చర్చ:శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


జననం: 23-4-1891, తూర్పు గోదావరి జిల్ల్లా పొలమూరు. మరణం: 25-2-1961. రాజమండ్రి. సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసాడు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనెక పద్య రచనలు, నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంధాలు కూడా రాసాడు. ప్రబుద్ధాంధ్ర అనే పత్రికను చాలా కాలం నిర్వహించారు. గిడుగు వారి లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. గాంధీ, ఖద్దరు, హిందీ, ఈ మూడింటినీ వ్యతిరేకించాడు. కలం పేర్లు: శాస్త్రి, వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమారకవిసింహుడు, భటాచార్యుడు, కౌశికుడు, ఈ పేర్లతో శతాధిక వ్యాసాలు రాసాడు. అనేక అష్టావధానాలు కుడా చేసాడు.

ప్రముఖ రచనలు: అనుభవాలూ -జ్ఞాపకాలూనూ (ఆత్మకథ) కలుపు మొక్కలు (కథ) వడ్లగింజలు (కథ) గులాబీ అత్తరు (కథ) మార్గదర్శి (కథ) శ్మశానవాటిక (నవల) రాజరాజు (నాటకం) నిగళబంధనం (నాటకం)

శ్రీపాద రచనల్లో స్త్రీ పాత్రల గురంచి ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్ )ప్రత్యేక సంచిక -2006 లో వ్యాసం (ఈమాట వెబ్ పత్రికలో సౌజన్యంతో) http://eemaata.com/em/library/ata-2006/251.html


  1. మేఘమాల గారు, మీరు ఇచ్చిన సమాచారాన్ని వ్యాసంలో కలిపాను. మార్పుల్ని గమనిస్తే, వికీలో వ్యాసాలు వ్రాసే శైలి మికి బోధపడూతుంది. ఇంకా ఏమైనా అనుమానాలుంటే..నా నా చర్చా పేజీలో అడగండి
  2. శాస్త్రిగారి జననం మహేంద్రవాడ అని ఒక చోట, పొలమూరు అని మరొక్క చోట ఉంది. ఏది సత్యం? --నవీన్ 07:34, 5 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  1. శాస్త్రి గారి జననం పొలమూరు లోనే. మహేంద్రవాడ కాదు. ఇది వారి ఆత్మకథ నించి, ఇంకా విశాలాంధ్ర వారు ప్రచురించిన వారి పుస్తకాల వెనకపేజీ నించి.
  2. శాస్త్రి, వాచస్పతి మధ్యలో కామా ఉండాలి. ఎలా సరి చెయ్యాలి?
మీరు ఈ వ్యాఖ్య ఎలా రాశారో అలాగే ఆ పేజీని కూడా దిద్దవచ్చు --వైఙాసత్య 10:49, 5 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]