Jump to content

చర్చ:బీడు భూమి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కాపీరైట్ సమస్య ?

[మార్చు]

ఈ వ్యాసం మొత్తం పత్రిక నుండి యదాతథంగా వ్రాసినట్టున్నారు. కాపీరైట్ సమస్య కారణంగా తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. Chavakiran 04:47, 10 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • కాపీ రైట్ సమస్య కారణమైతే దయచేసి తొలగించండి. ఈ వార్తలో ఇచ్చిన గణాంకాలు చాలా వివరంగా ఉన్నాయి. ఇవే గణాంకాలు, ఆల్ ఇండియా రేడియో, దూరదర్సన్, సంబంధించిన మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంటే, అప్పుడు కాపీ రైట్ సమస్య వస్తుందంటారా. ఆ గణాంకాలు ఆధారంగా వికీపీడియా లో వ్యాసం రాయవచ్చునా. సలహా ఇవ్వండి. నేను మార్చి రాసినా , గణాంకాలు, ఈ పత్రిక నుంచే సేకరించాలి. అప్పుడు కూడా కాపీ రైట్ సమస్య వస్తుంది . Talapagala VB Raju 11:12, 10 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఉన్న కొన్ని గణాంకాలను తీసుకొని రెఫరెన్స్ ఇస్తూ, ఆ గణాంకాల ఆధారంగా వ్యాసం వ్రాయవచ్చు. పత్రికలో వచ్చిన ఒకట్రెండు ముఖ్యమైన వాక్యాలు కూడా తీసుకోవచ్చు. ఇంకనూ వ్యాసవృద్ధికై ఇతర గ్రంథాలు, వెబ్‌సైట్లు పరిశీలించి రెఫరెన్స్ ఇస్తూ వ్యాసాన్ని పొడగించవచ్చు. కాని వ్యాసం మొత్తం ఒకే వెబ్‌సైట్ లేదా ఒకే పత్రికపై ఆధారపడి ఉండరాదు. వ్యాసాన్ని కూడా పాయింట్లరూపం నుంచి పేరాల రూపంలోకి తీసుకువస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:52, 10 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

కుంచం, మానెడు

[మార్చు]
  • రాజు గారికి,
  • కుంచం భూమి, మానెడు భూమి అని కేవలము భూమి కి కొలత ప్రమాణములుగా లేవని అనుకుంటున్నాను. కుంచం, మానెడు అనేవి భూమిలో పండిన పంటలను కొలచు ప్రమాణములుగా వాడుకున్నారని భావిస్తున్నాను. ఒకసారి చూడగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:36, 13 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • ప్రసాద్ గారికి,
  • కోనసీమ ప్రాంతంలో (తూర్పుగోదావరి జిల్లాలో) ఈ వాడుక ఉందండి. కుంచం అంటే 10 సెంట్లు (484 చదరపు గజాలు) ఈ మాట ఇప్పటికీ వాడుకలో ఉంది. భూమి అమ్మకం, కొనటంలో, కట్నకానుకల విషయంలో, కుంచెడు భూమి ప్రస్తావన ప్రముఖంగా వస్తుంది. ఎకరానికి (100 సెంట్లు) కి 10 కుంచాలు (10 సెంట్లు).. 50, 60 సంవత్సరాల క్రితం 'అడ్డెడు' భూమి (అర కుంచం- 5 సెంట్లు) పదం వాడుకలోనుంచి తొలగి పోయి, ఇప్పుడు కోనసీమలో 'అర కుంచం' పదం (అడ్డెడు పదం బదులుగా) వాడుకలో ఉంది (లేదంటే 5 సెంట్లు అంటున్నారు). బియ్యం, పెసలు, కందులు, రాగులు, గంట్లు, మినుములు వగైరా కొలవటానికి, మెట్రిక్ పద్దతి ప్రవేశ పెట్టటానికి ముందు వాడుకలో ఉన్న పదాలు కుంచం (4 శేర్లు), అడ్డెడు (2 శేర్లు), మానెడు (శేరు), సోలెడు, గిద్దెడు. శేరు అంటే నేటి కిలోగ్రాముకి (కె.జి) కొంచెం ఎక్కువ. తొందరలో, నేను తూనికలు, కొలతల మీద ఒక వ్యాసం రాయాలని అనుకుంటున్నాను. అప్పుడు మరింత వివరంగా రాస్తానండి. మీరు చెప్పినట్లుగా మానెడు భూమి వాడుకలో లేదు. అందుకని మానెడు, సోలెడు, గిద్దెడు పదాలు తొలగిస్తాను. Talapagala VB Raju 03:11, 14 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

