Jump to content

చర్చ:హ్యేరీ పోటర్ (ఫిల్మ్ సిరీస్)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నాణ్యత లేని అనువాద వ్యాసం

[మార్చు]

@SarayuGujja2004: గారూ, ఈ వ్యాసం అనువాద ఉపకరణాలు ఉపయోగించి రాసినట్లుంది కాబట్టి చాలా చోట్ల వాక్య నిర్మాణాలు కృతకంగా ఉన్నాయి. ఉదాహరణకు.

  • ఈ ధారావాహికను వార్నర్ బ్రదర్స్ పంపిణీ చేసింది మరియు హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ (2001) తో ప్రారంభమై ఎనిమిది ఫాంటసీ చిత్రాలను కలిగి ఉంది మరియు హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ - పార్ట్ 2 (2011) తో ముగుస్తుంది. - దీన్ని అర్థవంతమైన వాక్యాలుగా విడగొట్టాలి.
  • ఈ సిరీస్‌లో ఏడవ మరియు ఆఖరి నవల అయిన హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ రెండు ఫీచర్-పొడవు భాగాలుగా మార్చబడింది. - ఫీచర్-పొడవు భాగాలు అంటే ఏమిటి? ఈ పదానికి సరైన అర్థం తట్టలేనపుడు పూర్తిగా ఇంగ్లీషు పదం వాడితే బాగుంటుంది కానీ ఇలాంటివి చదివేవారికి అర్థం కావు.
  • "నేను (వీటో-ఎడ్ 'కలిగి ఉంటానని (లేదా) అనుకుంటాను ఎవరికైనా [స్పీల్‌బర్గ్] వారి త్వరిత- కోట్స్ క్విల్ సర్వీస్డ్. " - ఈ వాక్యం ఎవరికైనా అర్థం అయితే చెప్పండి.

వ్యాసం నిండా ఇలాంటి వాక్యాలు బోలెడు. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాసం మొత్తం తిరగ రాయాల్సి వస్తుంది. దీనికి ఎవరైనా బాధ్యత తీసుకోవాలి. లేకపోతే గూగుల్ అనువాద వ్యాసాలు తొలగించినట్లే దీన్ని కూడా తొలగించాలి. - రవిచంద్ర (చర్చ) 15:19, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]