చర్చ:పేర్లు, ఇంటిపేర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం పై సమీక్ష[మార్చు]

ఈ వ్యాసం చాలాబాగుంది. ఇంకొన్ని మార్పులు చేసి వికీస్తాయికి చేర్చాలి. మిరీ ముఖ్యంగా ఈ వ్యాసం అంధ్రప్రదేశ్లోనే పుట్టిన తెలుగువారిని సంభోదిస్తూ, వారితో మాట్లాడుతున్నట్లు ఉంది. వ్యాసంలో చాలా మంచిమంచి వివరాలు ఉన్నాయి, కానీ ఇంటిపేర్లు అనేవి ఎట్లా పుట్టాయో అనే విషయం మాత్రం లేదు.

కొన్ని కొన్ని సంధర్భాలలో అభిప్రాయాలను తెలుపుతున్నట్లుగా వాఖ్య నిర్మాణం జరిగింది. ఉదా: "కాని పాశ్చాత్య సంప్రదాయపు సుడిగాలికి వీళ్ళు కూడ ఒంగి, లొంగిపోయి, పాశ్చాత్య పద్ధతి ప్రకారం పెట్టిన పేరు మొదట, ఇంటిపేరు చివర రాయడం ఈ మధ్యే మొదలు పెట్టేరు. కాని కల్చరు పేరు మీద కొట్టుకు కోర్టుకెక్కే తెలుగు వాళ్ళు అంత సులభంగా లొంగుతారా? హరి మీద గిరి పడ్డా, గిరి మీద హరి పడ్డా తెలుగువారు మాత్రం వి. వి. రావ్‌, పీ. కే. మూర్తి, యన్‌. టీ. రామారావు అనే రాస్తాం తప్ప, మిగిలిన ప్రపంచపు అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడం. అసలు యన్‌. టీ. రామారావుని “యన్టీయార్‌” అన్నప్పుడున్న మజా తల్లకిందులుగా రామారావ్‌ టీ. నందమూరి అంటే వస్తుందా? తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు."

అంతేకాదు వ్యాసంలో ఉన్నా ఏ విషయానికి కూడా నిర్ధారించుకోవటానికి సరయిన మూలాలను తెలిపలేదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 05:09, 7 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం యొక్క పేరు మారిస్తే బాగుంటుంది. ఒఠ్ఠి ఇంటీ పేర్లు గా ఉంటే బాగుంటుందేమో --నవీన్ 11:23, 7 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

"తెలుగుదేశంలో ఇంటిపేర్లు" అంటే బాగానే ఉంటుంది. ఇది ఒరిజిన‌ల్‌ గా రాసిన వ్యాసం. దీనికి వికీపీడియా మూలాలు లేవు. పైన ఉదహరించిన పేరా ని కొంచెం బాగు చేసి మళ్ళా రాస్తాను. ఇంటిపేర్లు ఎలా పుట్టేయో రాసేను. మరోసారి చదివి చూడండి. నెమ్మది మీద మరికొంచెం రాస్తాను ‍‍‍‍-వేమూరి

ఈ వ్యాసంలో చాలా భాగాలు "unencyclopedic" గా ఉన్నాయి. కొన్ని కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. 'అమెరికా వాడు', 'ఇంగ్లీషువాడు' అన్న ప్రయోగాలు నిందాత్మకంగా ఉన్నాయి. బద్ద్జకిష్టి బడుద్ధాయి లాంటి ప్రయోగాలు అనవసరం. పత్రికలలో వ్యాసాల భాష, శైలి నే ఎన్సైక్లోపేడియా కి వాడితా చాలా unprofessional గా ఉంది. తప్పులు కూడా ఉన్నాయి. మేరిలిన్ మన్రో అసలు పేరు నార్మా జీన్‌ మోర్‌టెన్ సన్‌. ఇంగ్లీషు వికీపీడియాకి లింకు ఇచ్ఛి ఉండాలిసింది. ఈమాట లో వ్యాసాన్ని యధాతధంగా వాడినట్ల్లున్నారు.వికీ కోసం తిరిగి రాస్తే బాగుంటుంది. -- పద్మ

పద్మ[మార్చు]

పద్మ గారు మీరు అన్నది చాలా బాగుంది, మీరు కుడా కొన్ని సవరణలు చెయ్యండి. unencylopaedic గా ఉన్న అంశాలు లెవ నెత్తారు కాదా ఇంకొంచం చర్చ జరిగిన తరువాత మార్చుదాం

ఈ వ్యాసం యొక్క పేరు మారిస్తే బాగుంటుంది. ఒఠ్ఠి ఇంటీ పేర్లు గా ఉంటే బాగుంటుందేమో అన్న నవీన్ గారి అభిప్రాయం బాగుంది. వెతకటానికి కూడా తొందరగా దొరుకుతుంది. కావాలి అంటే, 'వేర్లు' తో వేరే వ్యాసం, వేరే శీర్షికతో చేర్చండి. 'పేర్లు' తో వెతికితే, ఖాళీ పేజీ వస్తోందండి.Talapagala VB Raju 06:32, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగువారి ఇంటి పేర్లు (Ph.D. సిద్ధాంతవ్యాసం)[మార్చు]

http://teluguthesis.com/showthread.php?tid=105 (Ph.D. సిద్ధాంతవ్యాసం)

వర్గీకరణ[మార్చు]

  • ఇంటి పేర్లు అనేక వర్గీకరణలు చేయవలసి ఉన్నది. అధికార నిర్వాహకుల నిర్ణయము మేరకు, నా వంతుగా సహకరిస్తానని అనుకుంటున్నాను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:17, 8 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]