బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టం - 1833

వికీపీడియా నుండి
(చార్టర్ చట్టం, 1833 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెని స్థాపించినప్పడినుండి (సా.శ. 1600) భారతదేశములో శాశ్వత వ్యాపార యిజారా (contract) ఇవ్వబడి విసిష్టాదికారముతో వర్తకముచేసుకునటయే కాక బ్రిటిష్ ప్రభుత్వమువారిచే ఆమోదించబడి అప్పడప్పుడప్పుడు నవీకరణ చేయబడిన సన్నదులు (పట్టాలు) ద్వారాను తరువాత 1773 నుండి 20 ఏండ్లకొకసారి చట్టముల ద్వారాను కలిగి న అనేక అధికారములతో కంపెనీవారు క్రమేణా రాజ్య పాలనచేయసాగెను. మొగల్ చక్రవర్తి యిచ్చిన దివానీ అధికారముతో 1765 నుండి వర్తకమువలన వచ్చే ఆదాయమే కాక రాజస్వఆదాయమును కూడా గణించుచుండెను. భారతదేశాబికవృధ్దికిగాని, దేశ ప్రజల క్షేమమునకుగాని ప్రాధాన్యత ఇవ్వబడుటలేదు. ఆ పరిస్థితులలో భారతదేశానికి జరుగుచున్న అన్యాయము బ్రిటిష్ దేశీయుల సంకుచితరాజనీతిని ఖండించుచూ బ్రిటిష్ పార్లమెంటులో తీవ్ర విమర్శలు 1765-1813 మధ్య తరుచూ చర్చించబడినవి. అంతేకాక 19వ శతాభ్దారంభములో 1815 సంవత్సరము నెపోలియన్ చనిపోయేవరకూ నెలకొనియున్న ఐరోపా దేశములలోని యుద్దపరిస్థితులవలన బ్రిటిష్ దేశములోని ఇతర వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలు భారతదేశములో వ్యాపారము చేసుకొనుటకు అవకాశము కల్పించుటకు భారతదేశమున స్వెఛ్చావ్యాపారమును అమలుచేయమను ఆందోళనలు జరిగెను. తత్ఫఫలితముగా ఈస్టుఇండియా కంపెని విసిష్టాధికార వ్యాపారమును రద్దుచేయవలసినట్టియూ, దేశఆదాయమును భారతదేశాభివృధ్దికి, ప్రజలసంక్షేమమునకే వినియోగించబడవలెనన్న జ్ఞానోదయముకలిగి బ్రిటిష్ ప్రభుత్వమువారిచే 1813 సంవత్సరములో చట్టము ద్వారా ఈ కంపెనీకిచ్చిన విసిష్టాధికారము తీసివేయబడినది (కేవలము ఒక్క తేనీటి ఆకు తప్ప). కానీ రాజ్యపాలన యధావిధిగా కొనసాగించుతూ రాజస్వమును మరో 20సంవత్సరములు కంపెనీవారే అనుభవించుటకు అనుమతించబడింది. తదనంతరం బ్రిటిష్ పార్లమెంటు 1833లో ఇంకో రాజ్యాంగ చట్టమును ఆమెదించి కంపెనీవారికి వ్యాపారముచేసుకునే హక్కు పూర్తిగా రద్దుపరచి భారతదేశ రాజ్యపాలనకు బ్రిటిష్ పార్లమెంటు వారి ప్రభుత్వముక్రింద భారతదేశమును పరిపాలించుటకు రాజ్యప్రతినిధిగా కంపెనీ వారినే నియమించుచూ, భారత దేశాదాయమును ఇచ్చటనే దేశాభివృద్దికి వినియోగించేటట్లుగా నిబంధనలు చేయబడినవి. కంపెనీ వారి పెట్టుబడులు, వారి సోత్తులు యావత్తూ ఖరీదు కట్టబడి భారతదేశపు ప్రభుత్వ కాతాకు ఖర్చువ్రాసి కంపెనీ వ్యాపార లావాదేవిలు నిలిపివేయబడినవి. ఈ 1833 సంవత్సరపు రాజ్యాంగ చట్టమే తదుపరి జరిగిన బ్రిటిష్ పరిపాలనా విధానమునకు పునాది యని చెప్పవచ్చును.[1]

1833 నాటి పరిస్థితుల వివరాలు

[మార్చు]

1833 నాటికి ఇంగ్లండులో బహుమతము కలిగి అధికారములోనుండిన విఘ్ అను (తదనంతరం లిబరల్ పార్టీగా రూపొందిన) రాజకీయపార్టీ నాయకుడైన లార్డు గ్రె ప్రధాన మంత్రిగా నుండెను. భారతదేశ స్రేయస్సుకోరినవాడని ప్రసిధ్దిచెంది కంపెని పరిపాలననూ త్రీవముగా విమర్శించిన న ప్రముఖ చరిత్రవేత్త థామస్ మెకాలె ( Thomas Babington Macaulay) ఇండియ కంపెనీ వ్యవహార నియంత్రణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కు కార్యదర్శిగానుండెను. విఘ్ పార్టీకి చెందిన రాజకీయనాయకులు భారతదేశములో జరుగుచున్న బ్రిటిష్ కంపెనీ పరిపాలనపై బ్రిటిష్ పార్లమెంటు సభలో తీవ్ర అసంతుష్టి అనేక సార్లు వెలిబుచ్చుచుండువలననే 1833 సంవత్సరమున ఆమేదించబడిన చట్టము ద్వారా కంపెని పరిపాలనలో సంస్కరణలు తీసురాబడినవి. అప్పటికి భారతదేశములో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ ప్రతినిధిగా కలకత్తాలో ఉదారభావుడని స్వతంత్ర ప్రియుడని పేరుపొందిన విలియం బెంటింక్ గవర్నరజనరల్ గా 1828నుండి దేశమును పరిపాలించుచూ కొన్ని మంచి సంస్కరణలు అమలుచేశాడు.

1833 సంవత్సరపు రాజ్యాంగ చట్టములోని ముఖ్య నిబందనలు, నిర్దేశములు (Provisions)

[మార్చు]

(1) ఈ చట్టములోనున్న వివిధ అంశములు (అనుజ్ఞలు, నిబంధనలు, అధికారములు ఇత్యాదులు) బ్రిటిష్ పార్లమెంటు వారివేనని శాసించబడినది (2) భారతదేశ పరిపాలనకు ప్రభుత్వపరిపాలనా యంత్రాంగముగా గవర్నర్ జనరల్ తోకూడిన కార్యాలోచన సభ నెలకొల్పబడింది. ఈ సభలో 4 సభ్యులుండిరి. అందు ముగ్గురను నియమించు అధికారము పూర్తిగా కంపెనీ డైరెక్టర్లుకు ఇవ్వబడగా 4వ సభ్యునిగా న్యాయ శాసనముల నిపుణుడైన (Law member) వారైయుండవలెను. వారిని నియమించుటకు ఇంగ్లండు రాజుగారి అనుమతి పొందవలసియున్నది. (3) గవర్నర్ జనరల్ నే సర్వసేనానిగా అనుమోదించు హక్కు కంపెనీ డైరెక్టర్ల కివ్వబడింది. గవర్నర్ జనరల్ కు శాసన నిర్మాణ అధికారమివ్వ బడినది కానీ బ్రిటిష్ పార్లమెంటు వారి అధికారమునకు విరుధ్ధముగా శాసనములు చేయరాదు. గవర్నర్ జనరల్ చేయు శాసనములను రెగ్యులేషన్ల బడును. గవర్నర్ జనరల్ కు ఇచ్చిన అనేక అధికారములలో భాగముగా సక్రమమైన న్యాయ విచారణకు కావలసిన, న్యాయవిచారణ పధ్దతి నేర్పరచుట.న్యాయాలయములు స్థాపించుట, వాని అధికారములు నిర్ణయించుట, న్యాయస్తానములలో అమలు చేయవలసిన న్యాయధర్మములు నిర్ణయించుట, మొదలగు విశేష కార్యములకు కమిషన్ నియమించుట (4) కంపెనీ కొలువులోఉద్యోగమునకు భారతీయుల జాతి, మత, వర్ణములవనగాని, పుట్టుక, ప్రదేశము, వంశము వలన గానీ అనర్హలుగా చేయరాదని సూత్రము చేయబడెను.

