చర్చ:మక్ఖలి గోశాలుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మక్ఖలి గోశాలుడుని జనన సంవత్సరం తప్పిపోయినవి (−) (±) (↓) (↑)మరణ సంవత్సరం తప్పిపోయినవి (−) (±) (↓) (↑)(+) ల వర్గాలలో చేర్చడం గురించి[మార్చు]

క్రీ.శ. 10 వ శతాబ్దం వరకు మన భారతదేశ చరిత్ర కాలగణనలో అస్పష్టంగానే వుంది. మరింత ప్రాచీనత పెరుగుతున్న కొలది తేదీలు, సంవత్సరాలు విషయంలో మరింత అస్పష్ట వుంటూనే వచ్చింది. S.G. sardesai ప్రకారం రుగ్వేదకాలం నుండి క్రీ.శ. 10 వ శతాబ్దం వరకూ భారత చరిత్రలో ఖచ్చితంగా మనకు తెలిసిన తేదీలు రెండే రెండు. అవి. సైరస్, అలెగ్జాండర్ లు భారతదేశం మీద దండయాత్రలు చేసిన తేదీలు మాత్రమే. ఆ విధంగా చూస్తే మక్ఖలి గోశాలుడు ఒక చారిత్రిక వ్యక్తిగా బుద్దుని సమకాలికుడుగా గుర్తించబడ్డాడు. మలి వేదానంతరకాలంలో జీవించిన వ్యక్తుల జనన మరణ సంవత్సరాలు ఖచ్చితంగా ఎవరూ చెప్పలేని స్థితి. ఒకవేళ వారు పురాణ వ్యక్తులయితే వారి జీవించిన కాలాలు అభూత కల్పనలతో వుంటాయి. అటువంటి పురాణ కాల్పానిక కాలాలు వాస్తవ కాలాలుగా పేర్కొంటూ వికీ చదువరులను తర్కరహిత మైన తేదీలను ఇవ్వడం మంచిది కాదు. అయితే మలి వేదానంతరకాలం లో జీవించిన వ్యక్తీ చారిత్రిక వ్యక్తి అయినపుడు అతని కాలాలు (జనన మరణ సంవత్సరాలు) మనకు తెలియనపుడు, తెలిసే అవకాశం ఎంతమాత్రం లేనపుడు అస్పష్టంగా ఊహించబడే జనన మరణ సంవత్సరాలనే ఖచ్చితమైనవిగా చిత్రించడం సరికాదు. అటువంటి పరిస్థితులలో ఆయా వ్యక్తుల సమకాలికులను (సుప్రసిద్ధ చారిత్రిక పురుషులను) పేర్కొనడం ఉత్తమ చారిత్రిక గణన పద్దతి. కాబట్టే నిస్సందేహంగా చారిత్రిక వ్యక్తీ అయిన మక్ఖలి గోశాలుడిని మహావీరుడు, గౌతమ బుద్దిని సమకాలిక వ్యక్తి గానే పేర్కొన్నారు. పైగా క్రీ. శ. 5, 6 శతాబ్దాల మద్యన జీవించిన వాడుగా భావించబడింది. ఒక వేళ మక్ఖలి గోశాలుడుని జనన సంవత్సరం తప్పిపోయినవి, మరణ సంవత్సరం తప్పిపోయినవి అనే వర్గాలలోనే ఉంచాలంటే, నిజానికి అలాంటి వర్గాలలో మన పురాణ పురుషులు, పౌరాణిక కథానాయకులు, కాల్పానిక వ్యక్తులు, మునులు, ఋషులు మొదలగు వారందరరి గురించిన వ్యాసాలన్నీ కూడా చేర్చవలసి వుంటుంది. కాబట్టి మక్ఖలి గోశాలుడు వర్గాన్ని జనన సంవత్సరం తప్పిపోయినవి, మరణ సంవత్సరం తప్పిపోయినవి అనే వర్గాల నుంచి తప్పించవలసినది. --Vmakumar (చర్చ) 23:49, 26 ఆగష్టు 2015 (UTC)