Jump to content

చిలారాయ్

వికీపీడియా నుండి
శుక్లధ్వజుడు
ధుబ్రి నగరం లో చిలారాయ్ విగ్రహం
తండ్రివిశ్వసింగ

శుక్లధ్వజుడు కమతా రాజ్యానికి చెందిన రాజు నరనారాయునుడి తమ్ముడు, సర్వసేనానాయకుడు. ఇతని మరో పేరు చిలారాయ్, దీని అర్థం అసం భాషలో గాలిపటం రాయుడు. యుద్ధరంగంలో గాలిపటంలా తమ సైన్యాన్ని అతివేగంతో నడిపిచన వలన ఈ బిరుదు సంపాదించాడు. భూటియా అహోం కాచరి లాంటి రాజ్యాలపై విజయం సాధించిన గొప్ప సేనానాయకుడు.[1]

జీవిత చరిత్ర

[మార్చు]

చిలారాయ తండ్రి పేరు విశ్వసింగ.[2] తల్లి పద్మావతి గౌర్ రాజ్యంలో జన్మించింది.[3]

చిలారాయ్ శ్రీమంత శంకరదేవుడుకి శరణం ఇచ్చాడు. తన కుటుంబసదస్యురాలుతో పెళ్ళి కూడా చేయించాడు. చిలారాయ ప్రోత్సాహాన వలన శంకరదేవుడు తన ‘ఎకసరణ ధర్మ’ ఉద్యమం మొదలపెట్టాడు.

జూన్ 1563 లో అహోం రాజధానిని చిలారాయ్ కబ్జా చేసాడు. భారాతదేసంలో ఛత్రపతి శివాజీ ముందు గెరిల్లా యుద్ధంతో గెలిచిన వీరుడు చిలారాయ్. చిలారాయ్ దయావంతుడు కూడా. యుద్ధరంగంలో వోడించిన రాజులను ఆదరపూర్వకంగా వొదిలిపెట్టి కేవలం కప్పము కట్టమని ఆదేశించాడు. వోడిపోయిన రాజ్యాల ప్రజలను ఎ హాని కలగనివకుండా చూసాడు. వోడిపోయిన సైనికులను కూడా వోదిలిపెట్టాడు, అవసరముంటే తన రాజ్యంలోనే శరణం ఇచ్చాడు.

ఇద్దరు సొదరలు బెంగాల్ ప్రాంతాన్ని కబ్జా చేసేందుకు యుద్ధ రంగం లోకి దిగారు. కాని ఆఫ్ఘానిస్తాన్ కి చెందిన సుల్తాన్ సులేమాన్ కర్రాని అడ్డుగా నిలబడాడు. కర్రాని ఇద్దరినీ వోడించి చిలారాయ్ ను బంధించి కోచ్ రాజ్యాన్ని కబ్జా చేస్సాడు, ఇదే కాకుండా అతి ప్రసిద్ధమైన కామాఖ్యా గుడిని పడగొట్టాడు. కాని చిలారాయ్ తప్పించుకుని, మల్లి తన రాజ్యాన్ని గెలిచి కామాఖ్యా గుడిని మల్లి నిర్మించాడు. [4]

1571 సంవత్సరం గంగా నదీ ఒడ్డున మశూచి రోగం వలన మరణించాడు.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Article Details". Ht Syndication. 2013-03-03. Archived from the original on 2016-03-04. Retrieved 2013-06-02.
  2. "History Book of Cooch Behar". Coochbehar.nic.in. Retrieved 2013-06-02.
  3. Baruah Sarma, Geetima. "Bir Chilaray – The Great General of Assam". India-north-east.com. Retrieved 2013-06-02.[permanent dead link]
  4. Sukhabilāsa Barmā (2004). Bhāwāiyā: Ethnomusicological Study. Global Vision Publishing Ho. pp. 75–. ISBN 978-81-8220-070-8. Retrieved 2 June 2013.

ఇంకా చదవటానికి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చిలారాయ్&oldid=2912785" నుండి వెలికితీశారు