1833 రాజ్యాంగ చట్ట సమీక్ష

[మార్చు]

1833 చట్టమునకు ముందు కంపెనీ వారి రాజ్యాదికారములో జరుగుచున్న పరిపాలనలో దేశమునందు మద్రాసు, బొంబాయి, కలకత్తా కేంద్రములుగా చేసుకుని మూడు రాష్ట్రములలో స్వతంత్ర రూపములో పరిపాలన చేయబడు చున్నవి. మద్రాసు, బొంబాయి రాష్ట్రములు గవర్నరు ద్వారా పరిపాలింప బడుచుండగా కేవలము కలకత్తా రాష్ట్రమునకే గవర్నర్ జనరల్ పదవి యుండినది. 1833 రాజ్యాంగ చట్టము అమలుతో భారతదేశములో కంపెనీ రాజ్యాధికారమును అధిగమించి బ్రిటిష్ పార్లమెంటుద్వారా ఇంగ్లండు రాజుగారి పరిపాలనక్రిందకు తీసుకురాబడింది. అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్, అతనికి సలహాదారుడైన ధామస్ మెకాలే మహానుభావుల ఉదారభావముల చలువతో విద్యారంగము, న్యాయవ్యవస్త విషయములో ముఖ్యముగా పురోగతికి తోడ్పడినవి. న్యాయ విచారణకు జాతిమత భేదములకు తావు లేకుండినటుల చేయటము చాల గణనీయమైన పరిణామము. కాని ఈ చట్టము అమలు చేయుటలో భారతదేశ ప్రజలకు ఆంగ్ల విద్య, వేషభాషల పై అభిరుచులు క్రమేణా ఇంగ్లీషవారు తయారుచేసిన వస్తువులు, ఇంగ్లీషు చదువులపై మొజు, ఆంగ్ల పరిపాలనపై అభిమానము పెరుగుదలకు తోడ్పడవలెనని ఉద్దేశముతోనే చట్టములో పేర్కొన్న నిర్ణయములు చేయబడినవి. ఆ విషయము మేకాలే చేసిన మహోపన్యాసముల ద్వారాకూడా సరాసరిగా వెల్లడించబడినవి. ఈ 1833 చట్టము అమలుతో పాటుగా భారతదేశములో అప్పటిలో నుండిన న్యాయపరిపాలనా విధానము సంస్కరించుటకు బ్రిటిష్ పార్లమెంటు వ్యవహారములలో అనుభవముగలిగి మేధావిగా పేరుగలిగిన మెకాలెను భారతదేశముకు లాకమీషనర్ గా నియమించి భారతదేశములోనున్న శాసనధర్మములను సంస్కరించి క్రోడీకరించు బాధ్యతను అప్పచెప్పిరి. మెకాలె అప్పటి తత్కాలీన గవర్నర్ జనర్ అయిన విలియం బెంటింక్ కు సలహాదారుడును, నవనియుక్త గవర్నింగ్ కౌన్సిల్ లో 4వ విశేష సభ్యుడు కూడా. మెకాలె చేసిన కృషి ఫలితముగా వెలువడిన పీనల్ కోడ్ అను శిక్షాస్మృతి చాలా గణనీయమైనెదేగాని ఆ శిక్షాస్మృతి వలన భారతదేశప్రజల సంక్షేమముకన్ననూ బ్రిటిష్ రాజ్యపరిపాలన భారతదేశములో గట్టిపరచుటకు తోడ్పడినది అని చెప్పక తప్పదు ఎందువలనంటే ఇంగ్లండుదేశములోనున్న శిక్షాస్మృతిలో శిక్షినిచ్చెడి అధికారి అనర్హ్యమైనశిక్షవిధించినచో అట్టి అన్యాయపుశిక్షవిధించి న అధికారి శిక్షార్హుడగునని బ్రిటిష్ శిక్షాస్మృతిలో నుండినది. గాని ఇచ్చటభారతదేశములో మెకాలె మహానుభావుడు నిర్మించిన భారతీయ శిక్షాస్మృతిలో అట్టి శిక్షని కల్పించక పరిపాలనాధికారములు గలిగిన అధికారికి విశేష అధికారము కల్పించినట్లైనది. ఆందువలన మెకాలె చెసిన శిక్షాస్మృతి పక్షపాతముతోకూడిన క్రోడీకరణనని చెప్పక తప్పదు. ఆ చట్టమునకు రూపురేఖలిచ్చి, శిక్షాస్మృతి క్రోడీకరించిన గొప్ప మేధావి, చరిత్రకారుడు, వక్త, రాజకీయనాయకుడైన మెకాలె దొరను గూర్చి క్లుప్తముగా చెప్పవలసియున్నది.[1]

