చర్చ:స్వేచ్ఛా పతనం
స్వరూపం
ఉప శీర్షిక తొలగించుట గూర్చి
[మార్చు]"స్వేచ్చా పతనం" అని ఒక వ్యాసం వ్రాసారు. అనగా స్వేచ్చగా ఒక వస్తువు గురుత్వాకర్షణ ప్రభావంతో క్రిందికి పడుట. ఇది కొంత ఎత్తు వరకే సాథ్యమగును. భూమి వ్యాసార్థం లో సగందూరం అనగా సుమారు 3200 కి.మీ పైకి పోయిన భూమి గురుత్వ త్వరణం శూన్యమగును. అందువలన "గురుత్వాకర్షణ క్షేత్రంలో" అని వ్రాయాలి. "స్వేచ్చా పతనం" అనగా స్వేచ్ఛగా పడిపోవుట. "స్వేచ్ఛా పతన వస్తువు" అనగా వస్తువుకి సంబందించిన విషయం. ఇలాంటి పరిస్థితిలో రెండు వ్యాసాలు ఎందుకు.
ఈ వ్యాసంలో "పైకి పోయే వస్తువుల సమీకరణాలు" గురించి వ్రాస్తున్నారు. ఈ అంశం ఈ వ్యాసానికి సంబందించినది కాదు. కనుక దీనిని తొలగించండి. లేదా ఎందుకు తొలగించ కూడదో చర్చించంది.( కె.వి.రమణ- చర్చ 17:26, 22 జనవరి 2013 (UTC))