Jump to content

చారి ఫార్ములా (గ్రామాల వీధి దీపాలు)

వికీపీడియా నుండి

గ్రామాల విద్యుద్దీపాలకు సాధారణంగా ట్యూబ్ లైట్లు ఉపయోగిస్తారు. అవి కొన్నాళ్ళకు పాడైపోతాయి. అప్పుడు వాటిని పారవేస్తాం. దాని మూలంగా పర్యావరణం కలుషితమవుతుంది. పాడైపోయిన ట్యూబ్ లైట్లను తిరిగి వెలిగించడానికి అనేక పరిశోధనలు చేసి నిజామాబాదు జిల్లా, నవీపేట్ గ్రామానికి చెందిన శాస్త్రవేత్త మండోజి నర్సింహాచారి ఒక విశిష్ట ఆవిష్కరణను చేసి ప్రసిద్ధులైనారు. ఆయన కనుగొన్న "చారీ ఫార్ములా" ద్వారా ఆగిపోయిన ట్యూబ్ లైట్లను వెలిగించడమే కాకుండా, పర్యావరణ వ్యర్థాలను అరికట్టవచ్చు. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు అనేక అవార్డులు వచ్చాయి.[1][2]

వీథి దీపాలు

[మార్చు]

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని వీధులలో దీప స్తంబాలకు (స్ట్రీట్ లైట్స్ పోల్స్ కు) ట్యూబ్ లైట్ డోమ్ అమరిక కలిగి ఉంటాయి. ఈ డోమ్ ల యందు 6 విభాగాలతో పరికరాలు ఉంటాయి.

  1. ఛోక్
  2. స్టార్టర్
  3. స్టార్టర్ హోల్డర్
  4. డోమ్ లో ట్యూబ్ లైట్ జారి పడిపోకుండా అమరి ఉండటానికి, ట్యూబ్ లైట్ లో గల పిన్నులకు కనెక్షన్లు కలపడానికి, 2 హోల్డర్లు
  5. క్రొత్త ట్యూబ్ లైట్‌ బల్బు
  6. వీటన్నింటికి కనెక్షన్లు ఇవ్వడానికి రాగి తీగలు

ఈ విధంగా ట్యూబ్ లైట్ వెలగటానికి 6 విభాగాల పరికరాలతో డోమ్ ఉంటుంది. ఇందులో ఈ ట్యూబ్ లైట్ వెలగటానికి కచ్చితంగా 10 కనెక్షన్లు అవసరము పడతాయి, అవి ఛోక్ కు 2 కనెక్షన్లు, స్టార్టర్ కు 2 కనెక్షన్లు, ట్యూబ్ లైట్ కు రెండు చివరల రెండేసి పిన్నుల చొప్పున 4 పిన్నులకు గాను 4 కనెక్షన్లు, పవర్ కొరకు 2 కనెక్షన్లు - ఇలా మొత్తం 10 కనెక్షన్లు కచ్చితంగా అవసరం పడతాయి, ఇందులో ఏ ఒక్క కనెక్షన్ ఉడిపొయినా, డోమ్ లోపలి బాగంలోనికి ఎలుకలు దూరి కనెక్షన్ వైర్లను కొరికి వేసినా, డోమ్ ఆరుబయట ప్రదేశంలో ఉండడం వలన వర్షపు నీరు అందులోనికి చేరినా దీపం వెలగదు. ఛోక్‌లు, స్టార్టర్‌లు, ట్యూబ్‌లు త్వర త్వరగా ఫెయిల్ అవ్వడం వలన వరుసగా ట్యూబ్ లైట్, ఛొక్‌, స్టార్టర్ - ఈ మూడు ఫెయిల్ అయిపోతాయి. అంతే కాకుండా పక్షులు డోమ్ ల పై వాలి పాడుచెయ్యడం వల్ల - ఇలా అనేక కారణాల వలన - ట్యూబ్ లైట్ వెలుగదు. దీనిని మరమ్మత్తు చెయ్యడానికి ఎలక్‌ట్రీషియను స్తంభం పై వరకు ఎక్కి ఆ ట్యూబ్ లైట్ డోమ్ ను తన భుజముపైన పెట్టుకొని క్రింది వరకు తీసుకచ్చి, దానిని సరి చేసి, మళ్లా తన భుజముపైన పెట్టుకొని స్తంభం పై వరకు ఎక్కి ఆ ట్యూబ్ లైట్ డోమ్ ను అమరుస్తాడు. ఇలా చేయడానికి ఆ ఎలాక్ట్రిషను చాల శ్రమ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ట్యూబ్ లైట్ డోమ్ బరువుగా ఉంటుంది. అంతేకాకుండా ఆ డోమ్ లో ఉన్న ఛోక్ కూడా సుమారుగా 600 గ్రాములుగా ఉండి, అది కూడా బరువుకు మరో బరువు అదనంగా చేరి ఎలక్‌ట్రీషియనుకు అదనంగా బరువుతో పాటు అధిక పని భారము అవుతుంది. ఇటువంటి సమస్యలు తరుచుగా, నెలకు 2 నుండి 3 సార్లు, జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రైవేట్ ఎలక్‌ట్రీషియన్‌లు అయితే ఒక్క దీపాన్ని బాగు చేయడానికి 40/- రూపాయల నుండి 50/- రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇటువంటి తరుచుగా వచ్చే సమస్యల వల్ల ఆ గ్రామ పంచాయితీకి, మున్సిపాలిటికి ఖర్చు భారము కూడా అధికంగా పెరుగుతుంది. చాల గ్రామా పంచాయితీ లలో అయితే వారికున్న బడ్జెట్ కు ఈ అధిక ఖర్చు భారము భరించ లేక ఎర్ర బల్బులకు మారి పోయారు. ఈ ఎర్ర బల్బులు మాత్రం విద్యుత్తు చాలా తీసుకుంటాయి. అంతేకాకుండా ట్యూబ్ లైట్ ఇచ్చినంత తెల్లటి వెలుతురును ఈ ఎర్ర బల్బు అసలు ఇవ్వదు.

