చర్చ:పతాక శీర్షికలు 2005

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వివిధ పత్రికల్లో వచ్చిన ఆసక్తికరమైన వార్తాశీర్షికలు ఇక్కడ పొందుపరచే ఉద్దేశ్యంతో ఈ పేజీని ప్రారంభించాను. కేవలం శీర్షికపేరు మాత్రమే ఈ పేజీలో ఇవ్వాలి. వార్తా కథనం మామూలుగా ప్రస్తుత ఘటనలు పేజీలోనే రాయాలి. అక్కడే శీర్షికలు కూడా రాస్తే వీటి ప్రత్యేకత కనపడదని నా అభిప్రాయం. సభ్యులు తమ తమ అభిప్రాయాలు తెలియజేయగలరు. __చదువరి 18:23, 28 నవంబర్ 2005 (UTC)

  • ఆంగ్ల వికి లోనిఈ వ్యాసము కొన్ని నిర్దేశకాలు చేస్తున్నది. వికిలోని ప్రస్తుత ఘటనలు శీర్షిక 2-3 వాక్యాలలో కొన్ని ముఖ్యమైన జరుగుతున్న సంఘటనలు గురించి రాయటానికి ఉపయోగిస్తున్నారు. ఇదే పతాక శీర్షిక లాంటిది మరలా దీనికి పతాక శీర్షిక అక్కరలేదని నా అభిప్రాయము. మనము విస్తృతముగా రాయడానికి వికివార్తలు ప్రాంభించవచ్చు. --వైఙాసత్య 18:51, 28 నవంబర్ 2005 (UTC)
తెలుగు వికిన్యూస్ ప్రారంభించడానికి ఇక్కడ మద్దతు తెలపవలెను --వైఙాసత్య 19:13, 28 నవంబర్ 2005 (UTC)
"పతాక శీర్షిక" తో నా ఉద్దేశ్యం - పత్రికల్లో వచ్చిన ఆసక్తికరమైన వారతా శీర్షికల కూర్పు మాత్రమే! ఇందులో వార్తలు ఉండవు, శీర్షికలు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు, లాలూ ఓడిపోయిన రోజున, వార్తల్లో వచ్చిన శీర్షికలు శీర్షికలు ఇలా ఉన్నాయి:
ఈనాడు: "లాలూ, ఇక చాలు"
దక్కన్ క్రానికిల్: "లాలూ లూజెస్, బీహార్ విన్స్"
ఆంధ్ర భూమి అనుకుంటా: "నితీష్‌కే బీహారం". ఇటువంటి వాటిని ఒకచోట చేర్చేదే "పతాక శీర్షికలు". ఈ ప్రతిపాదనకు అనుకూలంగా 1వ తేదీలోపు మరో ఓటు రాకుంటే, తీసేస్తాను. ఇక, వికీ వార్తలు..బానే ఉంటుంది గానీ, దీనిని సాగించేందుకు ప్రస్తుత మన సభ్యుల సంఖ్య సరిపోదనుకుంటా! __చదువరి 06:16, 29 నవంబర్ 2005 (UTC)
వికివార్తల గురించి మీరన్నది సబబే. కాబట్టి దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాము. పతాక శీర్షికలు వార్తా పత్రికల శీర్షికల యధాతధము అయితే అవి కొన్ని కొన్ని సార్లు విజ్ఞాణసర్వస్వ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. కానీ మనము దీన్ని ప్రయోగ పద్దతిన ప్రవేశ పెట్టడములో తప్పేమీ లేదనుకుంటున్నా. కొన్ని రోజుల తర్వాత మరళా చర్చించవచ్చు--వైఙాసత్య 19:29, 29 నవంబర్ 2005 (UTC)