చర్చ:నెట్ఫ్లిక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

అభిప్రాయం

[మార్చు]

వాడుకరి:HarshithaNallani గారూ, మీరు ఈ వ్యాసం అనువాదాల పరికరం ద్వారా సృష్టిస్తున్నట్లు ఉంది. ఈ వ్యాసంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవి ఏమిటో తెలుసుకోవాలంటే మీరు వికీలో రచనలు చేయడానికి కొంత ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించాలి.

  • అనువాదం కొన్ని చోట్ల సరిగా రాలేదు. ఉదాహరణకు. క్రొత్త కంటెంట్‌ను ఉత్పత్తి చేయడానికి, అదనపు కంటెంట్ కోసం హక్కులను పొందటానికి,190 దేశాల ద్వారా వైవిధ్యపరచడానికి వారు చేసిన ప్రయత్నాల ఫలితంగా కంపెనీ బిలియన్ల అప్పులను సంపాదించింది
  • వ్యాసంలో ఎక్కడా ఇంకో వ్యాసానికి లింకులు లేవు
  • వికీకి మూలాలు చూపించడం చాలా ముఖ్యం. ఇవి ఎక్కడా చూపించలేదు.
  • తెలుగు భాషలో మరియు, యొక్క లాంటి పదాలు చాలా కృతకంగా అనిపిస్తాయి. ఇవి ఈ వ్యాసంలో విరివిగా కనిపిస్తున్నాయి.
  • కొన్ని వాక్యాలు చాలా పొడుగై పోయాయి. చదవడానికి వీలుగా సరళంగా లేవు.

దయచేసి కొత్త వ్యాసాలను సృష్టించేటపుడు పై విషయాలను గమనించండి. ఏదైనా సందేహాలుంటే నన్ను అడగండి. రవిచంద్ర (చర్చ) 14:59, 28 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]