Jump to content

చర్చ:భూసేకరణ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సొంత అభిప్రాయాలు, ఏక పక్షరాతలు

[మార్చు]

భూసేకరణ రైతులను భయపెట్టే పెనుభూతం అని రాశారు. అసలు శీర్షిక పేరుకి దీనికి అసలు ఎంతో దూరం ఉంది. ఎక్కడో రాయాల్సిన వాక్యాన్ని వ్యాసం మొదట్లో రాసారు. ముందు భూసేకరణ అంటే ఎంటో రాసి, ఎందుకు చేస్తారో రాసి, తర్వాత దాని లాభ నష్టాలు రాయాలి. కొంత మంది రైతులు ఫ్యాక్టరీలు పెడితే ఉద్యోగాలు వస్తాయని భూసేకరణను సమర్ధించిన వారు కూడా ఉన్నారు. ఇది బ్లాగు కాదు అన్న విషయాన్ని గమనించండి. సొంత అభిప్రాయాలకు తావులేదు. మూలాలు కూడా లేవు. --శశికాంత్ 11:24, 25 ఆగష్టు 2010 (UTC)

  • నేను సర్వజ్ఞుణ్ణి కాను.తెవికీలో నాకు తెలిసిందేదో రాశాను.సొంత అభిప్రాయాలు ఏకపక్షరాతలు ఉంటే శుద్ధి చేయండి.మీకు తెలిసిన విషయాలు ఇంకా ఇంకా జోడించండి.

"నిర్వాసితులకు జీవన భద్రత కావాలి.ఆంగ్లేయుల జమానాలో రూపుదిద్దుకున్న 1894నాటి భూసేకరణ చట్టం మౌలిక లక్ష్యమూ ప్రజాప్రయోజనాలకు విఘాతం వాటిల్లరాదన్నదే. 1984లో ప్రైవేట్ పరిశ్రమల అవసరాలకు దాన్ని విస్తరించిన దరిమిలా, బాధితులకు నిత్య క్షోభ అనుభవమవుతోంది.ఈ దుస్థితికి విరుగుడుగా- రైతులు, గ్రామసభలనుంచి 75శాతం మేరకు లిఖితపూర్వక సమ్మతి లభిస్తేనే అభివృద్ధి ప్రాజెక్టులపై ముందడుగు వేయాలని జాతీయ సలహామండలి సూచిస్తోంది.చైనాలో 'త్రీ గోర్జెస్' డ్యామ్ నిర్మాణ వ్యయంలో ఇంచుమించు సగాన్ని పదమూడు లక్షలమంది నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలకే ప్రత్యేకించారు.వారికి జీవితకాల పింఛను, శాశ్వత వసతి కల్పించారు"(ఈనాడు సంపాదకీయం 27.5.2011).--Nrahamthulla 06:55, 27 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]