పాడైపోయిన ట్యూబ్ లైట్లు-పర్యావణ కాలుష్యం

[మార్చు]

ఇంతేకాకుండా ఈ గొట్టపు దీపాలు పని చెయ్యడం మానేసిన తరువాత, ఆ పాత గొట్టం లోపలి భాగంలో విష పూరితమైన ప్లోరోసెంట్ పూత, పాదరసం మిగిలి వుంటాయి. ఇలా పాడయిన ప్రతి దీపపు గొట్టంలో సుమారుగా 3 మిల్లి గ్రాముల నుండి 4.6 మిల్లి గ్రాముల వరకు పాదరసం వుంటుంది. అందుకని వీటి మీద ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన కొన్ని నిబంధనలను ప్రవేశ పెట్టారు. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయ: గ్రామంలో మనుషులు, జంతువులు నివసించే ప్రదేశం నుండి దూరంగా - 10 కిలో మీటర్ల దూరంలోని ప్రదేశంలో - ఒక బుల్డోజర్ తో 10 సార్లు తవ్వితే ఎంతైతే లోతూ గొయ్యి ఏర్పడుతుందో అంత లోతు గొయ్యిలో ఈ ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్స్, సి. ఎఫ్ . ఎల్ లాంటి మెర్క్యూరీతో మిగిలి ఉన్న లైట్స్ అన్నియు పాతి పెట్టి మట్టితో పూడ్చి వెయ్యాలి. అయితే అప్పుడు దాని నుండి వెలుబడే పాదరసం బయటికి రాకుండా వుంటుంది.

కాని ప్రస్తుతం ఈ ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్స్ లను గ్రామాల్లో అయితే అక్కడి గ్రామా పంచాయితీ సిబ్బంది, అక్కడి ప్రజలు గాని ఈ నిబందనలు తెలియక..... చెరువుల్లో గాని కాలువల్లో గాని బావి లలో గాని వూరికి చివర్లో గాని నెల పైననే పార వేస్తున్నారు అవి అక్కడ పగిలిపోయి అక్కడి నేలను గాని, నీరును గాని, గాలిని గాని, వాతావరణాన్ని గాని ఏవిదంగా భయంకరమైన వ్యాదులకు దారి తీస్తుందో, మన కంటిని మనమే పొడుచుకునే విదంగా ఈ నగ్న సత్యాన్ని ఈ క్రింది వివరణ ద్వారా తెలుసుకోండి........

వ్యర్థాల వల్ల మానవాళికి నష్టాలు

[మార్చు]

ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్ పగిలి పోవడం వల్ల దానిలో మిగిలిన మెర్క్యూరీ, ప్లోరోసెంట్ ద్వారా మానవులకు, జంతువులకు వ్యాపించేవ్యాధులు, వాటి వల్ల కలిగే నష్టాలు

