చర్చ:లంచం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాదేదీ ఖురాన్ కు అనర్హం

[మార్చు]

ఒక సినిమాలో బ్రహ్మానందం ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఏ ప్రశ్న అడిగినా చివరకు అశోకుడి గురించి చెప్పడం మొదలుపెడతాడు. రహ్మతుల్లా గారు కూడా అదే చేస్తున్నారు. ఆయన ప్రపంచం ఖురాన్ చుట్టూ తిరుగుతూ ఉంది. మనిషి ఏ పని చేయాలో ఏది చేయకూడదో అన్నీ ఖురాన్ చెబుతుంది. ఈ లెక్కన వికీలోని ప్రతి వ్యాసంలో కొన్ని రోజులకి ఖురాన్ ఏం చెబుతుందో ఉంటుంది. అప్పుడిది ఖురాన్ వికీగా తయారైపోతుంది. అసలు లంచానికి ఖురాన్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఏదో చీమతలకాయ అంత సంబంధాన్ని పట్టుకుని దాని కోసం శీర్షిక రాసారు. సరే బాగుంది. మరి అలాంటపుడు , దానికి ఏ శిక్ష విధిస్తారో కూడా రాయాలి కదా.. ఏ చేతులు నరకడమో , రాళ్ళతో కొట్టి చంపడమో లాంటి శిక్షలు ఉంటాయి. అవి మాత్రం రాయరు.
ఇలా ఎందుకు రాయకూడదో వివరిస్తాను వినండి.

  • కోడి వ్యాసం ఉందనుకోండి. ఖురాన్ ప్రకారం కోడిని నరికేందుకు కూడా ప్రత్యేక పద్ధతి ఉంది.
  • అలాగే మిగిలిన మేకలు , ఆవుల వ్యాసాలలోనూ ఖురాస్ శీర్షికలు వస్తాయి.
  • లంచం, శృంగారం, వ్యభిచారం, దొంగతనం, దానం, విగ్రహం, వస్త్రధారణ, పెళ్ళి, బహుభార్యత్వం, బానిసత్వం, అత్యాచారం, హిందువులు, క్రైస్తవులు, యూదులు, ఇలా అన్నిటిలోనూ ఖురాన్ శీర్షికలు వస్తాయి.
  • గృహహింస వ్యాసంలోనూ, భార్యని ఎలా కొట్టాలో , ఎలా కొట్టకూడదో కూడా ఖరాన్ చెబుతుంది. how to beat your wife
  • సంగీతం వ్యాసంలో కూడా ఖురాన్ శీర్షిక వస్తుంది.
  • కాదేదీ కవితకు అనర్హం అని ఒకరంటే, రహ్మతుల్లాగారు, కాదేదీ ఖురాన్ కు అనర్హం అన్ని రీతి దూసుకుపోతున్నారు.
  • ఫుట్‌బాల్ వ్యాసంలోనూ ఖురాన్ శీర్షిక వస్తుంది. ఎలా అంటారా, జీహాద్ లో ఉన్న వారు ఫుట్‌బాల్ చూడటం నిషేధించారు.islamic-militants-kill-two
  • చివరకు హిందూమతానికి సంబంధించిన వ్యాసాలలోనూ ఖురాన్ అభిప్రాయాలు వస్తున్నాయి.

కేవలం ఇస్లాంకి సంబంధించిన వ్యాసాలలో మాత్రమే ఇస్లాం అభిప్రాయాలు ఉండాలి. లేకపోతే తెవికీని ఖువికీగా మార్చండి. --శశికాంత్ 05:20, 10 సెప్టెంబర్ 2010 (UTC)

  • ఖురాన్,బైబిల్ లో ఉన్న మంచి విషయాలను ఖచ్చితంగా రాస్తాను.వాటిలోని చెడు వాక్యాలు నాకు అక్కరలేదు అని అనేకసార్లు చెప్పాను.మీరు కూడా ఆయా సామాజిక విషయాలగురించి గీతలో ఉన్న మంచి వాక్యాలను ఉదాహరించండి.--Nrahamthulla 08:52, 10 సెప్టెంబర్ 2010 (UTC)
  • కచ్చితంగా రాయండి. కానీ ప్రతి వ్యాసంలోను కాదు. మత సంబంధ వ్యాసాలలో రాయండి. చెడు విషయాలు మీకు అక్కర్లేకపోతే మిగిలిన వారికి అవసరం, నేను రాస్తాను. అందుకే సంబంధంలేని వ్యాసాలలో మత విషయాలు రాయకూడదనేది నా వాదన.

