Jump to content

చర్చ:భీమా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

తెలుగు వ్రాయబడిన ఈ వ్యాసం భారతదేశ అవసరాలకు గాని తెలుగు లో చదివే పాఠకులకు ఉపయోగ పడే విధంగా కానీ లేదని నా అభిప్రాయము.12:39, 12 ఏప్రిల్ 2013‎ Bandi.srinivassarma (చర్చ • రచనలు • నిరోధించు)‎

గూగుల్‌ అనువాద వ్యాసాల కోవలో ఉన్నవాటన్నిటికీ పైన ఉదహరించిన సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగని వ్యాసాలన్నీ భారతదేశ, తెలుగు దేశ అవసరాలకే పరిమితం కావాలని ఏముంది? సందర్భానుసారంగా కొన్ని వ్యాసాలు చదివినప్పుడు ప్రపంచం పోకడ ఎలా ఉందో తెలుస్తుంది కదా. అయినప్పటికీ నా ఉద్దేశంలో ఈ రెండు వ్యాసాలని విడివిడిగా ఉంచడమే మేలు. ఒక శీర్షిక (బీమా - ప్రపంచంలో), మరొక శీర్షిక (బీమా - బారతదేశంలో) అని వాడవచ్చు. ఇదే సమస్యని సైన్‌సు ఫిక్షన్ విషయంలో ఎదుర్కున్నాను. పాశ్చాత్య భాషలలో ఉన్న సైన్‌సు ఫిక్షనపారం; తెలుగులో ఉన్నది అత్యల్పం. రెండింటిని కలిపేసి ఒక వ్యాసంలా చేసెస్తే తెలుగులో ఉదతా భక్తితో జరుగుతూన్న కృషి పులుసులో పడ్డ బెల్లం ముక్కలా అయిపోతుంది. Vemurione (చర్చ) 14:27, 19 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మరొక విషయం: భీమా కాదు; బ కి ఒత్తు లేదు.

మరొక విషయం: గూగుల్ అనువాద వ్యాసాలు అన్నీ ఆంజనేయుడి తోకలా చాల పొడుగ్గా ఉన్నాయి. అటువంటి వాటిని శుద్ధి చేసే ప్రయత్నం చెయ్యడానికి భయం వేస్తోంది. వాటి పొడుగుని తగ్గించి, వివరాలకి ఇంగ్లీషు వికీపీడియాకి లంకె ఇస్తే సరిపోదా?

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:భీమా&oldid=1700553" నుండి వెలికితీశారు