చర్చ:సిద్ధాంతం (పెనుగొండ)
సిద్దాంతం గ్రామం మేజర్ పంచాయతీ గ్రామం. ఇది వ్యవసాయాధారిత గ్రామం. ఇక్కడ రైతులు రకరకాల పంటలు పమ్డిస్తారు. వరి, చెరకు, పసుపు, పచ్చిమిర్చి,కూరగాయలు, ఆకుకూరలు మొదలైనవి పమ్డిస్తారు. ఈ గ్రామం జాతీయ రహదారి నెంబరు.7 కు దగ్గర్లోను, నర్సాపురమ్ రోడ్లోను ఉంది. ఇక్కడ ఎలిమంటరి పాఠశాలలు, జిల్లా పరిషథ్ హై స్కూల్ ఉన్నాయి. దగ్గర్లోని ఇలపర్రు, నడిపూడి, ములపర్రు,దేవ, కొటాలపర్రు, రామన్నపాలెం, వడలి, దొంగరావి పాలెం మొదలైన గ్రామాల విద్యార్ధులు ఈ సిద్దాంతం గ్రామంలోని జిల్లా పరిషథ్ హై స్కూల్ నందు చదువుకొంటారు. కానీ ఈ గ్రామంలో ఒక కళాశాల లేకపోవడం తీరని లోటుగా ఉంది. కళాశాల విద్య కోసం ఈ గ్రామాల విద్యార్ధులంతా దూరంలో ఉన్న పెనుగొండకు గాని తణుకు గాని వెళ్ళి చదువుకో వలసివస్తోంది. ఇక్కడ ఒక కళాశాల ప్రారంభింవచాల్సిన అవుసరం ఎంతయినా ఉంది.
సిద్ధాంతం (పెనుగొండ) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సిద్ధాంతం (పెనుగొండ) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.