మనం మత గ్రంథాలను రూపొందించట్లేదు. అన్ని వ్యాసాలలో మత విషయాలు రాస్తూపోతే తెవికీ మతమయం అవుతుంది. అసలుకే ఎసరొస్తుంది. అందరూ వికీ అభివృద్ధి వదిలేసి ఎక్కడ తమ మతం గురించి రాయాలో ఆలోచిస్తారు. మతం గురించి దానికి సంబంధించిన వ్యాసాలలో రాయాలి , లేకపోతే కాస్త అవసరం అనిపించిన వ్యాసాలలో రాయాలి. అంతేగాని ప్రతివ్యాసంలోనూ ఉండకూడదు. ఒకవేళ మీరు ఈ విషయాలను ఉంచదలచుకుంటే, మీకు అనవసరం అనిపించిన చేతులు నరకడం అన్న విషయాలు కూడా నేను రాస్తాను. ఇతర సభ్యులు, నిర్వాహకులు కూడా తమ అభిప్రాయాలు తెలుపగలరు. --శశికాంత్ 10:50, 10 సెప్టెంబర్ 2010 (UTC)

  • తెవికి ఒక విజ్ఞాన సర్వస్వం, దీనిలో అన్ని విషయాలు(మంచి మరియు చెడు) పొందుపరచే అవకాశంవుంది, కాకపోతే ప్రస్తుతం వివాదంలోవున విషయం చేర్చేందుకు ప్రత్యేక విభాగం అవసరము లేదు, మతాల అబిప్రాయం అనే ఒక విభాగంలో పెడితే సరిపోడుంది. కేవలం మనము రాసే విషయాలే ప్రతేయ్క ఆకర్షణ పొందేటుగా వ్రాయకూడదు. --Ranjithsutari 18:10, 10 సెప్టెంబర్ 2010 (UTC)
  • ప్రస్తుతం నేను చేసిన దిదుబాటు నచ్చనటైతే, దానిని రాదు చేయండి.--Ranjithsutari 18:31, 10 సెప్టెంబర్ 2010 (UTC)

ఈ చర్చలో రెండు పక్షాల వాదనలు బేరీజు వేయడానికి ప్రయత్నిస్తున్నాను. (1) వ్యాసం మొలక దశలో ఉన్నది గనుక వ్రాసిన ప్రతివిషయమూ సమతుల్యత తప్పినట్లుగా అనిపిస్తుంది. అదే వ్యాసం పెద్దదయ్యిందనుకోండి. అప్పుడు రహమతుల్లాగారు వ్రాసిన ఒక పేరా సబబుగానే ఉంటుంది. వ్రాసింది యదార్ధమూ, మరియు మూలాలు ఉదాహరించినది గనుక ఉండడం తప్పు లేదు. కాకపోతే ఈ వ్యాసాన్ని మరెవరైనా విస్తరించేదాకా ఇది కుంటి వ్యాసంలా కనిపిస్తుంది. (2) శశికాంత్ చెప్పిన విషయం కూడా చాలా substance ఉన్నదని, రహమతుల్లాగారు గమనిస్తే బాగుంటుంది. ఎందుకంటే Balanced view point, Supported view point మరియు due emphasis for other view point ఇవ్వడం అవుసరం. శశికాంత్ చెప్పినది కొంచెం కటువుగా ఉన్నా నిజం. అధికంగా రహమతుల్లాగారు వ్యాసం సమతుల్యత కంటే తమ దృక్పధానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నేను గమనించాను. --కాసుబాబు 18:39, 10 సెప్టెంబర్ 2010 (UTC)

