చర్చ:పంచతంత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంచతంత్ర, పంచతంత్రం అనే రెండు వ్యాసాలు ఇవి. వీటిని విలీనం చెయ్యాలా? చేస్తే ఎలా చెయ్యాలి?

పంచతంత్ర యాంత్రికంగా చేసిన అనువాదం కనుక చాల కృతకంగా ఉంది. కాని ప్రపంచ భాషలలోకి పంచతంత్రం ఎలా చొచ్చుకు వెళ్లిందో ఇక్కడ ఉంది కనుక ఆ భాగాన్ని కాపాడాలి. కాని తిరగ రాయవలసినది చాల ఉంది. ఇది ఓపికతో చెయ్యవలసిన పని. పెద్ద ప్రయత్నం చెయ్యాలి.

పంచతంత్రం మనుష్యులు రాసిన రాత. చదవడానికి బాగుంది. కాని విషయం తక్కువగా ఉంది. పెంచాలి.

నా సలహా: "పంచతంత్రం" అన్న పేరునే ఉంచి, "పంచతంత్ర" ని మరమ్మత్తు చేసి అప్పుడు "పంచతంత్రం" లో విలీనం చెయ్యడం మంచిది.

నేను ప్రయత్నం చేస్తాను. రెండు, మూడు నెలలకి పైగా పట్టవచ్చు. కొద్ది కొద్దిగా చేస్తూ పోతాను కనుక మొదట్లో నా మార్పులు అందరికీ నచ్చకపోవచ్చు. నా పని నన్ను చేసుకుంటూ పోనిస్తే - మధ్యలో ఇతరులు వేలు పెట్టకుండా - సంతోషిస్తాను. అంతా అయిన తరువాత, మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు. Vemurione (చర్చ) 23:50, 15 ఆగష్టు 2016 (UTC)