చాంద్ బర్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాంద్ బర్కే
జననంఫిబ్రవరి 2, 1932
మరణం2008 డిసెంబరు 28(2008-12-28) (వయసు 76)
జాతీయతభారతీయులు
ఇతర పేర్లుచాంద్ బర్క్
వృత్తినటి
గుర్తించదగిన సేవలు
బూట్ పోలిష్ (1954)
జీవిత భాగస్వామి
నిరంజన్
(div. 1954)

సుందర్ సింగ్ భవ్నానీ
(m. 1955)
పిల్లలు2
బంధువులుశామ్యూల్ మార్టిన్ బర్కే (సోదరుడు)
రణ్‌వీర్ సింగ్ (మనవడు)

చాంద్ బర్కే (1932 ఫిబ్రవరి 2 - 2008 డిసెంబరు 28) హిందీ, పంజాబీ భాషా చిత్రాలలో నటించిన భారతీయ నటీమణి. ఈమె బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కి నాయనమ్మ.

ప్రముఖ నటుడు రాజ్ కపూర్ బాలీవుడ్‌ చిత్రం బూట్ పోలిష్ (1954) లో ఆమె కీలక పాత్ర పోషించింది.[1][2]

కెరీర్

[మార్చు]

చాంద్ బర్కే మహేశ్వరి ప్రొడక్షన్స్ కహన్ గయే (1946)లో ఆమె అరంగేట్రం చేసింది. లాహోర్‌లో నిర్మించిన అనేక చిత్రాలలో ఆమె నటించింది. అంతేకాకుండా పంజాబ్‌ డ్యాన్సింగ్ లిల్లీ అని విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశ విభజన సమయంలో ఆమె ముంబైకి వలస వెళ్ళడానికి దారితీసింది, తద్వారా ఆమె కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) పన్నెండు మంది సోదరులు, సోదరీమణులతో కూడిన క్రైస్తవ కుటుంబంలో ఆమె జన్మించింది. ఆమె సోదరుడు శామ్యూల్ మార్టిన్ బర్క్, ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి, తరువాత పాకిస్తాన్ స్కాండినేవియన్ దేశాలకు దౌత్యవేత్తగా మారారు.[3] 1954లో ఆమె సినీ రచయిత, దర్శకుడు నిరంజన్‌ ను వివాహం చేసుకుంది. వీరు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తిరిగి 1955లో వ్యాపారవేత్త సుందర్ సింగ్ భవ్నానీని వివాహం చేసుకుంది. ఆమెకు తోన్యా అనే కుమార్తె, జగ్జిత్ అనే కుమారుడు ఉన్నారు. జగ్జిత్ కుమారుడే బాలీవుడ్ చలనచిత్ర నటుడు రణవీర్ సింగ్.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film
1969 పరదేశన్
1968 కహిన్ దిన్ కహిన్ రాత్
1967 మేరా భాయ్ మేరా దుష్మన్
1965 మొహబ్బత్ ఇస్కో కహేతే హై
1964 అప్నే హుయే పరాయే
1960 ఘర్ కీ లాజ్
1960 రంగీలా రాజా
1960 శ్రవణ్ కుమార్
1959 పరదేశి ధోలా
1958 అదాలత్
1958 లజ్వంతి
1958 సోహ్ని మహివాల్
1957 దుష్మన్
1956 బసంత్ బహార్
1955 రాఫ్తార్
1955 షాహి చోర్
1954 'ఫెర్రీ'
1954 అమర్ కీర్తన్
1954 గుల్ బహార్
1954 బూట్ పోలిష్
1954 వంజర
1953 ఆగ్ కా దరియా
1953 కౌడే షా
1951 సబ్జ్ బాగ్
1951 పోస్టి
1948 దుఖియారి
1946 కహన్ గయే

మూలాలు

[మార్చు]
  1. "Did you know that Ranveer Singh's grandmother Chand Burke was a popular Bollywood actress?". The Times of India. Bennett, Coleman & Co. Ltd. Retrieved 1 August 2020.
  2. "Did you know Ranveer Singh's grandmother Chand Burke was an actress". Filmfare. Retrieved 1 August 2020.
  3. "Chand Burke". Cineplot.com. Retrieved 1 August 2020.