  • కాసుబాబు గారూ కుంటివ్యాసం పెద్దది అవ్వాలంటే తలాఒక చెయ్యి వెయ్యాలి.వికీలో వ్యాస విస్తరణ నిరంతర ప్రక్రియ.నేను వ్రాసింది యదార్ధమూ, మరియు మూలాలు ఉదాహరించినది గనుక ఉండడం తప్పు లేదు అన్నారు సంతోషం.మూలాలు లేకుండా,ఆయా మత లేఖనాలు కాకుండా నా సొంత దృక్పధం వెల్లడిస్తే ఆవిషయాలను తొలగించండి.--Nrahamthulla 02:01, 11 సెప్టెంబర్ 2010 (UTC)
  • రంజిత్ గారు చేసిన మార్పు బాగుంది. రహ్మతుల్లా గారు, మూలాలు ఇవ్వండి. మీరు ఏ లంకె నుంచి ఇవి తీసుకున్నారో ఇవ్వండి. --శశికాంత్ 05:09, 11 సెప్టెంబర్ 2010 (UTC)
  • బైబిల్ లోని(సామెతలు 17:23),(నిర్గమ 23:8),(ద్వితీయోపదేశకాండము 16:19),హదీసులోని (దావూద్ :1595),ఇంకా (ఖురాన్ 2:188) లను ఆయా వాక్యాల మూలాలు(రిఫరెన్స్) గా మునుపే పేర్కొంటిని కదా?--Nrahamthulla 05:26, 11 సెప్టెంబర్ 2010 (UTC)
  • మూలాలని పేర్కొనడం ఎందుకో ఒకసారి ఆలోచించండి. అవి మిగిలిన వారు కూడా చూడగలిగేట్టు verify చేసుకునేట్టు ఉండాలి. ఆనలైన్ లో చాలా ఖురాన్ పుస్తకాలు ఉన్నాయి కదా. వాటిలో లంకెలని జతపరచండి, లేదా మీరు ఎక్కడ నుండి ఈ వాక్యాలు తీసుకున్నారో తెలపండి. కామెంట్స్ లోని వాక్యాలు మూలాలగా పనికిరావు. సరైన లంకెలు ఇవ్వండి లేదా ఏదైనా ముద్రింపబడ్డ పుస్తకం పేరు చెప్పండి. మీరు చెప్పినవి అసలు ఉందో లేదో కూడా ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఒకదానికి సామెతలు అని ఉంది , ఇంకో దానికి ద్వితీయోరదేశకాండము అని ఉంది. ఇవి పుస్తకాలు కావు , లంకెలు కావు, మరి ఇవి ఏంటి ? కాండము అనేది హిందువుల పురాణాలలో భాగాలను సూచించేందుకు ఉపయోగిస్తారు. నాకు తెలిసి ఏ క్రైస్తవ పుస్తకంలోనూ కాండములుగా లేవు. --శశికాంత్ 09:46, 12 సెప్టెంబర్ 2010 (UTC)
  • అవి పుస్తకాలే.బైబిల్ అంటే 66 పుస్తకాల గుచ్ఛం.అందులో జగద్విఖ్యాతి గాంచిన ఆదికాండము, నిర్గమకాండము,లేవీయకాండము,సంఖ్యాకాండము,ద్వితీయోపదేశకాండము,సామెతలు లాంటివన్నీ40 మందిప్రవక్తలచేత రాయబడిన విడివిడి పుస్తకాలే.మీరు బైబిల్ లోని ఆయాపుస్తకాలను రిఫర్ చేస్తే గదాతెలిసేది.--Nrahamthulla 11:55, 12 సెప్టెంబర్ 2010 (UTC)
  • మీరు లంకె ఇస్తే గదా తెలిసేది. మీరు ఒక సైట్లోని కామెంట్లు పట్టుకుని వచ్చి రాసారని నాకు తెలుసు. నేను చాలా ఆంగ్ల సైట్లు చూశాను. కాని వాటిలో ఉన్న వాటికి ఇక్కడ ఉన్న వాటికి తేడా ఉంది. అందుకే లంకెలు అడిగాను. మీరు మాత్రం ఏదో పుస్తకం కొని చదివి రాసినట్టు చెబుతున్నారు. ఆ పుస్తకాల వివరాలు కాస్త చెబితే సంతోషిస్తాను. నేను చదివిన తెలుగు అనువాద పుస్తకం లో ఇలా కాండాలు లేవు. ఆంగ్ల బైబిల్ కు మరియు ఆంగ్ల కురాన్ కు తగ్గట్టుగా మార్పులు చేస్తాను. ప్రవక్త శపించలేదు. అల్లాహ్ శపిస్తాడని ప్రవక్త చెప్పాడు. ముందు మీరు కురాన్ సరిగా చదవండి. --శశికాంత్ 13:36, 12 సెప్టెంబర్ 2010 (UTC)
  • ఇంకా ముందుకు కొనసాగేందుకు, బైబిల్ లేదా ఖురాన్ చదివే ముందు వికి విధానములు మరియు సూచనలు చదివితే బాగుంటుంది.
  • Rahamthulla గారు చేర్చిన వాక్యాలు అచ్చంగా ఖురాన్ లేదా బైబిల్ నుంచి తిసుకునటైతే, వాటిని ఇక్కడ కాకుండా ఇతర వికి సోదర ప్రాజెక్టులైన Wikisourceలో చేర్చితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఆశించేది వ్యాసరుపములో వుండే వాక్యాలను మాత్రమె కానీ "అన్ని సామెతలు" లేదా "అందరి ఉపన్యాసములు" కాదు(కొన్ని అనివార్య సందర్భాలో తప్ప).
  • ఏది ఏమైనప్పటికీ, వ్యాసములో చేర్చిన వాక్యాలకు వ్యతిరేకత వస్తే, కచితంగా సరైన ముల్లాలు చేర్చవలెను, లేనిపక్షాన వాటిని తొలగించబడును. మూలాలు పొందుపరచినా ఇంకా వ్యతిరేకత వుంటే నమ్మదగిన మూడోవ పక్షం మూలాలు(Reliable Thirdparty source) కూడా పోదుపరచాలి. ఇందుకొరకు మీకు ఒక వారం వ్యవధి సరిపోతుంది, ఇంకా సమయం కొరకు సంపాదకులు అడగవచు.--Ranjithsutari 17:39, 12 సెప్టెంబర్ 2010 (UTC)
  • ప్రపంచంలో అత్యధికులు చదివే బైబిల్ లోని 66 పుస్తకాలు చూడండి.40 సంవత్సరాలనుండి చదివిన అనుభవంతోనే చెబుతున్నాను.బైబిల్ లోని విషయాలను క్రైస్తవులు అందులోని పుస్తకాలపేర్లతోనే పిలుస్తారు.ఏక్రైస్తవుడిని అడిగినా ఈ సంగతి చెబుతాడు.సామెతలు అనేది సొలోమోను రాసిన బైబిల్ లోని పుస్తకం.--Nrahamthulla 01:56, 13 సెప్టెంబర్ 2010 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:లంచం&oldid=542711" నుండి వెలికితీశారు