చిన్నయసూరి జీవితము
స్వరూపం

పరవస్తు చిన్నయ సూరి ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఆయన జీవిత చరిత్రను పరిశోధన పరమేశ్వర బిరుదాంకితులైన నిడదవోలు వెంకటరావు రచించారు.
రచయిత పరిచయం
[మార్చు]నిడుదవోలు వేంకటరావు ప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. సాహిత్య విమర్శకులు, ప్రాచీన గ్రంథ పరిష్కర్త, అసాధారణ పరిశోధకులు. వీరు విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఏ. పట్టభద్రులైనారు. వీరు పిఠాపురం రాజావారి శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలోను, రాజావారి కళాశాలలో కొంతకాలం పనిచేశారు. అనంతరం మద్రాసులోని ప్రాచ్య పరిశోధన సంస్థలోని ఆంధ్ర శాఖలో చేరి క్రమేపీ ఆ శాఖకు అధ్యక్షులైరి. వీరు పరవస్తు చిన్నయసూరి జీవితచరిత్ర, కొప్పరపు సోదర కవుల చరిత్ర లను రచించిరి. 1982 అక్టోబరు 15 తేదీన దివంగతులయారు.
విషయ సూచిక
[మార్చు]- ఉపోధ్ఘాతము
- జననము, విద్యాభ్యాసము
- పాండిత్య ప్రకర్ష - ఉద్యోగ ప్రయత్నములు
- పచ్చయప్ప పాఠశాలా పండిత పదవి
- రాజధానీ కళాశాల పండిత పదవి
- వచన రచన
- వ్యాకరణ రచన
- బాలవ్యాకరణము 1
- బాలవ్యాకరణము 2
- చిన్నయసూరి నిఘంటువు
- కృత్యంతరములు
- పద్య రచన
- సాహిత్య విద్యా ప్రచారము
- శిష్యవర్గము