  1. బ్రెయిన్ ట్యూమర్, ఆర్గానిక్ ట్యూమర్లు వస్తాయి.
  2. కార్నియా దెబ్బ తినడం.
  3. ట్రిమ్మర్ అనె వ్యాధి సోకి కను బొమ్మలు, పెదవులు, నాలుక, చర్మానికి ఈ వ్యాధి సొకుతుంది. చర్మం స్పర్శ గుణాన్నికోల్పోతుంది.
  4. నాలుక, కను బొమ్మలు మండుట.
  5. మెర్క్యూరీ వాయువును పీల్చడం వలన ఊపిరి తిత్తుల్లో అధిక నీరు చేరి తద్వారా ఉపిరితిత్తులు పని చేయడం ఆపి వేసి మనిషి మరణిస్తాడు.
  6. కార్నియా వలన బ్యాండ్ కెరొటొపత్తి జరిగి రోగం వస్తుంది.
  7. షార్ట్ టర్మ్ మోమరి లాస్ వ్యాధి వలన సెకనులలో జ్ఞాపక శక్తిని మరచి పోవడం ప్రతి విషయము జ్ఞాపకము ఉండక పోవడం.
  8. రాత్రిలయందు నిద్ర రాక పోవడం.
  9. రక్త పోటు పెరిగి మనిషి మరణించడం.
  10. నరాల వ్యవస్థను దెబ్బ తీయడం.
  11. కిడ్నీలు దెబ్బతిని స్పర్శ తెలియక పోవడం.
  12. కడుపులో తిప్పు, డయేరియా, ఛాతీ నొప్పి రావడం.
  13. దగ్గులో రక్తం పడడం.
  14. ఉపిరితిత్తుల వ్యవస్థ దెబ్బతినడం.
  15. మెటల్ ప్యుమ్ జ్యరము రావడం
  16. మెర్క్యూరీ, క్లోరైడ్ తో కలిసిన వాయువును పిలిస్తే బ్రెయిన్ ట్యూ మర్లు, శరీరం పైన ట్యూమర్లు (గడ్డలు) గా ఏర్పడి ఇవి కేన్సర్ గామారి మనిషి మరణిస్తాడు.
  17. ఒక ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్ పగిలిపొయినప్పుడు దాని నుండి వెలుబడే మెర్క్యూరీ 5 మిల్లి గ్రాముల నుండి 6 మిల్లి గ్రాముల వరకు ఉంటుంది.ఈ 5 మిల్లి గ్రాముల నుండి 6 మిల్లి గ్రాముల మెర్క్యూరీ గనుక శుభ్రమైన నీటిలో కలిస్తే సుమారుగా 22,685 లీటర్ల శుభ్రమైన నీరు అపరిశుభ్రమైన నీరుగా మారుతుంది. ఈ అపరిశుభ్రమైన నీరును త్రాగితే అనేక రోగాలు వస్తాయి.
  • ఈ 5 మిల్లి గ్రాముల నుండి 6 మిల్లి గ్రాముల మెర్క్యూరీ భూమిలో కలిస్తే సుమారుగా 5 ఎకరాల విస్తీర్ణం గల భూమి, అపరిశుభ్రమైన భూమిగా మారి ఆ అపరిశుభ్రమైన భూమిలో ఎ పంటను పండించిన అపరిశుభ్రమైన పంట పండుతుంది. ఆ ఆహారాన్ని తిన్నవారు అనేకమైన రోగాల బారిన పడతారు.
  • ఈ 5 మిల్లి గ్రాముల నుండి 6 మిల్లి గ్రాముల మెర్క్యూరీ అక్కడి వాతావరణం (గాలి) లో గనక కలిస్తే శుభ్రమైన గాలి అపరిశుభ్రమైన గాలిగా మారి అక్కడివాతావరణం కలుషితమై అక్కడ జీవించిన వారు అనేకమైన రోగాల బారిన పడతారు.
  • ఈ 5 మిల్లి గ్రాముల నుండి 6 మిల్లి గ్రాముల మెర్క్యూరీ గల వాయువును ఒక కుందేలు పిలిస్తే అది కొన్ని సెకనులలోనె మరణిస్తుంది
  • ఈ మెర్క్యూరీ అనేది టాక్సిటీ అనే విభాగానికీ చెందినది, అనగా విశాపురితమైన విబాగానికి చెందినది కాబట్టి మనవవులకు ఇది ప్రమాద కరమైనది .
  • చేపలను నివసించే చెరువుల్లో గాని కాలువల్లో గాని నదుల్లో గాని సముద్రాలలో గాని ఆ నీటిలో ఈ మెర్క్యూరీ గనుక కలిస్తే ఆ చేపలు మరణిస్తాయి, అంతే కాకుండా ఆ నీటిలో జీవించే ఇతర జీవులు కూడా మరణిస్తాయి, ఆ చేపలను గనక మానవులు ఆహారంగా తీసుకుంటే ఆ మెర్క్యూరీ మన శరీరం లోనికి వెళ్లి అనేక రోగాల బారిన పడి మరణిస్తారు.

మెర్క్యూరీ ద్వారా వ్యాపించే మరి కొన్ని రోగాలు

[మార్చు]
  1. ఆందోళన,
  2. అధికంగా shyness,
  3. అనోరెక్సియా,
  4. స్లీపింగ్ సమస్యలు,
  5. ఆకలి నష్టం,
  6. చికాకు,
  7. అలసట,
  8. మతిపరుపు,
  9. భూ ప్రకంపనలకు,
  10. దృష్టిలో మార్పులు,
  11. వినికిడి మార్పులు,
  12. దగ్గు, గొంతు,
  13. శాశ్వలో,
  14. ఛాతీ నొప్పి,
  15. వికారం, వాంతులు,
  16. నీళ్ల విరేచనాలు,
  17. రక్తంలో పెరుగుదల,
  18. ఒత్తిడి లేదా హృదయ రేటు,
  19. ఒక లోహ రుచి నోరు,
  20. ఐ చికాకు,
  21. తలనొప్పి,
  22. విజన్ సమస్యలు.

