చిన్నయ్య గుట్ట దేవాలయం లక్సెట్టిపేట
చిన్నయ్య గుట్ట దేవాలయం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని హన్మంతుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చల్లంపేట గ్రామంలో శివారులోని అటవీ ప్రాంతంలో ఉంది. చిన్నయ్య దేవుడిగా ప్రసిద్ధి. నాయక్ పోడ్ గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా భావించి పూజిస్తుంటారు[1][2].
చిన్నయ్య గుట్ట దేవాలయం లక్సెట్టిపేట | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E |
పేరు | |
ఇతర పేర్లు: | సహదేవుడు కొండ పాండవుల క్షేత్రం చిన్నయ్య క్షేత్రంగా |
ప్రధాన పేరు : | చిన్నయ్య గుట్ట ఆలయం |
దేవనాగరి : | चिन्नय्या गुट्टा देवस्थान |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | మంచిర్యాల జిల్లా,లక్సెట్టిపేట మండలంలోని చల్లంపేట పంచాయతీ పరిధిలో |
ప్రదేశం: | చిన్న గుట్ట |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సహదేవుడు |
ఉత్సవ దైవం: | చిన్నయ్య దేవుడు |
ఉత్సవ దేవత: | చిన్నయ్య దేవుడు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | పురాతన హిందూ దేవాలయం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
స్థలపురాణం
[మార్చు]ఈ ఆలయం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానికులు ఈ గుట్టును చిన్నయ్య గుట్ట అని దేవుడుని చిన్నయ్య దేవుడు అని అంటారు. స్థానికుల కథనం ప్రకారం ఈ గుట్టకు చిన్నయ్య గుట్ట అని పేరు రావడానికి కారణం పూర్వం ఈ గుట్ట ప్రాంతంలో పాండవులులో చిన్నవాడైన సహదేవుడు ఇక్కడ నివాసం ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు. మండల కేంద్రము నుండి సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం చేసేందుకు ఈ గుట్ట ప్రాంతంలో వచ్చి ఈ కొండ మీదే తల రాసుకున్నారుని అంటారు. చిన్నయ్య అంటే పంచపాండవులలో చిన్నవాడైన సహదేవుడు కాబట్టి ఈ గుట్టకు చిన్నయ్య గుట్ట అని పేరు వచ్చిందని అంటారు. పూర్వీకుల యొక్క కథనం ప్రకారం ఈ గుట్ట నుండి పెద్దయ్య గుట్ట ఆలయం వరకు సొరంగ మార్గం ఉండేదని చెబుతారు.ద్రౌపతి స్నానం ఆచరించడానికి గుర్తుగా ఇక్కడ కుండల కొలను, భీముడు వ్యవసాయం చేసినట్లు నల్లని రాయి పై ఎద్దుల గిట్టల ముద్రలు భీముని పాదముద్రలు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది[3].
దేవుని గుడి
[మార్చు]చిన్నయ్య దేవుడని ఆలయం అడవి మధ్యలో ఉన్న కొండచెరియ పైన ఉంటుంది.ఈ గుడిని భక్తులు మొగురాలు వాసాలు దూలాలతో నిర్మించి పైన గడ్డితో కప్పబడి ఉంటుంది . గుడిలో భక్తులు టెర్రాకోట మట్టి తో చేసిన గుర్రాలు, ఏనుగులు ఒంటెలు కానుకగా సమర్పించడం ఆనవాయితీ.
విశేషం
[మార్చు]ఈ చిన్నయ్య గుట్ట ప్రాంతం అంతా మంచుకొండలతో అవరించి ఉంటుంది.ఈ ప్రదేశంలో గట్టిగా అరచి చప్పట్లు కొట్టగానే కొండల పై నుండి జలజలమని సబ్దంతో నిరు క్రిందికి జాలువారడంతో భక్తులు పుణ్య తీర్థమని తలపై చల్లుకోని దేవుని మొక్కడం ఆచారం.ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ప్రకృతిలో సహజంగా జరిగే వింత విషయమని భావిస్తారు[4].
మంచు కొండలకు నియం
[మార్చు]లక్సెట్టిపేట మండలంలోని చల్లం పేటకు 5 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో చిన్నయ్య కుటీరం ఉంది.పెద్దయ్య దేవుని ఆలయం నుండి ఇక్కడికి ఒక సొరంగం ఉండేదని స్థానికులు చెబుతారు.ద్రౌపది స్నానం ఆచరించడానికి గుర్తుగా ఇక్కడ కుండల, కొలను భీముడు వ్యవసాయం చేసినట్లు నల్లని రాయి పై ఎద్దుల గిట్టల ముద్రలు భీముని పాదముద్రలు ఇక్కడ విశేషాలు.ఇక్కడి నుండి రెండు కిలోమీటర్లు వెళ్తే మంచు కొండలు చూడవచ్చు.అక్కడ రాతి కొండల మధ్య నుంచి నీరు జాలువారుతాయి[5].
ఇవి కూడా చూడండి
[మార్చు]పెద్దయ్య గుట్ట దేవాలయం దండేపల్లి
మూలాలు
[మార్చు]- ↑ Bharat, E. T. V. (2021-03-21). "పెద్దయ్యగుట్ట.. రైతుల కోర్కెలు తీర్చునంట!". ETV Bharat News. Retrieved 2024-11-02.
- ↑ "అన్నదాతల గుడి.. సిరుల ఒడి". EENADU. Retrieved 2024-11-02.
- ↑ "గిరిజన దైవం.. ప్రకృతి రమణీయం". EENADU. Retrieved 2024-11-02.
- ↑ "చిన్నయ్య గుట్ట: ఎంత గట్టిగా చప్పట్లు కొడితే.. అంత నీరు | Adilabad Mancherial Chinnayya Gutta History In Telugu | Sakshi". www.sakshi.com. Retrieved 2024-11-02.
- ↑ "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2024-12-18.