చర్చ:పగడము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పగడము ముదురు ఎరుపురంగు కలిగి నునుపుగా ఉండి ప్రకాశవంతమైన పగడాలు కుజగ్రహానికి చాలా ప్రీతి. కుజుడు రక్త వర్ణము కలిగి అగ్నితత్వం గల పురుషగ్రహము. పగడముకూడా తేజోతత్వానికి సంబంధించినది. ఎర్రగా నుండుట వల్లనే కుజునుకి ఇష్టప్రదమైనది. ఈ పగడము త్రిదోషమునందలిపిత్తమను దోషమును హరింపగలదు. సమానవాయువు సంకేతముగా గలది, పురుషజాతికి, క్షత్రియత్వమునకు సంభంధించిన దగుటవలన చాలా కఠినముగా నుండి కోతకు స్వాధీనపడదు. శరీరమునందలి మూలాధార చక్రమునందలి వివిధ కాంతి విశేషములన్నియు ఈ పగడమునందు నెలకొని యుండుట వలన, మూలాధార చక్రమునందలి పసుపుపచ్చని రంగుగల కాంతి కిరణాల దేహతత్వంపై ఏ విధంగా పనిచేయగలవో ఈ పగడం ధరించడంవల్లకూడా అదేవిధంగా హరిత కిరణాలు దేహ రంద్రాలగుండా చొచ్చుకుపోయి, రక్త దోషాలు, లివర్, బ్లడ్ ప్రషర్, అల్సరు, జననేంద్రియ సంభంధిత వ్యాధులు, స్ఫోటకం వంటి అనేక అంటువ్యాధులు, కీళ్ళ బాధలు మొదలగు అనేక ఋగ్మతలు పారద్రోలి ఆరోగ్యవంతులను చేయగలదు. మృగశిర, చిత్త, ధనిష్ఠ అను నక్షత్రములందు బుట్టిన వారు ఏ కాలమునందైనను మంచిపగడాలను ధరించవచ్చును. ఇతర నక్షత్రజాతకులలో ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రజాతకులు పగడం ధరించి సత్ఫలితలు పొందటం చాలా కష్టము, మిగిలినవారు తమ యొక్క జన్మకాలమునందలి జాతక చక్రము ననుసరించి గ్రహముల యొక్క దశాంతర్దశలను గమనించి కుజగ్రహము దోషప్రమాదముగా నున్న సమయములందే పగడము ధరించవలెను. అట్లు ధరించిన యెడల కుజగ్రహ దోషమువల్ల జీవితంలో సంభవించే అనేక అనర్థాలు, నివారింపబడి శుభము జయము కలుగును. జన్మ సమయమున లేర్పడిన జాతక చక్రమునందు లగ్నము నుంచి, 6-8-12 స్థానములందు కుజుడుండిన లేక ఆ స్థానాధిపతులతో కలయిక గానీ, దృష్టిగానీ పొందియుండిన యెడల కుజగ్రహ దోషప్రమాదము, కుజునికి ద్వితీయ, సప్తమాధి పత్యములు గల్గుట 2-4-7-8 స్థానములందుట కూడా దోషప్రదమే! షడ్వర్గ బలము, అష్టక బలము, కలిగిన కుజ గ్రహము పైన దెల్పిన స్థానములందుండిన విశేషహాని జేయుటకు దుష్టలక్షణములు కలిగి బలవత్తరుడైయున్న అంగారక గ్రహము యొక్క మహర్దశలు, అంతర్దశలు సంభవించినపుడు మరియు గోచారమునందు కుజునికి దుష్టస్థానమునందు స్తంభనము వ్రక్రత్వము గ్రహయుద్దము, పాపగ్రహవేధలుసంభవించియున్న కాలమునందు శతృవృద్ది, పోట్లాట్లు, దరిద్రము ఉద్రేకము, రక్తహీనత, దీర్ఘరోగములు, శస్త్రచికిత్సలు, ఆకస్మిక ప్రమాదములు, అగ్నిభాధలు, విషపీడ, ఋణబాధ, దాయాది వైరము, భూనష్టము, అవమానము, కాలవిఘ్నము, నీచజన స్నేహము, నిత్యకలహము, దంపతులకెడబాటు, సుఖవ్యాధులచే బాధలు, మెదలగు దుఃఖ ప్రదమైన