Jump to content

సిద్ధాంతం (పెనుగొండ)

అక్షాంశ రేఖాంశాలు: 16°40′20.172″N 81°48′41.328″E / 16.67227000°N 81.81148000°E / 16.67227000; 81.81148000
వికీపీడియా నుండి
సిద్ధాంతం (పెనుగొండ)
సిద్ధాంతం వారధి నుండి కనిపించే వశిష్ట గోదావరి నది
సిద్ధాంతం వారధి నుండి కనిపించే వశిష్ట గోదావరి నది
పటం
సిద్ధాంతం (పెనుగొండ) is located in ఆంధ్రప్రదేశ్
సిద్ధాంతం (పెనుగొండ)
సిద్ధాంతం (పెనుగొండ)
అక్షాంశ రేఖాంశాలు: 16°40′20.172″N 81°48′41.328″E / 16.67227000°N 81.81148000°E / 16.67227000; 81.81148000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
మండలంపెనుగొండ
విస్తీర్ణం10.72 కి.మీ2 (4.14 చ. మై)
జనాభా
 (2011)[1]
13,188
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,200/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు6,716
 • స్త్రీలు6,472
 • లింగ నిష్పత్తి964
 • నివాసాలు3,519
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534326
2011 జనగణన కోడ్588676

సిద్ధాంతం, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ మండలానికి చెందిన గ్రామం..ఇది మండల కేంద్రమైన పెనుగొండ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తణుకు నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3519 ఇళ్లతో, 13188 జనాభాతో 1072 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6716, ఆడవారి సంఖ్య 6472. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2391 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 125. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588676.[2]

సిద్దాంతం గోదావరిని ఆనుకొని ఉన్న ఊరు. ఈ గ్రామం తణుకు నుండి పదిహేను‌ కిలోమీటర్లు, రావులపాలెం నుండి ఇరవై కిలో మీటర్లు దూరంలో ఉంది. పచ్చని చేలతో కళకళలాడే అందమైన తీరగ్రామమైన సిద్ధాంతంలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఊరి ప్రక్కగా వెళ్ళే ఏడవ నెంబరు జాతీయ రహదారి మీదుగా నిర్మించిన వారధి రెండు కిలోమీటర్ల పొడవు ఉంది. గ్రామంలో తీరప్రాంతము మొదలుకొని అంతటా రకరకాల కూరగాయలు పండిస్తారు.సిద్దాంతం గ్రామంలో సెకండరీ స్కూల్ స్థాయి వరకు విద్యాసౌకర్యం ఉంది. గ్రామంలో ఎలిమెంటరీ స్కూళ్ళు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి.

దేవాలయాలు

[మార్చు]

గ్రామం నిండుగా చిన్నా, పెద్దా దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇంచుమించుగా ప్రతి వీధికి ఒక దేవాలయం ఉంది. ముఖ్యంగా రామాలయం, కేశవ స్వామి దేవాలయం, కేదారేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, వీరభద్ర స్వామి దేవాలయం ఇంకా చిన్నా పెద్దా దేవాలయాలు చాలా ఉన్నాయి. గ్రామంలో లూథరన్ చర్చి, గోదావరి డెల్టా మిషన్ చర్చి, పెంతుకోస్తు చర్చి ఇంకా ఇతర డినామినేషన్ల చర్చిలు ఉన్నాయి. గోదావరి నది ఒడ్డున ఉన్న కేదారేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రశాంత వాతావరణంలో రమణీయంగా ఉంటాయి.

విశేషాలు

[మార్చు]
సిద్దాంతం పంచాయితీ కార్యాలయం
  • ఈ గ్రామంలో వీధికి ఒక దేవాలయం ఉంటుంది. ముఖ్యంగా, కేశవ స్వామి దేవాలయం, కేదారేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం చక్కటి శిల్ప కళతో అలరారుతూ ప్రశాంతంగా మనోరంజకంగా ఉంటాయి.
  • ఈ గ్రామంలోని రైతులు అన్ని రకాల పంటలు పండిస్తారు. వరి, చెరకు, మిరప, పసుపు, పొగాకు, కూరగాయలు, ఆకు కూరలు పుష్కలంగా పండిస్తారు. ఈ ప్రాంతము బెల్లానికి ప్రసిద్ధి.
  • గోదావరి నది ఒడ్డున చల్లని వాతావరణంలో మనల్ని మనం మర్చి పోగలుగుతాము.
  • వర్షాకాంలో ఇక్కడి జాలర్లు గోదావరి నదిలో పట్టి తెచ్చే పులస చేపల సందడి, వాటి రుచి మరి దేనికి వస్తుంది?
  • వినాయక చవతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకొంటారు. ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై రకరకాల వేషాలతో ఊరంతా ఊరేగుతారు. బేతాళుడి వేషధారి ఉలిక్కి పడేటట్టు చేస్తాడు.
  • ఇక్కడ నుండి ప్రారంభమయ్యే వారధి రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
  • వారధి దిగువన ప్రతిరోజూ జరిగే కూరగాయల సంత ఒక ప్రత్యేకత కలది. కూరగాయలసంత అంటే చుట్టుపట్ల జరిగే సంతలకొరకు, రోజువారీ అమ్మకంకొరకు వర్తకులు కొనుగోలు చేసేందుకు వచ్చే చిల్లర బజారు. ఉదయం మొదలు మధ్యాహ్నం వరకూ జరిగే ఈ మార్కెట్లో రోజూ లక్షల వ్యాపారం జరుగును.
  • ఇక్కడ ఉదయం సాయంత్రం జరిగే చేపల మార్కెట్లో తాజా చేపల కొనుగోలుకొరకు సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో వస్తుంటారు.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,150. ఇందులో పురుషుల సంఖ్య 6151, మహిళల సంఖ్య 5999, గ్రామంలో నివాస గృహాలు 2951 ఉన్నాయి.ఇది మండల కేంద్రమైన పెనుగొండ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తణుకు నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3519 ఇళ్లతో, 13188 జనాభాతో 1072 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6716, ఆడవారి సంఖ్య 6472. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2391 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 125. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588676.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప అనియత విద్యా కేంద్రం, పెనుగొండలోను, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తణుకులోనూ ఉన్నాయి. దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సిద్ధాంతంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

సిద్ధాంతంలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

సిద్ధాంతంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 200 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 203 హెక్టార్లు
  • బంజరు భూమి: 80 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 587 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 80 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 587 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

సిద్ధాంతంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 587 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

సిద్ధాంతంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, పసుపు

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

ఇటుకలు

చేతివృత్తులవారి ఉత్పత్తులు

[మార్చు]

లేసులు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".