మెర్క్యూరీ వాతావరణంలో గాని, నీటిలో గాని, భూమిలో గాని, కలవకుండా నియంత్రిచడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. కాని ఈ మెర్క్యూరీ వాతావరణంలో కలిసిన, నీటిలో కలిసిన, భూమిలో కలిసిన తర్వాత జరిగే భయంకర పరిణామలనుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇప్పటి వరకు ఎటువంటి జాగ్రత్తలు గాని పరికరాలు గాని లేవు. కాబట్టి ట్యూబ్ లైట్ లో గల మెర్క్యూరీని తిరిగి ఉపయోగించాలి, కాని అది ప్రస్తుతం జరగడం లేదు ఎందుకంటే ప్రస్తుతం ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్లు మళ్ళి వెలిగించే పరికరము ఎక్కడ లేదు, దాని కారణంగా ఆ పేయిల్ అయిన ట్యూబ్ లైట్ లో మిగిలిన మెర్క్యూరీ చాల ప్రమాద కారిగా మారుతుంది.

చారి ఫార్ములా

[మార్చు]
మండోజి నరసింహాచారి చిత్రము

ఈ పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మండోజి నర్సింహాచారి కనిపెట్టిన ప్రయోగx ద్వారా ప్రపంచములోనే మొట్ట మొదటి సారిగా ఆ ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్ ను మళ్ళి వెలిగించి చొక్, స్టార్టర్ అసలే లేకుండా, ముఖ్యంగా ఆ ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్ లో మిగిలిన మెర్క్యూరీని పూర్తిగా వినియోగించి కొన్ని సంవత్సరాలవరకు మళ్ళి వెలిగి తర్వాత రెండో సారి ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్ పేయిల్ అవుతుంది. అప్పుడు ఆ ట్యూబ్ లైట్ ఎక్కడ పార వేసిన అక్కడి వాతావరణాన్ని గాని, నీటిని గాని, భూమిని గాని ఏవిదంగానూ కలుషితం చేయదు. ఈ అద్భుతమైన పనితనము ప్రపంచములోనే కేవలం మండోజి నర్సింహాచారి కనిపెట్టిన "చారి పార్ముల"తో మాత్రమే సాద్య పడుతుంది. ఎందుకంటే ఇది ఆయన ద్వారా పేటెంట్ పొందిన ప్రయోగము.

ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ ను మళ్ళి వెలిగించే ప్రయోగాన్ని కనుక్కున్నారు. అంతే కాకుండా ఈ ట్యూబ్లైట్ లో వుండే రెండు పిలమెంట్స్ సైతం ఊడిపోయి ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ ను, ట్యూబ్ లైట్ కు సాధారణంగా ఉపయోగించే చౌక్ మరియుస్టార్టర్ ను కూడా పూర్తిగా తొలగించి అసలు వాటి అవసరము లేకుండానే రెండు వైపులా పిలమెంట్స్ ఊడిపోయి ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ ను సైతంమళ్ళి వెలిగించే ప్రయోగాన్ని “చారి పార్ములా”ను కనుక్కున్నారు.

రెండు వైపులా పిలమెంట్స్ ఊడిపోయి ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ ను చౌక్, స్టార్టర్ లేకుండా తిరిగి వెలిగించు ”చారిపార్ములా”ను స్ట్రీట్ లైట్స్ ట్యూబ్ లైట్ డోమ్ ల యందు అమరిస్తే భ్రహండమైన పలితాల్ని పొందడమే కాకుండా విజయ వంతంగా స్ట్రీట్ లైట్స్ ట్యూబ్ లైట్ డోమ్ ల యందు ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్స్ వెలుగుతూనే వుంటాయి ఇలా ఒక్క ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ దానిలో మిగిలివున్న మెర్క్యూరీ మరియుప్లోరోసెంట్ యొక్క పరిమాణాన్ని బట్టి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వరకు వెలిగి తర్వాత దానిలో మిగిలివున్న మెర్క్యూరీ, ప్లోరోసెంట్పూర్తిగా అయిపోయి ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ మళ్ళి రెండో సారి ఫైయిల్ అవుతుంది. ఈ రెండో సారి ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ లో మెర్క్యూరీ మరియుప్లోరోసెంట్ పూర్తిగా వినియోగించుకోవడం వలన వీటి పరిమాణము శూన్యము కాబట్టి ఈ ట్యూబ్ లైట్ వల్ల పర్యవరణామును మెర్క్యూరీ బారిన పడకుండాపూర్తిగా కాపడుకోవచ్చును, మెర్క్యూరీ విభాగంలో ప్రపంచ గ్లోబల్ వార్మింగ్ ను కాపాడడంలో ఈ ప్రయోగం ఎంతో దోహదపడుతుంది. ఈ పద్దతిప్రపంచములోనే ఎక్కడ లేదు కేవలం మన ఈ “చారి పార్ములా”లో మాత్రమె వుంది ఎందుకంటే ఇది మన ద్వార పేటెంట్ అయిన ప్రయోగము కాబట్టి.

"చారి పార్ములా"తో పర్యవరణము, ప్రపంచ గ్లోబల్ వార్మింగ్ ను కాపాడే విషయం నుండి స్ట్రీట్ లైట్స్ విషయానికి వస్తే.........రెండు వైపులా పిలమెంట్స్ ఊడిపోయి ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ ను చౌక్, స్టార్టర్ లేకుండా తిరిగి వెలిగించు ”చారి పార్ములా”ను స్ట్రీట్ లైట్స్ట్యూబ్ లైట్ డోమ్ ల యందు అమరిస్తే భ్రహండమైన పలితాల్ని పొందడమే కాకుండా విజయ వంతంగా స్ట్రీట్ లైట్స్ ట్యూబ్ లైట్ డోమ్ ల యందు ఫైయిల్అయిన ట్యూబ్ లైట్స్ వెలుగుతూనే వుంటాయి ఇలా ఒక్క ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ దానిలో మిగిలివున్న మెర్క్యూరీ, ప్లోరోసెంట్ యొక్క పరిమాణాన్ని బట్టి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వరకు వెలిగుతాయి.

మరో ముఖ్యమైన విషయము ఏమిటంటే గ్రామా పంచాయితి స్ట్రీట్ లైట్స్ విభాగంలో పని చేసే ఎలేక్ట్రిషన్ కు గాని, మున్సిపాలిటి స్ట్రీట్ లైట్స్విభాగంలో పని చేసే ఎలేక్ట్రిషన్ కు గాని ఈ ”చారి పార్ములా” ప్రయోగము వారి వారి స్ట్రీట్ లైట్స్ ట్యూబ్ లైట్ డోమ్ ల యందు ఉపయోగించడం వల్ల అధిక పనిభారముతో పాటు అధిక శ్రమ భారము తగ్గింది.

ఈ ఆవిష్కరణపై అభిప్రాయాలు

[మార్చు]

చారి ఫార్ములాను ఉపయోగించిన వివిధ వ్యక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసారు.

  1. ట్యూబ్ లైట్ వెలగటానికి కచ్చితంగా 10 కనెక్షన్లు అవసరము పడతాయి, అవి చౌక్ కు 2 కనెక్షన్లు, స్టార్టర్ కు 2 కనెక్షన్లు, క్రొత్త ట్యూబ్ లైట్ కు రెండు చివరల రెండేసి పిన్నుల చొప్పున 4 పిన్నులకు గాను 4 కనెక్షన్లు, ఫవర్ కనెక్షన్ కొరకు 2 కనెక్షన్లు ఇలామొత్తానికి కలిపి 10 కనెక్షన్లు కచ్చితంగా అవసరం పడతాయి, ఎందులో ఎ ఒక్క కనెక్షన్ ఉడిపొయిన, చౌక్ లు స్టార్టర్ లు ట్యూబ్ లైట్ లు త్వరత్వరగా పెయిల్ అవ్వడం వలన, డోమ్ లోపలి బాగంలోనికి ఎలుకలు దూరి కనేక్సన్ వైర్లను కొరికి వేయడం వలన, డోమ్ స్ట్రీట్ పోల్ ఓపెన్ప్లేస్ లో (ఆరుబయట ప్రదేశం) లో వుండడం వలన వార్ష కాలం వర్షపు నీరు అందులోని చోకేలోనికి చేరి చౌక్ డైరెక్ట్ అయ్యి ఒకే సారి వరుసగా ట్యూబ్ లైట్, చౌక్, స్టార్టర్ ఈ మూడు ఫెయిల్ అయిపోతాయి. దీని వలన, కాకులు, పక్షులు డోమ్ ల పై వాలి డిస్ట్రబ్ చేయడం వలన ఇలా అనేక కారణాల వలన ట్యూబ్ లైట్ వెలుగదు. దీని కారణంగా ఎలాక్ట్రిషను స్ట్రీట్ లైట్స్ పోల్ పై వరకు ఎక్కి ఆ ట్యూబ్ లైట్ డోమ్ ను ఎలాక్ట్రిషను తన భుజముపైన పెట్టుకొని క్రిందివరకు తీసుకచ్చి దానిని సరి చేసి మళ్ళి తన భుజముపైన పెట్టుకొని స్ట్రీట్ లైట్స్ పోల్ పై వరకు ఎక్కి ఆ ట్యూబ్ లైట్ డోమ్ ను అమరుస్తాడు ఇలాచేయడానికి ఆ ఎలాక్ట్రిషను (మాకు) కు చాల శ్రమ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ట్యూబ్ లైట్ డోమ్ బరువుగా వుంటుంది అంతేకాకుండా ఆ డోమ్ లోవున్న చౌక్ కూడా సుమారుగా 400 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు వుండి అది కూడా బరువుకు మరో బరువు అదనంగా చేరి ఎలాక్ట్రిషనుకు అదనంగా బరువుతో పాటు అధిక పని భారము అవుతుంది. ఇటువంటి సమస్యలు తరుచుగా నెలకు 2 నుండి 3 సార్లు జరుగుతూనే ఉంటుంది. దీని వల్లఅధిక ఖర్చు భారాము భరించ లేక గ్రామా పంచాయితీ, ఎర్ర బలుపులకు మారి పోయారు. ఈ ఎర్ర బలుపులకు మాత్రం విద్యుత్తూ చాల తీసుకుంటుంది.అంతేకాకుండా ట్యూబ్ లైట్ ఇచ్చినంత తెల్లటి వెలుతురును ఈ ఎర్ర బలుపు అస్సలు ఇవ్వదు.
  2. కాని చాఅరి పార్ముల రెండు వైపులా పిలమెంట్స్ ఊడిపోయి ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ ను చౌక్, స్టార్టర్ లేకుండా తిరిగివెలిగించు ”చారి పార్ములా”ను మా స్ట్రీట్ లైట్స్ ట్యూబ్ లైట్ డోమ్ ల యందు ఉపయోగించాక పైన తెలిపిన సమస్యలన్నింటిని మాటుమాయమ్ చేసేసింది.అసలు ఈ “చారి పార్ములా”ప్రయోగంలో కేవలం 4 కనెక్షన్లు మాత్రమే ఉపయోగించి పూర్తీ చేయడమైనది. కాని సాధారణంగా మేము ఉపయోగించే చౌక్, స్టార్టర్, క్రొత్త ట్యూబ్ లైట్ సెట్ లో మాత్రం 10 కనెక్షన్లు ఉండేటివి, మీ ద్వారా 6 కనెక్షన్లు తొలిగించడమే కాకుండా మాకు అధిక సమస్యలను తెచ్చి పెట్టె చౌక్, స్టార్టర్ ను పూర్తిగా తోలిగించేశారు. అతి పెద్ద సమస్య ఏమిటంటే ట్యూబ్ లైట్ సెట్ వేలుగాక పొతే అందులో స్టార్టర్ ఫైయిల్ అయ్యిందా, చౌక్ ఫైయిల్అయ్యిందా, ట్యూబ్ లైట్ ఫైయిల్ అయ్యిందా, లేదా ట్యూబ్ లైట్ 4 పిన్నుల కనెక్షన్ లలో ఏదైనా ఒక కనెక్షన్ ఉడిపోయ్యిందా, చౌక్కున్న 2 కనెక్షన్ లలోఏదైనా ఒక కనెక్షన్ ఉడిపోయ్యిందా, స్టార్టర్కున్న 2 కనెక్షన్ లలో ఏదైనా ఒక కనెక్షన్ ఉడిపోయ్యిందా, ఇలా అనేక సమస్యలు మాకుండెటివి. కాని మీప్రయోగం వల్ల ఈలాంటి ఎలాంటి సమస్యలు లేకుండా అంతేకాకుండా రెండు వైపులా పిలమెంట్స్ ఊడిపోయి ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ ను సైతంవెలిగించి, ట్యూబ్ లైట్ లో రెండు వైపులా రెండేసి పిన్నుల కనెక్షన్లు చొప్పున వుండే 4 పిన్నులకు ఇచ్చే 4 కనెక్షన్లుకు గాను మీ ప్రయోగం ద్వారా ట్యూబ్ లైట్లో రెండు వైపులా రెండేసి పిన్నుల కనెక్షన్లు బదులుగా అటు వైపు ఒక్క పిన్నుకనెక్షన్ వాడి, ఇటు వైపు ఒక్క పిన్నుకనెక్షన్ వాడి ఇలా కేలం 2 పిన్నులకుకనెక్షన్లు మాత్రమే ఉపయోగిచారు. సాధారణంగా మేము ఉపయోగించే ట్యూబ్ లైట్ లోవున్న 4 పిన్నులలోకనెక్షన్ల లలో ఎ ఒక్కటి కనెక్షన్ లేకున్న ట్యూబ్లైట్ వెలుగదు. అలాంటిది మీరు 2 పిన్నులకు కనెక్షన్లు మాత్రమే ఉపయోగించి రెండు వైపులా పిలమెంట్స్ ఊడిపోయి ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్ ను సైతంవెలిగించి, మాకు ఎంతో బాదగా చెప్పుకునే పని భారాన్ని తగ్గించడమే కాకుండా చాల సమయాన్ని ఆధా చేసి ఆ సమయాన్ని ఇతర అభివృద్ధి పనులకుకేటాయిస్తున్నాము . ఇది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ ప్రయోగంతో మేము ట్యూబ్ లైట్స్ వెలిగించాలంటే ఎలక్ట్రికల్ షాప్స్ కు వెళ్ళట్లేదు..... మాఆఫీసులో చెత్త కుప్పగా పార వేసిన ఫైయిల్ అయిన ట్యూబ్ లైట్స్ దగ్గరికి వెళ్తున్నాము.
  3. గ్రామ పంచాయితి, మున్సిపాలిటి స్ట్రీట్ లైట్స్ (వీధి స్తంభాలు) లకు.... రెండు వైపులా పిలమెంట్స్ ఊడిపోయి ఫైయిల్ అయిన ట్యూబ్లైట్ ను చౌక్, స్టార్టర్ లేకుండా తిరిగి వెలిగించు ”చారి పార్ములా”ను స్ట్రీట్ లైట్స్ ట్యూబ్ లైట్ డోమ్ ల యందు ఉపయోగించడం వలన ఆ గ్రామపంచాయితిలకు , మున్సిపాలిటిలకు ఎన్నో డబ్బులు మిగిలించవచ్చు, ఎందుకంటే చౌక్ లు గాని, స్టార్టర్ లు గాని, క్రొత్త ట్యూబ్ లైట్స్ గాని కొనడము వుండదు, కాబట్టి డబ్బులు ఆదా చేయ వచ్చును. ఈ ఆదా చేసిన డబ్బులను వేరే ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగిస్తూ, ఆ సంస్తలనుఅభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ల వచ్చును. ఈ "చారి'స్ పార్ములా ఐక్య రెడ్"ను సంవత్సరము పాటు గ్రామ పంచాయితి గాని, మున్సిపాలిటి గానిఅవలంబిస్తే సంవత్సరానికి వారికయ్యే ఖర్చులో 40% వరకు ఆదా చేయవచ్చును. (అనగా ఒక గ్రామం లోని గ్రామ పంచాయితీకి వారి స్ట్రీట్ లైట్స్ సంవత్సరము పాటు విజయ వంతంగా వెలగటానికి ఈ రోజుల్లో వున్నా సాదారణ పద్ధతి ద్వార అమలు చేస్తే రూపాయలు పది లక్షలు (రూ.10,00,000) ఖర్చు అయితే, ఈ మన "చారి'స్ పార్ములా " ద్వారా రూపాయలుఆరు లక్షలు (రూ.6,00,000) ఖర్చు అవుతుంది. ఈ ప్రయోగమును మన ప్రయోగముద్వారా చాల గ్రామాల్లో ప్రాక్టికల్ గా చేసి నిర్దారణ చేయబడింది.