== విషయాన్ని గ్రహించాను. కాని మీరు వ్రాశిన వాక్యములో ఇక్కడ స్థలాన్ని గజం, కుంచం, అడ్డెడు, సెంటు, ఎకరం గా కొలుస్తారు. అని ఉంది. కుంచం, అడ్డెడు ఏ విధముగా భూమిని కొలుస్తారో అని శంక. కుంచం, అడ్డెడు భూమి అని వాడుక కద్దు. కానీ కొలత ప్రమాణము నకు ఏనాడు పనిముట్లు లేవు కదండి. ఎవరికైనా శెంటు భూమి, కుంచం పంట పండే భూమి, మరకం, మాణిక/మానిక, గిద్దెడు, సోలడు భూమిని, అంటే అంత ప్రమాణము పంట పండే భూమిని ఇవ్వవచ్చును. కానీ భూమిని ఆ కొలతలతోనే కొలచి ఇవ్వలేము అని నా భావన. తదుపరి చర్చ చేయగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:58, 14 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • కోనసీమ ప్రాంతంలో కుంచం భూమి అంటే 484 చదరపు గజాలు కొలిచి ఇస్తారు. అదే కొలత. కుంచానికి ప్రత్యేక మైన కొలత లేదండి. 4840 చదరపు గజాలు కొలిచి ఎకరం అంటారు. అలాగే కుంచం కూడా కొలిచి ఇస్తారండి. కోనసీమ లో, భూమి విషయంలో 'కుంచం' అన్న పదం వాడుక చాలా ఎక్కువ. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో, డాక్యుమెంట్ రైటర్లు కూడా ఈ 'కుంచం' పదం ఎక్కువగానే వాడుతారండి. ఇక్కడ పనిముట్టు 'గజాలను' కొలిచే టేపు మాత్రమే, లేదంటే సర్వే డిపార్ట్‌మెంట్ వారు వాడే 'చైనులు'. 'ఇక్కడ స్థలాన్ని గజం, కుంచం, అడ్డెడు, సెంటు, ఎకరం గా కొలుస్తారు . అంటే అర్ధం గజం అంటే గజం కొలిచి ఇస్తారు. కుంచం అంటే 484 గజాలు కొలిచి ఇస్తారు. సెంటు అంటే 48.4 గజాలు కొలిచి ఇస్తారు. ఎకరం అంటే 4840 చ.గ. కొలిచి ఇస్తారు. నేను వ్రాసిన వాక్యానికి అర్ధం ఇది. నేను సరియైన అర్ధం వచ్చేలా రాయలేకపోతే, దయచేసి ఆ వాక్యాన్ని అర్ధవంతంగా సవరించండి. కృతజ్ఞతలు. Talapagala VB Raju 03:09, 15 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

భూమి కొలతల గురించి

[మార్చు]

వ్యాసం చక్కగా ముందుకు వెల్తుంది. కాకుంటే భూమి కొలతల విషయం వేరే వ్యాసంగా ఉంచాలి అనుకుంటాను. బీడు భూములకే కాదు కదా ఈ కొలతలు అన్ని భూములకు కదChavakiran 01:38, 14 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • తప్పకుండా వేరే వ్యాసంగా ఉంచుతాను. తూనికలు, కొలతలు పేరుతో వ్యాసం రాయాలి అనుకుంటున్నాను. ఇంత తక్కువ విషయంతో, వేరే వ్యాసం రాయటం ఎందుకని, నేను ఇందులో చేర్చాను. తూనికలు, కొలతలు వ్యాసం గురించి విషయ సేకరణ జరిపాను. ఆ విషయమంతా ఇంటి దగ్గర ఉంది. ప్రస్తుతం నేను కోల్‌కత్తా లో ఉన్నాను. ఇంటికి చేరగానే 'తూనికలు కొలతలు' వ్యాసం రాస్తానండి. మీరు దారి చూపినందుకు ధన్యవాదాలు Talapagala VB Raju 03:18, 14 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

భూముల రకములు

[మార్చు]
  • బీడు భూములు గురించి చక్కగా వశిదీకరించి వ్రాస్తున్నారు. ఈ వ్యాసాన్ని వాటి వరకు పరిమితము చేసి, తదుపరి మిగతా భూములు విశ్లేషణ వేరు వేరు వ్యాసములుగా ఉంటే బావుంటుందేమోనని నా భావన. అనగా:
  • ప్రభుత్వ భూములు లోని వివిధ రకములు: పోరంబోకు భూములు, వ్యవసాయ భూములు, వాణిజ్య భూములు, అటవీ భూములు, తదిరములయినవి.
  • ప్రభుత్వ రంగ సంస్థల భూములు: రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు వాటికి చెందినవి.
  • పట్టా భూములు: వ్యవసాయ భూములు, బీడు భూములు, వాణిజ్య భూములు.

ఈ విధముగా వివిధ విభాగములుగా చేసుకుంటే, ఆయా భూములకు సంబందించి శాసనములు అనగా:

  • ఏస్టేట్లు, భూ సేకరణ చట్టం 1894, స్థిరాస్థి స్వాధీన చట్టం 1952, తెలంగాణా కౌలు దారీ చట్టము 1950, కౌలు దారీ చట్టము 1956, పట్టాదారుల పాస్ పుస్తకముల చట్టము 1971, భూకమతముల చట్టము 1973, ఎవరికీ చెందని భూములు స్వాధీన చట్టము 1974, పట్టణ భూ పరిమితి చట్టము 1976, భూ ఆక్రమణల చట్టం 1982, భూ దురాక్రమణ చట్టము 1965, అనధికారిక భూ ఆక్రమణల చట్టము 1968, అసైన్డ్ భూముల చట్టము 1977,..........................ఇలా చాలా చట్టములు ఉన్నాయి. తిరిగి వీటికి విభాగములు కూడా ఉన్నాయి.
  • భవిష్యత్తులో భూములు గురించి ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది అనుటలో ఎటువంటి సందేహము లేదు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:32, 14 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • నేను ఇందులో బీడు భూములు గురించి రాస్తున్నానండి. మీరు చెప్పిన విషయాలు చాలా వివరంగా ఉన్నాయండి. మీకు అవకాశం ఉంటే, దయచేసి ఈ విషయాలతో "భూముల రకములు" తో ఒక వ్యాసం మొదలుపెట్టండి.మీరు చెప్పిన చట్టములు కూడా చేర్చండి. బీడు భూమి వ్యాసాన్ని మీరు వ్రాసే "భూముల రకములు" వ్యాసానికి లింకుగా ఏర్పాటు చేయవచ్చండి. క్రమంగా మిగతా భూముల రకములు గురించి వ్యాసాలు మొదలు పెట్టవచ్చును. అన్ని వ్యాసములు పూర్తి అయితే మీరు చెప్పినట్లు, మంచి ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. 117.230.83.49 02:54, 15 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]