Jump to content

చిప్పోళ్ళు

వికీపీడియా నుండి
దక్షిణ భారతదేశానికి చెందిన కులాలు, ఆదివాసీల గురించిన పుస్తకం

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 5వ కులం.కొలతల టేపుల్లేని రోజుల్లో మూరల లెక్కల చొప్పున కొలతలు తీసుకుని, వస్త్రాలకు ఎక్కడి కక్కడ గాటుపెట్టి చించేవాళ్లు. కనుక వీళ్లని చింపేవాళ్లని చెప్పుకునేవారు. కాలక్రమంలో చింపేవాళ్లు కాస్తా చిప్పోళ్ళుగా మారారు. వీరే మేరు కులస్తులు. అప్పట్లో వీరిది సంచార జాతి. ఇంటిల్లిపాదీ ఊరూరా తిరుగుతూ బట్టలు కుట్టి బతికేవారు. కనుకనే వీరి సంతతి విద్యకు దూరమై దీనాతి దీనంగా జీవిస్తోంది.చిప్పోలు, మేరు, మేర కులస్తులుగా చిరపరిచితులైన వీరు మహారాష్ర్టలో షిండీ లుగా పిలువబడుతున్నారు. రాష్ర్టమంతటా విస్తరించినప్పటికీ తెలంగాణ ప్రాంతంతోపాటు, గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. కాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వీరు కాపు లతో వివాహసం బంధాలు పెంపొందించుకుని కాపులుగా గుర్తింపు పొందుతున్నారు. పండుగ సీజన్‌ వచ్చిందంటే రాత్రింబవళ్లు పనిచేసేవారు. కుట్టుమిషన్‌తో పోటీపడి పనిచేసి కస్టమ ర్లను తృప్తిపరిచేవాళ్లు. మహిళలు, పిల్లలూ కలిసి కాజాలు తీయడం, గుండీలు, హు క్కులు కుట్టడం, చేతిపని చేస్తూ సహకరించేవారు. ఈ విధంగా వచ్చే డబ్బుతోనే వీరు జీవనం సాగించేవారు.బట్టలు కుట్టించుకోవడం అనే ప్రక్రియ ఎప్పుడో పండ గలూ, పబ్బాలకు మాత్రమే పరిమితం కావడంతో వీరు సీజన్‌లో సంపాదించుకున్న డబ్బును పొదుపుగా వాడుకుని అన్‌సీజన్‌లో కుటుంబ ఖర్చులకు ఉపయో గించుకునేవారు.ఎక్కువమంది రెడిమేడ్‌ దుస్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కనుక మేరు కులస్తులు వీరు ఉపాధి కోల్పోతున్నారు. జత బట్టలు కుట్టించుకోవాలంటే కష్టమర్‌కు 200 రూపా యలు ఖర్చవుతోంది. ఇదే డబ్బుతో కొత్త బట్టలు ఇవ్వడానికి రెడీమేడ్‌ షాపులు పుట్టుకు రావడంతో వీరి వృత్తి దెబ్బతింది. దర్జీ దినసరి కార్మికులుగా మారాల్సివచ్చింది. దీనికితోడు కటింగ్‌ మిషన్లు రావడంతో వీరి మనుగడే ప్రశ్నార్ధకరంగా మారింది. మిషన్‌ రంగప్రవేశంతో టైలరింగ్‌ రంగం కుదేలైంది. అపెరల్‌ పార్కుల్లో మాకు స్థలం కేటాయించాలని తాము సంచార జాతికాబట్టి తమని బీసీ- ఏలో చేర్చాలని వీరు కోరుతున్నారు.

మూలాలు

[మార్చు]