చర్చ:హైదరాబాదుపై పోలీసు చర్య
తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతు కూలీలను, పోరాటయోధులను కాల్చి చంపింది.
విమోచన అంటే చరిత్ర నవ్వదా?
- ఎన్. వేణుగోపాల్
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందని ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చ గొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం , భారతీయ జనతా పార్టీ ఈ కట్టు కథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ‘మా వైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టే’ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ‘దీన్ని విమోచనం అనక పోతే రజా కార్ల వైపు ఉన్నట్టే’ అని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చిన సంఘ పరివారం ఇప్పటికి చాలామందిని లొంగదీసింది. అలా లొంగిపోయిన వారి జాబితా ఇంకా పెరిగిపో తోంది.
మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక భావజాల పక్షం చేస్తున్న ప్రయత్నాల కు ఎవరెవరు ఏ ప్రయోజనాల కొరకు లొంగిపోదలచుకున్నారో వారి వారి ఇష్టం. కాని సెప్టెంబర్ 17, 1948 ని ‘హైదరాబాద్ విమోచన దినం’అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలం గాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైద రాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన కిందికి తెచ్చిన రోజు. అలా తేవడం కోసం, పోలీస్‌చర్య పేరుతో జరిపిన సైనిక దాడి విజయం సాధించిన రోజు. విలీనం అనే మాట వాడడం కూడ కష్టం.
ఆ మాటలో కూడ విలీనమయ్యే వారి ఆమోదం ఉందనే అర్థం ఉంది. 1948 సెప్టెంబర్ 17 చర్యకు నిజంగా తెలంగాణ ప్రజామో దం ఉందా అనేది సందేహాస్పదమే. ‘ముస్లిం పాలన కింద ఉన్న హైదరా బాదు హిందూ ప్రజలకు 1948 సెప్టెం బర్ 17న కేంద్ర ప్రభుత్వం విమోచన కలిగించిందని, అందువల్ల హైదరాబాద్ రాజ్యాధీశుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోయిన ఆ తేదీని హైదరాబాద్ విమోచన దినంగా జరపాలని’ సంఘ పరివారం వాదిస్తున్నది. అసలు హైదరా బాద్ ముస్లిం పాలన కింద ఉండేదనేదే అర్ధ సత్యం.
పాలకుల మత విశ్వాసం ఇస్లాం కావచ్చుగాని వారు ఆధారపడింది ఇటు ‘హిందూ’ భూస్వాముల మీద, అటు క్రైస్తవ’ వలసవాదుల మీద. చివరకు మతోన్మాదులుగా పేరు పడిన రజాకార్ల సైన్యం కూడ హిందూ జాగీర్దార్ల, దేశ్‌ముఖ్‌ల, భూస్వాముల తరపున, వారి గడీలలో విడిది చేసి, తిని తాగి, పేద ప్రజల మీద, పోరాడుతున్న రైతుకూలీల మీద హంతక దాడులు చేసిం ది. అందువల్ల అసలు 1948 నాటి హైదరాబాద్ పాలనను రజాకార్ల దాడులను ముస్లిం పాలనగా, ముస్లిం మతదాడులుగా చిత్రించడం ఒక కుట్ర. అది ఒక నిరంకుశ పాలన అనే మాట, దాని నుంచి ప్రజలు విముక్తిని కోరుకు న్నారనే మాట నిజ మే.
కాని 1948 సెప్టెంబర్ 17 ఆ విముక్తిని కూడ సాధించలేదు. హైదరాబాద్ రాజ్యపాలన 1950 జనవరి 26 దాకా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పేరు మీదనే సాగింది. ఆ తర్వాత కూడా 1956 నవంబర్ 1 దాకా ఆయన రాజప్రముఖ్‌గా కొనసాగాడు. దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పి, ప్రజల గోళ్ళూడ గొట్టి పన్నులు వసూలుచేసి ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకడుగా పేరుపడ్డ నిజాం ఆస్తులను ఈ ‘విమోచన’ తర్వాత స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగించ లేదు సరిగ దా, అయనకే ఎదురుగా రాజభరణం, నష్టపరిహారాలు అందజేశారు. ఆయన ఆస్తులలో అత్యధిక భాగాన్ని, ఆయన అధికారాలను Äధాతథంగా ఉంచారు.
ఎవరి నుంచి విమోచన సాగినట్టు? ఎవరికి విమోచన దొరికినట్టు? నిజాం పాలన నుంచి, భూస్వామ్య పీడన నుంచి విముక్తి కోరుతూ పోరాటం ప్రారంభించిన ప్రజలు ఆ పోరాటాన్ని 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఆపివేయలేదు. ఆరోజుతో ఏదో మార్పు వచ్చిందని ప్రజలు భావించ లేదు. గొర్రెలు తినేవాడుపోయి బర్రెలు తినేవాడు వచ్చాడని ప్రజ లు చెప్పుకున్నారు. అందుకే ఆ తర్వాత మూడు సంవత్సరాలపాటు ప్రజలుసాయుధ పోరాటం కొనసాగించారు.
తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతు కూలీలను, పోరాటయోధులను కాల్చి చంపింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1946 జూలై 4 నుంచి 1948 సెప్టెంబర్17 దాకా నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్య ల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు, ఆకృత్యాలు ఎక్కువ. ప్రజలు సాధించుకున్న విజయాలన్నిటినీ నెహ్రూ-పటేల్ సైన్యాలు ధ్వంసం చేశా యి. ప్రజలు ఆక్రమించుకున్న భూములను మళ్లీ భూస్వాములకు కట్టబెట్టాయి.
రజాకార్లను అణచడం అనే పేరు మీద రెండు లక్షల మంది అమాయక ముస్లింలను ఊచకోత కోశాయి. ఆ బీభత్సకాండకు నాందిపలికిన సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అభివర్ణించడం అర్థ రహితం. సమకాలీన చరిత్రకారులు, పరిశీలకులు ఆ తేదీని విమోచన దినంగా పేర్కొనలేదు. స్వయంగా ఆ సైనికదాడిని నడిపిన వాళ్లు, యంత్రాంగం నెరిపినవాళ్లు, సమర్థించినవాళ్లు కూడ దాన్ని విలీనం, పోలీసు చర్య వంటి మాటల తోనే సూచించారు గాని విమోచన అనలేదు. కొన్ని సంవత్సరాల కింద సంఘపరి వారం ప్రారంభించి న ‘విమోచన’ ఆలోచన ఇవాళ అన్ని రాజకీయపక్షాలకు అంటుకున్నట్టుంది.
అందరికన్న ఎక్కువ ఆశ్చర్యకరంగా ఆ తేదీన మొదలుపెట్టి తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరపాలని సిపిఐ, సిపిఎం నిర్ణయించుకున్నాయి. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటానికి సంకేతాత్మక ప్రారంభమైన దొడ్డి కొమురయ్య అమరత్వ దినం (1946 జూలై 4) గాని, సాయుధ సమర ప్రారంభానికి రావి నారాయణ రెడ్డి , బద్ధం ఎల్లా రెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌లు పిలుపు ఇచ్చి న 1947 సెప్టెంబర్ 11 గాని, సాయుధ పోరాటాన్ని అధికారికంగా విరమించిన 1951 అక్టోబర్ 20 గాని సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భం అవుతాయి గాని, తమ కార్యకర్తలను ఇతోధికంగా చంపడానికి కారణమైన, తాము అప్పుడు ఏ మార్పు లేదని భావిం చి పోరాటం కొనసాగించిన తేదీకి ఇవాళ ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో ఆ పోరా ట అమరుల త్యాగాల సాక్షిగా వామపక్షాలు సంజాయిషీ ఇచ్చు కోవలసి ఉంటుంది.
ఇంకా విచిత్రంగా ప్రత్యేక తెలంగాణ వాదులలో కొందరు కూడా హైదరాబాద్ విమోచన దినాన్ని గుర్తిస్తున్నారు. నిజానికి 1948 సెప్టెంబర్ 17ను అందరికన్న ఎక్కువగా వ్యతిరేకించవలసిన వారు ప్రత్యేక తెలంగాణ వాదులు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని రద్దు చేయడం ప్రారంభమైన చీకటి రోజు అది. హైద రాబాద్ రాజ్యం, అందులో భాగంగా తెలంగాణ చిత్రపటం చెరిగిపోయి, ఇవాళ తెలంగాణ వాదులు చెపుతున్న ‘ఆంధ్ర వలస పాలకుల పాలన’కు నాంది పలికిన రోజు అది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో 1956 నవంబర్ ఒకటిన స్థిరపడిన ప్రక్రియకు తొలి అడుగు పడినది 1948 సెప్టెంబర్ 17ననే.
చారిత్రక వాస్తవాలతోగానీ, జరిగిన చరిత్రతోగాని, సమకాలీన ఆధారాలతో కానీ, తదనంతర పరిణామాలను బట్టిగానీ ఎంత మాత్రం అంగీకరించలేని ‘విమోచన దినాన్ని’ జరపడానికి సంఘపరివారాని కి ఒక నిర్దిష్ట - సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చే ప్రయోజనం ఉంది. కానీ చరిత్ర తెలిసిన వారు, తెలియని వారు, ఆ చరిత్రలో భాగమయిన వారు, ఆ చరిత్ర వల్ల ధ్వంసమయిన వారు అందరికందరూ ఆ సంబరాలకు పరుగెత్తి పోవడ మేనా? అవి ఎవరి సంబరాలో మనం పాల్గొనవచ్చునో లేదో కనీస ఆలోచన ఉండనక్కర లేదా? (ఆంధ్రజ్యోతి17.9.2008)
హైదరాబాదుపై పోలీసు చర్య గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. హైదరాబాదుపై పోలీసు చర్య పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.