చిత్రాభ్యుదయం
Appearance
(చిత్రాభ్యుదయము నుండి దారిమార్పు చెందింది)
చిత్రాభ్యుదయము కాళ్లకూరి నారాయణరావు (1871 - 1927) రచించిన తెలుగు నాటకం.
చిత్రాంగి-సారంగధరుల గాథ చాలా ప్రాచుర్యం పొందింది. రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొనే సారంగధరునికీ చిత్రాంగికీ నడుమ జరిగిన కథ ఇది. రాజమండ్రిలో ఇప్పటికీ చిత్రాంగి మేడ, సారంగధరుని మేడ ఉన్న ప్రాంతాలుగా కొన్ని స్థలాలను చూపుతారంటే ఈ కథ ప్రాచుర్యం ఎంతటిదో తెలుస్తోంది. అటువంటి గాథను ఇతివృత్తంగా స్వీకరించి చింతామణి మొదలైన నాటకాల కర్త కాళ్ళకూరి నారాయణరావు ఈ నాటకం
రచించారు. ఈ పుస్తకం రచయిత మరణానంతరం 1932 సంవత్సరంలో అతని సోదరుడు కాళ్లకూరి భోగరాజు గారి చేత ప్రచురింపబడింది.
నాటకంలోని పాత్రలు
[మార్చు]- పురుషులు
- రాజరాజనరేంద్రుడు - కథానాయకుని తండ్రి.
- సారంగధరుడు - యువరాజు, కథానాయకుడు.
- గుణదేవుడు - రాజరాజనరేంద్రుని ముఖ్యమంత్రి.
- హరిశర్మ - రాజరాజనరేంద్రుని ద్వితీయమంత్రి.
- సుబుద్ధి - గుణదేవుని కుమారుడు, కథానాయకుని మంత్రి.
- విశారదుడు - చిత్రప్రదర్శకుడు.
- సువేగుడు - యుద్ధభటుడు.
- వామనుడు - రాజసేవకుడు.
- వైశ్వానరుడు - కథానాయకుని వేడుక చెలికాడు.
- న్యాయాధిపతి
- వామదేవుడు, విద్యాధరుడు - న్యాయవాదులు
- పాలకుడు - న్యాయస్థాన భటుడు.
- దండపాశికుడు - రాజకీయోద్యోగస్థుడు
- రోషణుడు, ఘోషణుడు - రాజభటులు
- దమనుడు - మీననాథుని శిష్యుడు.
- సూత్రధారుడు - అంతర్నాటకమును నడుపువాడు.
- మీననాథుడు - రాజగురువు, ఒక ముని.
- స్త్రీలు
- చిత్రాంగి - కథానాయిక
- లలితాంగి, సుందరాంగి - కథానాయిక సఖులు.
- రత్నాంగి - కథానాయకుని తల్లి.
- పుష్పాంగి - రాజపరిచారిక.