Jump to content

చర్చ:నెల్లూరు వేద, సంస్కృత కళాశాల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రచయితలకు విజ్ఞప్తి;

  • ప్రతి సంస్థగురించీ వికీలో ఒక వ్యాసం చేయవచ్చును. అందుకు ఇటువంటి వ్యాసాలు అవుసరం. ఈ వ్యాసం మొదలు పెట్టినందుకు అభినందనలు. కాని కొన్ని సూచనలు పాటించవలసినది.
  • కళాశాల అధికారిక నామం చెప్పండి. దానిని బట్టి వ్యాసం పేరు తెలుగులోకి మారుద్దాము. ఇంగ్లీషు హెడింగులతో వ్యాసాలుండడం తెలుగు వికీ సంప్రదాయానికి వ్యతిరేకం.
  • వ్యాసంలో వ్యక్తిగత విషయాలు ("చాలా మందికి మల్లే నాక్కూడా చేరేంత వరకూ అక్కడొ కాలేజి ఉందని అస్సలు తెలీదు" వంటివి) వ్రాయవద్దు. విషయాన్ని వ్యక్తిగతంగా కాక సార్వజనీనికంగా వ్రాయగోరుతున్నాను. అందుకు అనువుగా కొన్ని శీర్షికలు చేర్చడమైనది. (ఇవి కేవలం సూచనలే)
  • "శ్రీ", "గారు" వంటి గౌరవ వాచకాలు వికీలో వాడటంలేదు. అయితే "బ్రహ్మశ్రీ" వంటి బిరుదులు వాడవచ్చును.
  • ఒకసారి సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి. ఉపయోగంగా ఉంటాయి.
  • కాని మీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించండి.

--కాసుబాబు 09:38, 8 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]