Jump to content

చిక్లెట్స్

వికీపీడియా నుండి
చిక్లెట్స్
దర్శకత్వంముత్తు.యం
రచనముత్తు.యం
నిర్మాతశ్రీనివాసగురు
తారాగణం
  • సాత్విక్‌ వర్మ
  • జాక్‌ రాబిన్‌సన్‌
  • రిజీమా
  • మంజీరా రెడ్డి
ఛాయాగ్రహణంకొల్లంజి కుమార్
కూర్పువిజయ్ వేలు కుట్టి
సంగీతంబాలమురళీ బాలు
నిర్మాణ
సంస్థ
యస్ యస్ బి ఫిలిమ్స్
విడుదల తేదీ
20 సెప్టెంబరు 2024 (2024-09-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

చిక్లెట్స్ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీనివాసన్ గురు సమర్పణలో యస్‌య్‌సబి ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శ్రీనివాసగురు నిర్మించిన ఈ సినిమాకు ముత్తు.యం దర్శకత్వం వహించాడు. సాత్విక్‌ వర్మ, జాక్‌ రాబిన్‌సన్‌, రిజీమా, మంజీరా రెడ్డి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 ఫిబ్రవరి 23న విడుదల చేయగా[1] , సినిమాను 2024 సెప్టెంబర్ 20న సినిమా విడుదల చేశారు.[2]

రియా (నయన్ కరిష్మా), అనూష (అమృత హల్దర్), అంబి (మంజీర) చిన్నప్పటి నుండి స్నేహితులు. వారి తల్లిదండ్రులు కూడా అదే స్కూల్లో చదువుకునే స్నేహితులు. పాఠశాల చదువును ముగించే ముగ్గురు అమ్మాయిలు వారి వయస్సు రుగ్మతలో రొమాన్స్, డేటింగ్‌లో పాల్గొంటారు. తదనుగుణంగా, ముగ్గురూ తమకు ఇష్టమైన వాటిని ఎంచుకునేందుకు, ఉల్లాసంగా ఉండటానికి వారి తల్లిదండ్రులకు అబద్ధాలు చెబుతారు. పిల్లలపై నమ్మకం ఉన్న తల్లిదండ్రులు నిజానిజాలు తెలుసుకునేందుకు పిల్లలను వెతుక్కుంటూ వెళ్తారు. చివరికి పిల్లల కోరిక తీరిందా ? లేక తల్లిదండ్రుల కల నిజమైందా ? అనేది మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

[మార్చు]
  • సాత్విక్ వర్మ - వరుణ్
  • జాక్ రాభిన్ సన్ - చిక్కు
  • మంజీరా రెడ్డి - అంబి
  • నయన్ కరిష్మా - రియా
  • అమృత హల్దర్ - అనూష
  • సురేఖా వాణి - కీర్తి
  • శ్రీమన్ - సంతోష్
  • మనోబాల - మెడికల్ షాప్ యజమాని
  • రాజగోపాల్ - అయ్యర్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • సమర్పణ: శ్రీనివాసన్ గురు
  • బ్యానర్: యస్ యస్ బి ఫిల్మ్స్
  • నిర్మాత: శ్రీనివాసన్ గురు
  • రచన, దర్శకత్వం: ముత్తు.యం
  • సినిమాటోగ్రఫీ: కొలంచి కుమార్
  • సంగీతం: బాలమురళి బాలు
  • ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
  • కో డైరెక్టర్: యస్.యస్. కృష్ణ
  • లైన్ ప్రొడ్యూసర్: డానియల్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుబ్రమణ్యం

మూలాలు

[మార్చు]
  1. Sakshi (24 February 2023). "తల్లితండ్రులు.. పిల్లలకు సందేశం". Archived from the original on 2 February 2024. Retrieved 2 February 2024.
  2. Eenadu (31 January 2024). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  3. The Times of India. "Chiclets Movie Review : This male-gazey film can also be called '101 ways on how to commodify women's bodies on screen'". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  4. The Times of India (2 February 2024). "Chiclets Movie Review : This male-gazey film can also be called '101 ways on how to commodify women's bodies on screen'". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.

బయటి లింకులు

[మార్చు]