చిత్రగుప్త దేవాలయం (హైదరాబాదు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రగుప్త దేవాలయం
చిత్రగుప్తుడు, అతని 12 మంది కుమారులు చిత్రపటం
చిత్రగుప్తుడు, అతని 12 మంది కుమారులు (చిత్రపటం)
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హైదరాబాదు
ప్రదేశం:కందికల్ గేటు దగ్గర, ఛత్రినాక
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:చిత్రగుప్తుడు
ప్రధాన పండుగలు:చిత్రగుప్తుడి జయంతి (దీపావళి రెండో రోజు)
నిర్మాణ శైలి:కాకతీయ వాస్తు శైలి

చిత్రగుప్త దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగరంలోని ఒక హిందూ దేవాలయం. భారతదేశంలోనే అతిపురాతనమైన చిత్రగుప్త దేవాలయాల్లో ఇదొకటి. హిందూ దేవుడైన చిత్రగుప్తుడు

పురాణాల ప్రకారం నరకలోకంలో యమ ధర్మరాజు దగ్గర జీవుల పాప, పుణ్యాలను గణించి, నివేదిస్తుంటాడు.[1] బ్రహ్మ మనసులో ఆలోచన(చిత్రం)గా మొదలై, మిగతా దేవతలకు తెలియకుండా అంటే గుప్తంగా సృష్టించబడ్డాడు కాబట్టి చిత్రగుప్తుడు అయ్యాడు.

స్థలపురాణం[మార్చు]

ఈ దేవస్థానం 18వ శతాబ్దంలో కాయస్థ వంశీయుడైన అప్పటి మంత్రి రాజా కిషన్ ప్రసాద్ కట్టించాడు. అసఫ్‌జాహీల కాలంలో నగరానికి వలసవచ్చిన కాయస్థ బ్రాహ్మణులు తమ కులదైవం చిత్రగుప్తునికి ఈ ఆలయం నిర్మించారు. దీనికి నిజాం ప్రభువు మూడున్నర ఎకరాల స్థలం కేటాయించాడు. కేశవగిరి నుంచి మేలు రకమైన గ్రానైట్‌ను తెప్పించి, నిపుణులైన శిల్పులతో 16 స్తంభాల మండపంతో కాకతీయ వాస్తు శైలిలో నిర్మించారు. నీలివర్ణం శిలతో రూపొందించిన చిత్రగుప్తుని నిలువెత్తు విగ్రహం గంభీరంగా ఉంటుంది. ఈ ఆలయంలో చిత్రగుప్తుడితోపాటు ఆయన దేవేరులు సూర్యదక్షిణ నందిని, పార్వతీ శోభావతి కొలువుదీరి ఉన్నారు. అలాగే వారి 12 మంది సంతానానికి కూడా విగ్రహాలున్నాయి.[2]

కాగా చిత్రగుప్తుడి మొదటి భార్య సూర్యదక్షిణ నందినికి నలుగురు కుమారులు భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను, నలుగురు కుమార్తెలు పక్షిణి, మాలతీ, రంభ, నర్మదా ఉన్నారు. అలాగే రెండో భార్య పార్వతీ శోభావతికి ఎనిమిదిమంది కుమారులు చారూ, సుచారు, చిత్రాఖ్య, మతిమాన్‌, హిమవన్‌, చిత్ర్‌చారు, అరుణ, జితేంద్రలు, కుమార్తెలు ఎనిమిది మంది భద్రకాళిని, భుజ్‌ గాక్షి, గడ్‌ కీ, పంకజాక్షి, కొకల్సూత్‌, సుఖ్‌ దేవి, కామ కాల్‌, సౌభాగ్యినిలు.

తర్వాతి కాలంలో విశాలమైన ఈ ప్రాంగణంలో శివాలయం, రామాలయాలను తదితర ఉపాలయాలను నిర్మించారు.

చేరుకోవడం[మార్చు]

భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న చార్మినార్‌కు దక్షిణాన మూడు కిలోమీటర్ల దూరంలో ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌కు సమీపంలోగల ఛత్రినాకలో కందికల్ గేటు దగ్గర ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం నగరంలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి.

ప్రతి బుధవారం ఇక్కడ చిత్రగుప్తునికి విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రధానంగా కేతు గ్రహ దోష నివారణ కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పటికి ప్రపంచ నలుమూలల నుంచి కాయస్థ వంశస్తులు తాము కులదైవంగా భావించే చిత్రగుప్తుని కొలుస్తుంటారు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "పాతబస్తీలో ఆయన దర్బారు". web.archive.org. 2023-03-01. Archived from the original on 2023-03-01. Retrieved 2023-03-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Chitragupta Temple - Sakshi". web.archive.org. 2023-03-01. Archived from the original on 2023-03-01. Retrieved 2023-03-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)