అనేక ఫలితాలు ప్రాప్తించును. అట్టి సమయమునందు ఉత్తమమైన పగడము ధరించిన అరిష్ట నివారణమై శుభం కలుగుతుంది. పగడం ధరించడం వలన కలిగే శుభయోగాలు : బ్రహ్మజాతికి , క్షత్రియ జాతికి సంభంధించిన సంభంధించిన ఉత్తమమైన పగడాలను శాస్త్రీయ పద్ధతులననుసరించి ధరించిన యెడల చాలా శుభం జరుగుతుంది. ఆచరించే ప్రతికార్యంలో కలిగే విఘ్నాలు అంతరించి ఆయా పనులలో విజయం లభిస్తుంది. ఆ కారణముగా శత్రుత్వము తొలగిపోయి జనవశీకరణ లభించగలదు. పగడము అగ్నినుంచి, ఆయుధముల నుంచి కౄరశతృవుల నుంచి తగిన రక్షణ చేకూర్చగలదు. ఆకస్మిక ప్రమాదములు, గండములను తప్పించి క్షేమం కలిగించగలదు. చాలా కాలం బాధిస్తున్న ఋణ బాధలు, సూర్యోదయమునకు చీకట్లు తొలగి పోయినట్లు తొలగిపోవును. వివాహ విషయములో కలిగే వివిధ ఆటంకములు అంతరించి శీఘ్రంగా వివాహం జరుగగలదు. కుజదోషముల వలన కలిగే దాంపత్య జీవితంలో కలిగే కలహాలు, కలతలు కార్పణ్యాలు, పరస్పర వైషమ్యాలు, విడాకులలాంటి దుర్మార్గపు భావనలు, అంతరించి, అన్యోన్యప్రేమ పూరితమైన అనురాగంతో దంపతులు దీర్ఘకాలం సుఖసంసార జీవనం చేసుకొనుటకు తోడ్పడుతుంది. భారీయంత్ర పరిశ్రమలో తరచుగా కలుగుచుండే అనేక ప్రమాదాలు, మోటారు వాహనములకు కలిగే నష్టాలు, శతృవుల కుయుక్తులవల్ల సంభవించే రాజకీయ భాధలు, పోలీస్ కేసులు, ఇతర బాధలు, లివర్ వ్యాధులు, మూలశంక రక్తపోటు, జ్వరము, దేహతాపము, చర్మవ్యాధులు, గడ్డలు వ్రణములు వాపులు కీళ్ళబాధలు జననేంద్రియములకు సంభంధించిన అన్ని రోగాములు. కడుపునొప్పి కాన్సరు మొదలగు యింకా అనేక వ్యాధులను శీఘ్రంగా నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులగుటకు పరిపూర్ణ సంతోషముతో తృప్తిగల సుఖవంతమైన జీవితమును గడుపుటకు పగడము తోడ్పడగలదు. పగడము ధరించిన వారికి జీవితంలో నైరాస్యం బద్దకం సోమరితనం అనేవి ఉండవు. సహనం సాహసం విజృంభణ అధికంగా నుంటవి. అన్యాక్రాంతంలో నున్న భూములు స్వాధీనమగుతవి. పశుసంపద వృద్దినొంది, వ్యవసాయరంగంలో విశేష లాభాన్ని పొందుతారు. మిలటరీ, పోలీస్ శాఖల్లో పనిచేసేవారు క్షత్రియ జాతి పగడాన్ని ధరించడం చాలా మంచిది. వారి వృత్తిలో అసాధారన ప్రతిభగలవారై ప్రతి పనియందు విజయాన్ని పొందుతారు. పగడానికి అధిపతియైన కుజగ్రహం అనుగ్రహం కలిగి శుభగ్రహ స్థానల్లో ఉంటే ఎంత మంచి చేస్తాడో ఆ విధమైన బలం కలవాడై అశుభ స్థానాల్లో ఉంటే అంతటి కీడును కూడా కలిగిస్తాడు. ఆయనకు ప్రీతికరమైన పగడాన్ని ధరించడం వలన కుజగ్రహం ప్రసన్నుడై సకల ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో సంపదలతో, రాజ్యపూజ్యతల్ గౌరవం, ఆరోగ్యము, గౌరవం వంశాభివృద్ది, సకలసౌభాగ్యాలు కలుగచేస్తారు. పగడపు పూస మాలలు