Jump to content

చల్లావారిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E / 16.318492; 80.440149
వికీపీడియా నుండి
చల్లావారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
చల్లావారిపాలెం is located in Andhra Pradesh
చల్లావారిపాలెం
చల్లావారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E / 16.318492; 80.440149
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం గుంటూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ ఉగ్గం వెంకటేశ్వరరావు
పిన్ కోడ్ 522005
ఎస్.టి.డి కోడ్

చల్లావారిపాలెం గుంటూరు జిల్లా, గుంటూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఉగ్గం వెంకటేశ్వరరావు సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా కర్పూరపు వీరాంజనేయులు ఎన్నికైనాడు. 2016, మే-5న, ఉపసర్పంచిగా షేక్ మైమూన్ ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ వరసిద్ధి వినాయక, అంకమ్మ తల్లి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామివారల ఆలయం

[మార్చు]

చల్లావారిపాలెం సీతమ్మకాలనీలో, నూతనంగా పునరుద్ధరించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2012, జూన్-13 ఉదయం, తొలుత మహాగణపతిపూజ, యంత్రస్థాపన, పూర్ణాహుతి, శాంతికళ్యాణం తదితరపూజలు నిర్వహించారు. అనంతరం, ఉదయం 8-39 కి, చెక్కతో ప్రత్యేకంగా చేయించిన శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామివారల విగ్రహాలతోపాటు, ఇతర దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. పిమ్మట భక్తులకు మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ విగ్రహాల దాత శ్రీ మన్నెడి శ్రీనివాసరావు. [4]

శ్రీ ఘంటలమ్మ, పుట్టలమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలను నాలుగు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. మొదటి రోజున అమ్మవారిని బంగారు చీరతో, మేళతాళాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించెదరు. రెండవ రోజున కుంకుమార్చన, వెండి రథంపై గ్రామోత్సవం నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధానమైన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్ల్తులు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.