చాప
Jump to navigation
Jump to search
చాప ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని వెదురుతో గాని, కొబ్బరిపీచుతో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు. ఈతచాపలు ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ. సిరిచాప సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని సిరిచాపలు అంటారు. సామాన్యంగ ఇవి ప్రస్తుతం అందరి ఇళ్లలోను వుంటాయి. జమ్ము చాపలు వీటి జమ్ము అనబడే ఒక విధమైన గడ్డితో రైతులు స్థానికంగా తయారు చేసుకుంటారు. ఇవి చాల మెత్తగా వుంటాయి. ప్రస్టి చాపలు ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి.