నవీపేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవీపేట్
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటములో నవీపేట్ మండలం యొక్క స్థానము
నిజామాబాదు జిల్లా పటములో నవీపేట్ మండలం యొక్క స్థానము
నవీపేట్ is located in Telangana
నవీపేట్
నవీపేట్
తెలంగాణ పటములో నవీపేట్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°48′08″N 77°59′01″E / 18.802318°N 77.983589°E / 18.802318; 77.983589
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రము నవీపేట్
గ్రామాలు 13305
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,125
 - పురుషులు 27,096
 - స్త్రీలు 28,029
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.59%
 - పురుషులు 63.94%
 - స్త్రీలు 39.75%
పిన్ కోడ్ 503245

నవీపేట్, తెలంగాణ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పిన్. కోడ్ నం. 503 245. STD=08462.

మూలాలు[మార్చు]

జనాభా[మార్చు]

2001 లెక్కల ప్రకారం నవీపేట్ మండల జనాభా 51578. ఇందులో పురుషుల సంఖ్య 25378, మహిళలు 26200. జనసాంద్రత 261 మరియు స్త్రీపురుష నిష్పత్తి 1027. ఎస్సీల సంఖ్య 10662 మరియు ఎస్టీల సంఖ్య 4614. మండలంలో 500లోపు జనాభా ఉన్న గ్రామాలు 3 ఉండగా, 500-1000 మధ్య జనాభా ఉన్న గ్రామాల సంఖ్య 8, 1000-5000 లోపు జనాభా ఉన్న గ్రామాలు 18 ఉన్నాయి. 5వేలకుపైగా జనాభా ఒక్క గ్రామంలో ఉంది.[1]

మండల గణాంకాలు[మార్చు]

విద్యాసంస్థలు[మార్చు]

ప్రాథమిక పాఠశాలలు

2009-10 నాటికి మండలంలో మొత్తం 53 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాల 1, మండల పరిషత్తు పాఠశాలలు 46, ప్రైవేటు పాఠశాలలు 6 ఉన్నాయి.

ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలు

మండలంలో 9 మండల పరిషత్తు మరియు 5 ప్రైవేటు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

వ్యవసాయం, పంటలు[మార్చు]

మండలంలో వరి ముఖ్యమైన పంట. ఖరీఫ్ మరియు రబీ కలిపి సుమారు 4700 హెక్టార్లలో వరి పంట పండిస్తారు. పొద్దుతిరుగుడు 900 హెక్టార్లు, మొక్కజొన్న సుమారు 500 హెక్టార్లలో పండుతుంది. ఇవి కాకుండా జొన్నలు, పెసర్లు, మినుములు, మిరప, చెరుకు, ఉల్లిగడ్డలు, కూరగాయలు, వేరుశనగ, అల్లము, సోయాబోన్ కూడా మండలంలో కొంత ప్రాంతంలో పండిస్తారు.

  • ఈ గ్రామంలోని తడగామ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో, అక్టోబరు 7, 2013 న శ్రీ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మెస్రా కపిల భూపాల్ రెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ తెడ్డు పోశెట్టి ఎన్నికైనారు. [2]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 55,125 - పురుషులు 27,096 - స్త్రీలు 28,029

మూలాలు[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02

  1. Handbook of Statistics, Nizamabad Dist, 2010, published by CPO Nizamabad,

[2] ఈనాడు నిజామాబాదు; 2014,జనవరి-26; 16 పేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=నవీపేట్&oldid=1993879" నుండి వెలికితీశారు