Jump to content

చిట్కా పంపు

వికీపీడియా నుండి
చిట్కా పంపు పద్ధతితో రెండు బోరుబావులలోని నీటిని ఒకే పంపు ద్వారా రంపించేందుకు చేసిన మొదటి ప్రయోగపు చిత్రం

చిట్కా పంపు అనగా ఒక చిట్కాను ఉపయోగించి పనిచేయించే పంపు. మిట్టనుంచి పల్లంనకు ప్రవహించుట ద్రవముల సహజ లక్షణం. ద్రవానికి ఉన్న ఈ ప్రత్యేక లక్షణం ఆధారంగా ప్రవాహమునకు అడ్డుపడిన గట్టులను దాటించి ద్రవాన్ని పల్లమునకు పంపించవచ్చు. భూమికున్న గురుత్వాకర్షణ శక్తి వలన, ద్రవం తనకున్న పల్లమునకు ప్రవహించే శక్తితో భూభాగాన్ని ఆవిరిస్తూ ఉంటుంది. తన ప్రవాహమునకు అడ్డువచ్చిన కట్టలను తెంచుకుని మరీ పల్లమును చేరుటకు ప్రయత్నిస్తూ ఉంటుంది. కట్ట అడ్డు ఉన్న ద్రవం ఎంత ఎక్కువున్నను ఎంత మిట్టనున్నను సాధారణ స్థితిలో గట్టును దూకి ప్రవహించలేదు. అయితే కొన్ని పరిస్థితులు అనుకూలించినట్లయితే గట్టును దూకి కూడా ద్రవం ప్రవహించగలదు. ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా అటువంటి పరిస్థితులు ఏర్పడటం చాలా అరుదు, అసలు చెప్పాలంటే సహజ సిద్ధంగా అటువంటి పరిస్థితులు ఏర్పడవు. మానవుడు అత్యంత సులభంగా అటువంటి పరిస్థితులను కల్పించి ద్రవము గట్టు దూకేలా చేసి అనేక అవసరాల కొరకు వాడుకుంటునాడు, పూర్వం నుంచి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ద్రవం గట్టు దూకించే విధానాన్ని మానవుడు ఉపయోగించుకున్నాడు, ఇక ముందు ఉపయోగించుకుంటాడు కూడా. ఎందుకంటే ఈ విధానం చాలా సులువైనది, అత్యంత చౌకైనది, సాధారణంగా యంత్ర విద్యుత్ అవసరం లేనిది.

ఎలా ఉపయోగించాలి

[మార్చు]

సాధారణంగా ఎక్కువగా చాలా కొద్ది మొత్తంలో ద్రవాన్ని దూకించుటకు నలగని, రంధ్రములు లేని వంగే గుణముగల సన్నని పైపు ఉపయోగిస్తుంటారు. పైపుని ద్రవంతో నింపి రెండు చివరలు మూసి ఉంచి ఒక చివరను మిట్టనున్న లేదా ఎగువనున్న ద్రవంలో ఉంచి మరొక చివరను పల్లమున ఉంచి ముందుగా ద్రవంలో నున్న పైపు చివర అడ్డును తొలగించి వెనువెంటనే పల్లములో నున్న మరొక పైపు చివరి అడ్డు తొలగించినట్లయితే మిట్టనున్న ద్రవం ఆ పైపు ద్వారా పల్లమునకు దూకుతూ ప్రవహిస్తుంది. ఈ విధానం సాఫీగా కొనసాగాలంటే రెండు చివరలు ద్రవంలో మునిగి ఉండాలి, అలా చేయనట్లయితే గాలి చొరబడి జరుగుతున్న ప్రక్రియ ఆగిపోతుంది.

అనేక బోరు బావులలోని నీరు ఒక మోటారు ద్వారా వెలుపలికి రంపించడం

[మార్చు]

భారతదేశంలో చాలా ప్రాంతాలలో బోర్లు వేసినప్పుడు ఒక ఇంచ్ నీరు పడుతుంది. రైతులు వాటిని పూడ్చి వేయడం లేక మరికొన్ని బోర్లు వేసి వాటికి మరికొన్ని మోటార్లు బిగించి వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ ఒక ఇంచ్ నీరు పడిన బోరు బావులకు మూడు ఇంచ్ నీరు తోడగల శక్తి కలిగిన మోటార్లను బిగిస్తున్నారు. ఈ విధంగా మూడు ఇంచ్ నీరు కోసం మూడు మోటార్లును బిగించి విలువైన విద్యుత్ ను ఖర్చు చేయడం జరుగుతుంది. విద్యుత్ ఖర్చు లేకుండా గాలికి ఉండే ఊర్ధ్వ, అధోః పీడనాల ద్వారా ఒక బోరు లోని నీరు మరొక బోరు బావిలోనికి రంపించి ఒకే మోటారు ద్వారా రెండు బోరు బావులలోని నీరు తోడేందుకు ఒక ప్రయోగాన్ని రూపొందించడం జరిగింది.[ఆధారం చూపాలి]

ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు

[మార్చు]