Jump to content

చర్మశిలీంద్రాలు

వికీపీడియా నుండి

చర్మశిలీంద్రాలు (ఆంగ్లం Dermatophytes) చర్మానికి వ్యాధుల్ని సంక్రమింపజేసే శిలీంద్రాలు (Fungi).[1] వీనిలో అసంపూర్ణ శిలీంద్రాలు (Imperfect fungi) అయిన ఎపిడెర్మోఫైటాన్ (Epidermophyton), మైక్రోస్పోరమ్ (Microsporum), ట్రైకోఫైటాన్ (Trichophyton) ప్రజాతులు ఉన్నవి. చర్మశిలీంధ్రాలకు Dermatophytes పేరు గ్రీకు భాషలోని చర్మపు మొక్కలు అనే అర్ధంతో ఏర్పడింది. ఈ మూడు రకాల శిలీంధ్రాలు చాలా సాధారణమైన మనుషులలోను, జంతువులలోను చర్మవ్యాధుల్ని కలుగజేస్తాయి. వీనిలో సుమారు 40 జాతులున్నాయి.

చర్మశిలీంద్రాలు చర్మం, వెండ్రుకలు, గోర్లకు వ్యాధుల్ని కలుగజేస్తాయి. ఈ వ్యాధుల్ని శిలీంధ్ర చర్మవ్యాధులు (Dermatophytosis) అంటారు. వీటిలోని కెరటిన్ (keratin) నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి. అతిథేయి (Host) యొక్క ప్రతిచర్య మూలంగా ఇన్ఫ్లమేషన్ మొదలౌతుంది. అయితే ఇవి కణజాలాలకు నష్టం కలిగించవు; ఎందుకంటే ఇవి ఆరోగ్యవంతుడైన వ్యక్తి చర్మాన్ని ఛేదించలేవు.

ఈ చర్మవ్యాధులలో కొన్ని ముఖ్యమైనవి తామర (Ringworm) or టీనియా (Tinea). కాలు లేదా చేతి గోరుకు కలిగే వ్యాధిని శిలీంధ్ర గోరువ్యాధులు (Onychomycosis) అంటారు.

మూలాలు

[మార్చు]