చర్చ:ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముఖ్యమైన సమాచారం తొలగింపు గురించి

[మార్చు]

@Arjunaraoc గారూ, ఈ వ్యాసంలోని వివిధ వేదికలలో జరిగిన కార్యక్రమాల (ఏరోజు ఏఏ కార్యక్రమాలు జరిగాయో) వివరాలు ఉండడం ముఖ్యమని భావించి వాటిని చేర్చడం జరిగింది. మీరు వాటిని ఎందుకు తొలగించారో తెలుసుకోవచ్చా?, తెలుగు భాషా చరిత్రలో ఇది పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. అలాంటి వ్యాసంలో కార్యక్రమాల వివరాలు ఉండాలి. -- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:58, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Pranayraj1985 గారు, నేను పరిశీలించితే మొత్తం ప్రచారశైలిలోనే వ్యాసం కనబడింది. ప్రణాళికలు, ఆశయాలు, నేపథ్యంలో స్పందనలు లాంటివి. తెలుగు పత్రికలలో, వచ్చిన అంశాలు చాలా వరకు నకలు చేయటంవలన తెవికీ వాడుకరులకు ఉపయోగం లేదు. మంచి విజ్ఞానవ్యాసం కావాలంటే, సమావేశం లో జరిగిన ప్రముఖమైన అంశాలపై నివేదికలు, సమావేశం వలన తెలుగు భాషాభివృద్ధి ఎలా జరిగిందో వివరించే అంశాలు చేర్చాలి. నేను తొలగించినవి అన్ని వ్యాసంలో గల లింకుల ద్వారా ఆసక్తి వున్న వారు పొందుతారు. ఆ దిశగా వ్యాసాన్ని అభివృద్ధి చేయటం ఉపయోగం. అర్జున (చర్చ) 05:19, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సభలు జరుగుతున్నపుడు వ్యాసం సృష్టించబడింది కావున అప్పటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు, ఆశయాలు మొదలైనవి రాశాను. ఇప్పుడు వాటిని చూస్తే, మీరన్నట్లు ప్రస్తుతానికి ఆయా విభాగాల సమాచారం అవసరం లేదని నాక్కూడా అనిపించింది. కాకపోతే, వివిధ వేదికలలో జరిగిన కార్యక్రమాల (ఏరోజు ఏఏ కార్యక్రమాలు జరిగాయో) వివరాలు ఉండడం ముఖ్యమని భావించి వాటిని చేర్చడం జరిగింది. --ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 05:27, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]