ధామస్ మెకాలె

[మార్చు]

పూర్తి పేరు ధామస్ బాబింగ్టన్ మెకాలె (Thomas Babington Macaulay). (1800-1859). 1832 లో ఇంగ్లండు పార్లమెంటు వ్యవహారాల రీతిలో సంస్కరణలుతెచ్చి పునరావృత్తము చేసిన చట్టము (Reform Act of 1832) చేయుటలో కూడా కృషిచేసిన ఇంగ్లండులోని ప్రముఖ రాజకీయ పార్టీ అయిన విఘ పార్టీకిచెందిన బ్రిటిష్ రాజకీయనాయకుడు, మేధావి, చరిత్రకారుడు, రచయిత, వక్త, ఉదారభావములకలిగిన స్వతంత్ర ప్రియుడు. అన్నిటికన్నా భారతీయుల పట్ల దయకలిగిన భారతదేశాభి వృద్దివాది. ఈ 1833 చట్టములో ఇమర్చబడ్డ నిబంధనలు నిర్ణయించిన వారిలో ప్రముఖుడు. ఈతని అభిమతములు స్వతంత్రాయుక్తమై నవిగనినూ దేశ, జాతిమతబేదములు న్యాయవిచారణలో స్థానములేదన్న దృష్టికోణము కలిగియుండినవాడు. బానిసత్వము, జాతిఆధిక్యతను ఖండించిన వాడు 1832 నుండి ఇంగ్లండులో హౌస్ ఆఫ్ కామన్సులో సభ్యడుగనూ, ఈస్టు ఇండియా కంపెనీ వ్యవహారాల నియంత్రణ నియమించబడ్డ బోర్డు ఆఫ్ కంట్రోల్ కు కార్యదర్శిగనుండిన కాలమునందు 1833 లో ఈ చట్టమునకు రూపురేఖలిచ్చి భారతదేశములో కంపెనీ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనకు ప్రమాణగుణనములు సృష్టించాడు. 1833 చట్టము అమలుచేసిన తరువాత 1834 భారతదేశములో నవనియుక్తమైన నలుగురు సభ్యుల గవర్నింగ్ కౌన్సిల్లోని న్యాయశాస్త్రనిపుణుని (law member) గా ఇంగ్లండు రాజుగారు ఆమేదించబడిన సభ్యుడుగనూ, తదుపరి ఇండియన్ జ్యూరిస్పూడెన్సు (న్యాయవిచారణలో భారతీయ శాసనధర్మములు) కమిషన్ కు అధ్యక్షుడుగనూ 1838 వరకూ భారతదేశములో పనిచేసి ఇంకా కొన్ని సంస్కరణభూయితమైన రెగ్యులేషన్లు భారతదేశ పరిపాలనకొరకు చేశాడు. ఇతను చేతిమీదుగా నిర్ణయించబడ్డ మరొక గణనీయమైనది నేరవిచారణకు సంబంధించిన శిక్షాస్మృతి క్రోడీకరణ (Penal Code). రచయితగా మెకాలే కొన్ని గొప్ప పుస్తకములు రచించాడు. అందులో ప్రసిధ్ధిచెందిన ఒక రచన "British History".[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "The British Rule in India" D.V. Siva Rao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp 237-240, 271-273
  2. Macropedia Britannica (1984) 15th Edition Volume 11, pp223-224,