చారీ ఫార్ములా - ప్రయోగాత్మక అమలు

[మార్చు]

ఒక గ్రామంలోని గ్రామ పంచాయితీకి ఈ "చారి'స్ పార్ములా " ద్వారా ముగ్గురేసి నిరుద్యోగ యువకులకు సంవత్సరం పాటు జీతాన్ని ఇచ్చి ఉపాదిని కల్పించింది. కొన్ని నోటిపైడ్ గ్రామా పంచాయితీల్లోనైతే ఈ ప్రయోగాన్ని సంవత్సరము పాటు విజయ వంతంగా అమలు చేయడమైనది. ఇలా 500 స్ట్రీట్లైట్స్ ట్యూబ్ లైట్ డోమ్ లు వున్నా గ్రామా పంచాయితీలో వారి మాటల్లోనే వారికి సంవత్సరానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది కానీ వారు ఈ చారి ఫార్ములాను సంవత్సరానికి మూడు లక్షలు రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అనగా రెండు లక్షల రూపాయల ఆదా.

ఆ గ్రామ పంచాయితీ వారి ఈ విషయాల్ని అంగికరించి, అప్పుడు ఆ గ్రామ అభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో ఆ జిల్లాకు చెందిన, ఆర్.టి.పి., ఎన్.ఐ.ఆర్.డి; (భారతప్రభుత్వం, హైదరాబాదు, కో-ఆర్డినేటర్ ఆ గ్రామా సర్పంచ్ వీరందరి సమక్షములో ఒప్పందాలను చేసుకొని వారందరి సమక్షములో ఒప్పంద పత్రాన్నివ్రాసుకొని, గ్రామంలో ప్రారంభించారు. అప్పుడు ఆ గ్రామంలోనే నివసించే ఇద్దరు నిరుద్యోగ యువకులకు సంవత్సరము పాటు ఒక్కొక్కరికి నెలకు జీతంగా మూడు వేల (రూ.3,000/-) చొప్పున ఇద్దరికేసి నెలకు జీతాలకు ఆరు వేలు (రు.6,000/-) ఇలా సంవత్సారానికి జీతాలకు రూపాయలు డెబ్బై రెండు వేలు (రూ.72,000/-) ఖర్చు అవుతాయి, మిగిలిన రూపాయలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు (రూ.2,28,000/-) ల నుండి ఆ గ్రామంలోని 500 స్ట్రీట్ లైట్స్ ట్యూబ్ లైట్స్ కు రూపాయలు ఒక్క లక్ష అరువై ఎనిమిది వేల రూపాయలను (రూ.1,68,000/-) సంవత్సరం పాటు ఖర్చు పెట్టిన, మిగిలిన రూపాయలు అరవై వేల రూపాయల్ని (రూ.60,000/-) ఆ జిల్లాకు చెందిన జిల్లా ఐక్య టెక్నోవేషన్, ఆర్.టి.పి., ఎన్.ఐ.ఆర్.డి, (భారత ప్రభుత్వం, హైదరాబాదు; కో-ఆర్డినేటర్ జాబితాలోనికి వెళ్తాయి. (ఇలా ఆ జిల్లా కో-ఆర్డినేటర్ నెలకు జీతముల రూపాయలు ఐదు వేల రూపాయల్ని (రూ.5,000/-) సంవత్సరం పాటుతీసుకోవచ్చును)............ అనగా ఈ "చారి'స్ పార్ములా ఐక్య రెడ్"ను ఉపయోగించడం వలన...... 500 స్ట్రీట్ లైట్స్ ట్యూబ్ లైట్ డోమ్ లు వున్న ఒక గ్రామంలోని గ్రామపంచాయితీకి ఈ ”చారి పార్ములా”ద్వారా ముగ్గురేసి నిరుద్యోగ యువకులకు సంవత్సరం పాటు జీతాన్ని ఇచ్చి ఉపాధిని ఇస్తూ ఆ గ్రామపంచాయితీకి డబ్బులను ఆదా చేస్తూ అతి ముఖ్యమైన పర్యావరణము, ప్రపంచ ఉష్ణోగ్రత

ను కాడుా , ముందుకు దూసుకుపోవచ్చును.

చారీస్ పార్ములా ద్వారా సంవత్సరానికి అయ్యే ఖర్చుల వివరాలు

[మార్చు]
వివరం ఖర్చు
500 స్ట్రీట్ లైట్స్ ట్యూబ్ లైట్స్ కు ఖర్చు రూ.1,68,000/-
ఇద్దరు నిరుద్యోగ యువకుల జీతాలకు రూ.72,000/-
జిల్లా కో-ఆర్డినేటర్ జీతాలకు రూ.60,000/-
“చారి పార్ములా”ను ఉపయోగించడంవల్ల ఖర్చు రూ.3,00,000/-
పాత పద్ధతిలో వారికి సంవత్సరానికి అయ్యే ఖర్చు రూ.5,00,000/-
ఆ గ్రామ పంచాయితీకి సంవత్సరానికి మిగిలిన డబ్బులు రూ.2,00,000/-

ఇలా భారతదేశంలోని ప్రతి గ్రామ పంచాయితీ, గ్రామ పంచాయితీలోని గృహాలన్నీ మునిసిపాలిటి, మరియు మునిసిపాలిటిలోని గృహలన్నీ ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్లు సి. ఎఫ్.ఎల్ లాంటి పాదరసము

మిగిలి ఉన్న లైట్లు అన్నియు "చారి'స్ పార్ములాఐక్య రెడ్"ను ఉపయోగించి మళ్ళి వెలిగించుకొని కొంత కాలం తర్వాత మళ్ళి రెండో సారి ఫెయిల్ అయ్యాక వాటిని పార వేస్తూ

అక్కడి నేలను గాని, నీరునుగాని, గాలిని గాని, వాతావరణాన్ని గాని ఏధందంగా భయంకరమైన వ్ధుదులకగురి రాకాకుండా కాపాడడమే కడా అతి ముఖ్యమైన పర్యవణాను ు మరి యుప్

రపంచ గ్లోబల్ వార్మింగ్ ను కాపాడుతుంది. కాబట్టి క్రొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరూ, మీ గ్రామ పంచాయితీకి మీరే ప్రథమ పౌరుడు కాబట్టిదయచేసి..... అతి ముఖ్యమైన పర్వరణాము, ప్రపంచ గ్లోబల్ వార్మింగ్ ను కాపడుకోవటానికైన ఈ “చారి పార్ములా”ను మీ గ్రామ పంచాయితీలో ఉపయోగించి, గ్రామ పంచాయితీలోని గ్రుహలన్నింటిల్లో ఉపయోగించేలా చేసి మీ భూమీ, నెల, గాలి మెర్క్యూరీ బారిన పడకుండా పర్యవరణాము, ప్రపంచ గ్లోబల్ వార్మింగ్ ను కాపాడుకుందాము. నేను ఈ ప్రయోగాని కనిపెట్టినందుకు గాను నాచిరకాల కోరిక....

మూలాలు

[మార్చు]

చారి ఫార్ములా వీడియోలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]