ఇలాంటి చర్చే జరిగినది. Chavakiran 17:52, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  4. δευ దేవా 04:59, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  5. ఎన్నో మలుపులు తిరిగిన చర్చ చివరికి ఓటింగ్‌కు వచ్చింది. రెండు సార్లు ముగిసినట్లే ముగిసి మళ్ళి ప్రారంభం కావడం దురదృష్టకరం. ఇకనైనా ఈ ఓటింగ్ తోనే ఈ సమస్య ముగియాలి. సభ్యులందరూ ఓటింగ్ నిర్ణయాన్ని ఖచ్చితంగా కట్టుబడాలి. వ్యాసం ఉంచాలి అని నిర్ణయం వస్తే దాన్ని అలాగే వదిలేయాలి. ఒకవేళ వ్యాసం తొల్లిగించబడాలి అని ఓటింగ్‌లో నెగ్గితే వ్యాసం తొలిగించడమే కాకుండా మళ్ళీ రెండో పర్యాయం అదే పేరుతో పున:ప్రారంభం చేయరాదు (వ్యాసం రచించేది ఎవరైనా సరే). మళ్ళీ ప్రారంభిస్తే ఓటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వనట్లవుతుంది. అంతేకాకుండా ఓటింగ్ నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ సభ్యులను నిరోధించాలి. ఇకమీదట ఈ వ్యాసంపై (ఉంచాలి/తొలిగించాలి అనే విషయంలో) ఎలాంటి చర్చ తలెత్తరాదు.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:34, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  6. ఈ వ్యాసం లోని సమాచారాన్ని నిసార్ అహ్మద్ గారి సభ్యుని పేజీలోకి తరలించడం నాకు సబబుగా తోస్తున్నది.రవిచంద్ర 04:25, 7 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
బాగా చెప్పారు రవిచంద్ర గారు. ఆ పని చేసి ఈ వ్యాసం తొలగించండి. సాయీ(చర్చ) 02:50, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
CKR గారు,

చర్చ తలెత్తరాదు అని చెప్పినా మళ్ళీ ఈ పోస్ట్ వేస్తున్నందుకు మన్నించాలి. ఒక వ్యక్తి తన గురినంచి వ్యాసం రాయరాదు మరియు మార్పులు చేయరాదు అన్న నియమం ఉన్నది కబట్టి ఈ వ్యాసాన్ని తొలగించాలి అని సాయిగారు అన్నారు. అలాగే తొలగించాము అనుకుందాము. ఉదాహరణకు నేను ఆ వ్యాసాన్ని మళ్ళీ సృష్టిస్తే అందులో తగిన మూలాలు ఆధారాలు లేకుంటే ఆ వ్యాసానికి 'మూలాలు కావాలి ' అన్న Tag తగిలించాలి. ఆ వ్యాసం ఎవరిగురించి అయితే ఉన్నదో ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేయకూడదు. ఒక వేళ మార్పులు చేస్తే అతనిపైన చర్యలు తీసుకోవాలి కానీ వ్యాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదు.నిసార్‌గారు మార్పులు చేసారు కాబట్టి దాన్ని తొలగించాలి అన్న విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ, ఇంకెవరూ ఆ వ్యాసం మళ్ళీ వ్రాయకూడదు అనడం సమంజసంగా లేదు. మీ అభిప్రాయం తెలుపగలరు. మళ్ళీ చర్చిస్తున్నందుకు మన్నించాలి.--Svrangarao 00:11, 7 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వోటింగ్ ఫలితాలు

[మార్చు]

వోటింగ్ ముగిసేనాటికి (12/3/2008) వ్యాసాన్ని ఉంచాలని ఇద్దరు (నాతో కలిపి), తొలగించాలని ఒకరు అభిప్రాయపడ్డారు. తటస్థంగా ఆరుగురు వోటు చేశారు. కనుక ఈ వ్యాసాన్ని ఉంచాలని నిర్ణయించడమైనది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:53, 12 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ముందుగా కొంత వివరణ ఇవ్వాలనుకొన్నాను. కాని అలా చేస్తే అది తీర్పు అవుతుంది కాని వోటింగ్ కాదు. నేను జడ్జిని కాను. కనుక నా వోటు వేసి ఈ వోటింగ్ ముగిస్తున్నాను.
అధికంగా వికీ చర్చలు పరస్పర ప్రశంసా సందేశాలు. లేదా సందేహాలు, నివృత్తులు గా ఉంటున్నాయి. సభ్యులకు ఉత్సాహాన్నిచ్చే టానిక్కులుగా ఇవి పనిచేస్తున్నాయి. కాని ప్రశ్నలు లేని విజ్ఞానం పునాదులు లేని ఇల్లువంటిది. నిశితంగా పరిశీలించి, వివాదాలకు వెనుకాడకుండా, తమ అభిప్రాయాలను వెల్లడించడంలో బ్లాగేశ్వరుడు మొదటివాడనుకొంటాను. ఇప్పుడు సాయి ఆ విధంగానే తన వాదాన్ని నొక్కి వక్కాణించాడు. అతనికి ప్రత్యేకమైన అభినందనలు.
తెలుగు వికీ విధానాలలోని అస్పష్టత (ఆంగ్ల వికీ గురించి కాదు) ఈ చర్చలో తెలుస్తున్నది. మౌలిక విధానాల గురించి త్వరలో మార్గ దర్శక వ్యాసాలు తయారు చేయాలి.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:53, 12 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాటు రద్దు

