చింతకింది శ్రీనివాసరావు
స్వరూపం
| చింతకింది శ్రీనివాసరావు | |
|---|---|
| నివాస ప్రాంతం | విశాఖపట్నం |
| ప్రసిద్ధి | కథా రచయిత, జర్నలిస్టు |
చింతకింది శ్రీనివాసరావు తెలుగు కథా రచయిత. ఈయన విశాఖపట్నం వాస్తవ్యులు. ఈయన రాసిన కథలు ఉత్తరాంధ్ర మాండలికానికి దర్పణం. రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు చింతకింది కథల గురించి ప్రస్తావిస్తూ, ఈ జీవిత వైరుధ్యాలు బహుశా కళిగాంధ్రలో మరీ స్పష్టంగా కనబడతాయేమో లేదా కళింగాంధ్ర దృక్పథంలోనే ఈ వైరుధ్యాల్ని పసిగట్టే స్వభావం అంతర్లీనంగా ఉందో తెలియదు గానీ, అక్కడ పుట్టిన కథలు కంచికి వెళ్లవని, అవి అక్కడే తచ్చాడుతూ ఉంటాయని తెలిపారు. చింతకింది కథల్లో కనిపించే జీవితం ఒక సోషియాలజీకి తలుపులు తెరుస్తుందని అభిప్రాయపడ్డారు.[1]
రచనలు
[మార్చు]- దాలప్ప తీర్థం (కథల సంపుటి)
- కప్ప స్తంభం (కథల సంపుటి)
- బుగతలనాటి చుక్కపల్లి (కథల సంపుటి)
- కాన్పులదిబ్బ (కథల సంపుటి)
- పతంజలి మోనోగ్రాఫ్
- అలివేణీ ఆణిముత్యమా
- ఆచార్య ఎన్.గోపి ఆధ్వర్యంలో ‘నానీ’లపై సమగ్ర పరిశోధన గ్రంథం
- వికర్ణ
- ఉడుకుబెల్లం (కథల సంపుటి)
- అదిగో ద్వారక (నవల)
- మున్నీటి గీతలు (నవల)
పురస్కారాలు
[మార్చు]- కె. ఎన్. వై. పతంజలి పురస్కారం
- చాసో పురస్కారం[2]
- మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం [3]
- శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారం
- పీచర సునీతా రావు అవార్డు - 2023
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు భాషా దినోత్సవ పురస్కారం-2025
మూలాలు, వనరులు
[మార్చు]- ↑ "ఉత్తరాంధ్ర కొత్త కలం | Northern New Award | Sakshi". www.sakshi.com. Retrieved 2025-09-27.
- ↑ "ఉత్తరాంధ్ర కొత్త కలం | Northern New Award | Sakshi". www.sakshi.com. Retrieved 2025-09-27.
- ↑ "మానవీయ కోణాల కథల గని". Jan 24, 2015. Archived from the original on 2020-03-28. Retrieved 2020-03-28.