Jump to content

చింతపల్లిపాడు

అక్షాంశ రేఖాంశాలు: 16°12′46″N 80°23′36″E / 16.212748°N 80.393347°E / 16.212748; 80.393347
వికీపీడియా నుండి
(చింతపల్లి పాడు నుండి దారిమార్పు చెందింది)
చింతపల్లి పాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
చింతపల్లి పాడు is located in Andhra Pradesh
చింతపల్లి పాడు
చింతపల్లి పాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°12′46″N 80°23′36″E / 16.212748°N 80.393347°E / 16.212748; 80.393347
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం వట్టిచెరుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మంచాల భారతి
పిన్ కోడ్ 522 017
ఎస్.టి.డి కోడ్ 0863

చింతపల్లిపాడు, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

ఈ గ్రామం గుంటూరుకూ 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ ఊరికి తారు రోడ్డు ఉంది.పల్లపాడూ ఊర్లకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు ఎక్కడం ద్వారా మా ఊరు చేరుకోవచ్చు.

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

ఈ గ్రామంలో చాలా సౌకర్యాలు ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

వైద్యం కోసం గ్రామంలోనే చాలా మందీ వైద్యులు ఉన్నారు. దగ్గర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నామెరుగైన వైద్యం కోసం ప్రజలు గుంటూరులో ప్రైవేట్ ఆస్పత్రులకే మొగ్గు చూపుతారు.

త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

మినరల్ వాటర్ ప్లాంట్, ఇక్కడ చాలా తక్కువ ధరకే (రు. 5/-కీ 20 లీటర్ల) పరిశుభ్రమైన నీరు దొరుకుతుంది.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

నీరు విస్తారంగా అందుబాటులో ఉంటుంది.

గ్రామంలో రాజకీయాలు

[మార్చు]

చింతపల్లిపాడు గ్రామం, శాసనసభ నియోజక వర్గం - ప్రత్తిపాడు. పార్లమెంటు నియోజక వర్గం - గుంటూరు

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. చింతపల్లిపాడు ఒక అభివృద్ధి చెందిన గ్రామం. 1990 లలో గ్రామం చాలా వెనుక బడి ఉంది. మన్నవ వీరనారాయణ సర్పంచ్ ఉన్న కాలంలో గ్రామం అభివృద్ధి చెందింది.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మంచాల భారతి సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ లక్ష్మీతిరుపతమ్మ ఆలయం

[మార్చు]

గ్రామం నడిబొడ్డులో ఉన్న ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో, అమ్మవారి తిరునాళ్ళు వారంరోజులపాటు ఘనంగా నిర్వహించెదరు.

గ్రామదేవత శ్రీ అద్దంకమ్మ తల్లి ఆలయం & శ్రీ పోతురాజుస్వామి ఆలయం

[మార్చు]

ఇక్కడ ప్రతి ఏటా పొంగళ్ళు పెడతారు. ఈ ఆలయ సప్తమ వార్షికోత్సవం, 2017, మే-31వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు [5]

శ్రీషిర్డీ సాయిబాబా, శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయ పునఃప్రతిష్ఠ మరియూ నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా, 2014, జూన్- 21 శనివారం నాడు, ప్రతిష్ఠా విగ్రహాలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. శాంతిహోమం నిర్వహించారు. ఈ ఆలయంలో 22, జూన్-2014, ఆదివారం ఉదయం 9 గంటలకు, శివాలయ పునఃప్రతిష్ఠ మరియూ నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చి, ఉత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు.

శ్రీ శివస్వామి దేవాలయం

[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు 2017, జూన్-20వతేదీ మంగళవారం నుండి 22వతేదీ గురువారంవరకు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుఝామున గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో స్వామివారి కల్యాణ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

ఇక్కడ అని రకలా పంటలు పండుతాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

కొద్ది మంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ 90 శాతం మందికి వ్యవసాయంజీవనాధారం.

పరిశ్రమలు

[మార్చు]

చాలా పత్తి మిల్లులు, శక్తి సబ్ స్టేషను ఉన్నాయి.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

మన్నవ మోహనకృష్ణ

[మార్చు]

చింతపల్లిపాడు నుండి అమెరికా వెళ్ళిన శ్రీ మన్నవ మోహనకృష్ణ, అక్కడ ఒక బ్యాంకుకు వైస్-ప్రెసిడెంటుగా వ్యవహరించుచున్నారు. రెస్టారెంట్, కన్సల్టెన్సీ తదితర వ్యాపారాలు నిర్వహించుచున్నారు. వీరు 2015, డిసెంబరు-13వ తేదీనాడు అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో, నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సంఘం) సంస్థ బోర్డ్ నిర్వహించిన ఎన్నికలలో అ సంస్థకు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [4]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.