[మార్చు]

తగిన tag తగిలించే వీలు ఉన్నపుడు ఆధారాలు లేనివాటిని తీయరాదు. ఈ వ్యాసంలో ఇప్పటికే ఆ tag తగిలించి ఉండడం వల్ల ఆ వాక్యాలు అలాగే ఉండవచ్చు.కావున దిద్దుబాటు చేసిన కూర్పు 283923 ను రద్దు చేస్తున్నాను.--Svrangarao 11:55, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ట్యాగులున్నంత మాత్రాన ఆధారాలులేని వాక్యాలు నిజాలయిపోవు. మూలాలు లేని ట్యాగులను తగిలిస్తే, ఆ వాక్యం మీద వారికి అభ్యంతరాలున్నాయని దాని అర్థం. అంటే ఆ వాక్యాలు నిరాధారాలనీ వాటికి సరైన మూలాలు చేర్చాలనీ అర్థం. మూలాలు చేర్చటం వలన పుకార్లను, నిజాలనూ వేరు చేయవచ్చు. పుకార్లతోటి వ్యాసాన్ని నింపటం వలన ఆ వ్యాసానికి ఏమయినా విలువ ఉంటుందా? ఎటువంటి మూలాలూ లేకుండా జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసాలను రాయడం అసలు శ్రేయస్కరం కాదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:44, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ట్యాగులు తగిలించి చాలా రోజులైంది. ఇన్ని రోజులకు కూడా మీరు మూలాలు సమకూర్చలేకపోతే ఆ వాక్యాలు నిజం కాదనే అనుకోవాలి. సాయీ(చర్చ) 12:47, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసంలో సరైన మూలాలు లేకుండా ఉన్న వాక్యాలు

[మార్చు]
== ఉర్దూ భాషా మరియు సాహితీ సేవ == 

* ''అంజుమన్ తరఖ్ఖి'' ఉర్దు కార్యదర్శిగా 20 సం. సుదీర్ఘ కాలం సేవలందించాడు. 
* మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటి చిత్తూరు జిల్లా స్టడీసెంటర్ ను స్థాపించి ప్రథమ కోఆర్డినేటర్ గా సేవలందించాడు. 
* విద్యావేత్తగా, సాహితీవేత్తగా రాయలసీమ ప్రాంతానికి చిరపరిచితుడు. 
* ఉర్దూ యువ కవి గా [[దక్షిణ భారతదేశం]]లో "నిసార్" కలం పేరుతో ఖ్యాతినొందిన ఇతను పలు రచనలు చేశాడు. 
 ''రూహ్-ఎ-కాయినాత్'', ''ఆయిన-ఎ-హయాత్'' ఇతని ముఖ్య  కవితా రచనలు.


ఈ వ్యాసం ఒక వికీ సభ్యుని గురించి వ్రాసినది. మరియు మూలాలు పేర్కొనని భాగమే అధికం. ఆ సభ్యులు కూడా దీనిని తొలగించమని కోరారు. కనుక ఈ వ్యాసాన్ని తొలగిస్తున్నాను. కాని దీనిపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. రిఫరెన్సు కోసం ఈ చర్చను మాత్రం వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా)/పాత రచ్చబండ ఇతరత్రా 2 లోకి మారుస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:45, 12 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చా పేజిలు

[మార్చు]

చర్చా పేజి తొలగించరు కదా??? వ్యాసపు పేజిని తొలగించినా చర్చా పేజిని ఈ విధముగానే ఉంచుతారరు అని అనుకొంటున్నాను--బ్లాగేశ్వరుడు 20:18, 12 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]