చావలి బంగారమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చావలి బంగారమ్మ, (1897 - 1970) తూర్పుగోదావరి జిల్లా, మోడేకుర్రు గ్రామంలో జన్మించిన కవయిత్రి. ఈమె ప్రముఖ కవి కొంపెల్ల జనార్ధనరావు సహోదరి.[1]

రచనలు[మార్చు]

  1. ఆ కొండ (1932)
  2. కప్పతల్లి పెళ్లి (1933)
  3. తపస్సు (1933)
  4. కార్తిక పూర్ణిమ (1934)
  5. కాంచన విపంచి (1958)

ఆ కొండ[మార్చు]

మంచులో మునిగింది
మాయమై పోయింది
ఆకాశమున గలసెనో
ఆ కొండ
అక్కడే పడియుండెనో !

జరజరా నడిచింది
గిరగిరా తిరిగింది
ఒలు తిరిగి తాను పడెనో
ఆ కొండ
తల తిరిగి బారుమనెనో !


మూలాలు[మార్చు]

  1. బంగారమ్మ, చావలి (1897 - 1970), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 370.