Jump to content

చిత్రాభ్యుదయం

వికీపీడియా నుండి

చిత్రాభ్యుదయము కాళ్లకూరి నారాయణరావు (1871 - 1927) రచించిన తెలుగు నాటకం.

చిత్రాంగి-సారంగధరుల గాథ చాలా ప్రాచుర్యం పొందింది. రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొనే సారంగధరునికీ చిత్రాంగికీ నడుమ జరిగిన కథ ఇది. రాజమండ్రిలో ఇప్పటికీ చిత్రాంగి మేడ, సారంగధరుని మేడ ఉన్న ప్రాంతాలుగా కొన్ని స్థలాలను చూపుతారంటే ఈ కథ ప్రాచుర్యం ఎంతటిదో తెలుస్తోంది. అటువంటి గాథను ఇతివృత్తంగా స్వీకరించి చింతామణి మొదలైన నాటకాల కర్త కాళ్ళకూరి నారాయణరావు ఈ నాటకం

Kallakuri Narayanarao.JPG
చిత్రాభ్యుదయం రచయిత కాళ్లకూరి నారాయణరావు

రచించారు. ఈ పుస్తకం రచయిత మరణానంతరం 1932 సంవత్సరంలో అతని సోదరుడు కాళ్లకూరి భోగరాజు గారి చేత ప్రచురింపబడింది.

నాటకంలోని పాత్రలు

[మార్చు]
పురుషులు
  • రాజరాజనరేంద్రుడు - కథానాయకుని తండ్రి.
  • సారంగధరుడు - యువరాజు, కథానాయకుడు.
  • గుణదేవుడు - రాజరాజనరేంద్రుని ముఖ్యమంత్రి.
  • హరిశర్మ - రాజరాజనరేంద్రుని ద్వితీయమంత్రి.
  • సుబుద్ధి - గుణదేవుని కుమారుడు, కథానాయకుని మంత్రి.
  • విశారదుడు - చిత్రప్రదర్శకుడు.
  • సువేగుడు - యుద్ధభటుడు.
  • వామనుడు - రాజసేవకుడు.
  • వైశ్వానరుడు - కథానాయకుని వేడుక చెలికాడు.
  • న్యాయాధిపతి
  • వామదేవుడు, విద్యాధరుడు - న్యాయవాదులు
  • పాలకుడు - న్యాయస్థాన భటుడు.
  • దండపాశికుడు - రాజకీయోద్యోగస్థుడు
  • రోషణుడు, ఘోషణుడు - రాజభటులు
  • దమనుడు - మీననాథుని శిష్యుడు.
  • సూత్రధారుడు - అంతర్నాటకమును నడుపువాడు.
  • మీననాథుడు - రాజగురువు, ఒక ముని.
స్త్రీలు
  • చిత్రాంగి - కథానాయిక
  • లలితాంగి, సుందరాంగి - కథానాయిక సఖులు.
  • రత్నాంగి - కథానాయకుని తల్లి.
  • పుష్పాంగి - రాజపరిచారిక.

మూలాలు

[మార్చు]