ధరించడం వలన కూడా పై విధమైన ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్ష మాలల యందు ఏడు పగడాలు గానీ కనీసం ఒకటి రెండు పగడాలుగానీ జేర్చి ధరించవలెను. ఇతర నవరత్నాలవలె పగడాలు అధిక ధరలుకలిగి యుండక అందుబాటు ధరల్లో లభిస్తాయి. పగడము ధరించే పద్దతి : పరిశుభ్రమైన పగడాలు ధారణకు యోగ్యముగానుంటవి. బ్రహ్మ జాతి ప్రవాళం బరువుగా నుండి ప్రకాశవంతముగా నుంటుంది. క్షత్రియజాతికి బరువు మాత్రంలోపించగలదు. ఇట్టి పగడము ఏడు కారెట్లు (21 వడ్డగింజల బరువు)గలదానిని ధరించుట శ్రేష్ఠము. త్రికోణముగా నున్న పగడము విశేషఫలప్రదము, అట్లుకాని యెడల బాదంకాయవలే నున్న దానిని వాడవచ్చు. నలుచదరపు, వర్తులము విల్లువలె నుండునది. నక్షత్రాకారమును పోలిన పగడములు ధారణకు అంతగా ఉపయోగించవు. పగడము చిన్నదైనా దోషరహితంగా వుండాలి. బంతివలెనున్న ప్రవాళాలు మూలలయందు, ఆభరనములందు కూర్చోనుట ఉత్తమము పగడముకూర్చే ఉంగరము బంగారంతో గానీ లేక వెండితో గానీ, లేదా పంచలోహములతో గానీ తయారు చేయించాలి. ఈ ఉంగరం పీట భాగంలో ముక్కోణాకారములో ఉండి దానిచుట్టూ వలయ రేఖలను ఏర్పరచడం చాలా ముఖ్యము. కృష్ణపక్షంలో చదుర్దశీ మంగళవారం వచ్చిన దినమునందుగానీ, లేక కుజుడు మకర రాశిలో ధనిష్ఠా నక్షత్ర సంచారం చేసే కాలంలో గానీ ఏదో ఒక మంగళవారంనాడు గానీ, మధ్యాహ్నం 1గం-2 గం|| మధ్యకాలంలో గానీ లేక రాత్రి 2గం- 3గం మధ్యకాలంలో గానీ దక్షిణముఖంగా కూర్చొని పగడము ఉంగరములో బిగించవలెను. ఆ తర్వాత ఆ ఉంగరమునుఒక దిన మంతయు నవధాన్యాలలో ఉంచి మరుసటి దినమంతయు పంచగవ్యములు (ఆవుపాలు, పెరుగు, ఆవునెయ్యి, ఆవు పంచితం, గోమయం కలిసినది)యందుంచి, మూడవరోజున సుగంధ, ద్రవ్యాలతోడను, ఎర్రచందనపు నీళ్ళచేతను రుద్రాభిషేకం జరిపించి శుద్దిగావించవలెను. ధరించెడివాడు తమకు తారాబలం చంద్రబలం గలిగిన శుభతిదులయందు (శనివారం గాక)మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నములు వర్తించు వేళాలందు ఉంగరము కుడిచేతి ఉంగరపు వేలికి ధరించాలి. ధరించుటకు పూర్వమే షోఢశోపచార పూజలు జరిపి నమస్కరించి గురువులను గణపతిని ధ్యానించి దక్షిణ ముఖముగా నిలువడి ఉంగరము కుడి అరచేతియందుంచుకొని "ఓం లం ఐం హ్రీం శ్రీం మహిపుత్రాయ సకలారిష్ట వివారనాయ క్లీం క్లీం స్వాహా"అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయాలు జపించి, ఉంగరము ముమ్మారు కనులకద్దుకొని వ్రేలికి ధరించవలెను. స్త్రీలు మాత్రం ఎడమ చేతికి అనామికా వ్రేలికి ధరించుట శుభప్రదము. మాలలు ఇతర ఆభరణమునందలి పగడములకు కూడా పైవిధంగా శుద్దిని పుణ్యకార్యములను నిర్వర్తించి ధరించుట శాస్త్ర సమ్మతము, ఉంగరము అడుగుభాగాన రంద్రము కలిగి యుండవలెను.