Jump to content

గ్రహణం మొర్రి

వికీపీడియా నుండి
(చీలిక అంగిలి నుండి దారిమార్పు చెందింది)
గ్రహణం మొర్రి
వర్గీకరణ & బయటి వనరులు
Right sided unilateral incomplete cleft lip
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 29604 29414
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 

గ్రహణం మొర్రి అనేది ఒక అంగ వైకల్యం. వీరిలో పై పెదవి ముందు భాగంలో మధ్యన చీలిక వస్తే దాని చీలిక పెదవి ( క్లెఫ్ట్ లిప్ లేదా Cleft lip) . కొందరిలో ఇది అంగిలి లోపలి దాకా ఉంటుంది అప్పుడు దానిని చీలిక అంగిలి (క్లెఫ్ట్ పాలెట్ లేదా Cleft palate) అంటారు. గ్రహణం మొర్రి అనేది మూఢ నమ్మకాలు ప్రోత్సహించేదిగా ఉంది. ఎందువలన అంటే గ్రహణం అనేదానికి ఈ వ్యాధికి ఎటువంటి సంబంధం లేదు. గోరా గారికి 9 మంది పిల్లలు పుట్టారు. గోరా గారు తన భార్యకి గర్భం వచ్చిన ప్రతిసారి గ్రహణం సమయంలో గర్భవతిగా ఉన్న ఆమెని బయటకి తీసుకువెళ్ళి తిప్పేవారు, గ్రహణం సమయంలో గర్భిణులు బయట తిరిగినంత మాత్రాన పుట్టబోయే పిల్లలకి గ్రహణం మొర్రి రాదు అని నిరూపించడానికి. గోరా గారి పిల్లలలో ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు

ప్రస్తుతం మనదేశంలో 10 లక్షలమందికి పైగా చిన్నారులు ఇలాంటి సమస్యతో జీవిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో జన్మిస్తున్న ప్రతి 700 మంది చిన్నారుల్లో ఒకరు ఇలాంటి సమస్యతో పుడుతున్నట్లు గుర్తించారు. అంటే భారతదేశంలో ఏటా 30 వేలమంది పిల్లలు ఇలాంటి సమస్యతో పుడుతున్నారు. దీనివల్ల ఎదిగే దశలో పిల్లకు సామాజిక సమస్యలే కాకుండా, పాలు తాగటం, మాట్లాడటం కూడా సమస్యలే. గర్భం దాల్చిన సమయంలో తల్లి తీసుకునే ఆహారం, పోషకాల ప్రభావం పొట్టలోని బిడ్డపై పడుతుంది. కాబట్టి గర్భిణులు ఆకుకూరలు, నిమ్మజాతి పండ్లు, బీన్స్‌, పప్పు ధాన్యాలు, ఫోలిక్‌ ఆమ్లం సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకొంటే పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. దీనికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. పాప 3 నెలల వయసు ఉన్నప్పుడు శస్త్రచికిత్సచేస్తే మంచి ఫలితాలు కనబడతాయి. 3 నెలలు దాటిన తర్వాత కూడా చేయొచ్చు, కాని అంత మంచి ఫలితాలు ఉండకపోవచ్చు.

చీలిక పెదవి

[మార్చు]

చీలిక అంగిలి

[మార్చు]